Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యానిమల్ వంగా ఎదురుదాడితో… హఠాత్తుగా ఆత్మరక్షణలో జావేద్…

March 18, 2024 by M S R

కథా రచయిత, గీత రచయిత జావేద్ అఖ్తర్ యానిమల్ సినిమాపై చేసిన విమర్శ సహేతుకం… యానిమల్ వంటి సినిమాలపై సొసైటీ మాత్రమే కాదు, ఇండస్ట్రీ వైపు నుంచి స్పందన అవసరమే ఈరోజుల్లో..! ఐతే యానిమల్ దర్శకుడు వంగా సందీప్‌రెడ్డి ఆదే యానిమల్ ఇన్‌స్టింక్ట్‌తో ఎవరు విమర్శలు చేస్తే వాళ్లకు వెటకారం, వ్యంగ్యంతో జవాబులు ఇస్తున్నాడు… ఎదురు ప్రశ్నలు వేసి, ఉల్టా దాడి చేయడమే జస్టిఫికేషన్ అనుకుంటే ఇక ఎవరేం మాట్లాడతారు..?

జావేద్‌కూ అలాంటి రిప్లయ్ ఇచ్చాడు… ఎప్పుడైతే జావేద్ కొడుకును ముందుబెట్టి వంగా సందీప్‌రెడ్డి ప్రతివిమర్శలు చేశాడో అప్పుడే జావేద్ విమర్శల్లో పంచ్ లేకుండా పోయింది… తను ఆత్మరక్షణలో పడిపోయాడు… బహుశా వంగా సందీప్‌రెడ్డి తను జావేద్‌కు కీలెరిగి వాత పెట్టానని సంబురం ఫీలవుతున్నాడేమో గానీ… జావేద్ విమర్శ మీద ఇండస్ట్రీలో బాగానే చర్చ జరిగింది… యానిమల్ ఇజ్జత్ కూడా పోయింది…

Javed Akhtar has now responded to Sandeep Reddy Vanga over Animal criticism

యానిమల్ సినిమాలో డైలాగ్స్, తీసుకున్న లైన్, కంటెంట్, కొన్ని సీన్ల మీద జావేద్ ప్రత్యేకించి బూట్లు నాకడం, ఈడ్చి చెంప మీద కొట్టి సమర్థించుకోవడం వంటివి రాబోయే కాలంలో ఇండస్ట్రీకి, సొసైటీకి కూడా డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నాయనేది జావేద్ విమర్శ… (రష్మికతో కొంత, తృప్తితో ఘాటు ఇంటిమేట్ సీన్ల మీద సోషల్ మీడియాలో కూడా బాగా చర్చ, రచ్చ చోటుచేసుకున్నాయి… హీరో యానిమల్ టైప్ స్త్రీద్వేష కేరక్టరైజేషన్ మీద కూడా…)

Ads

దీనికి సందీప్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ.,. చెప్పొచ్చావు లేవోయ్, నీ కొడుకు ఫర్హాన్ అఖ్తర్ తీసిన మీర్జాపూర్ సీరిస్ మాటేమిటి..? అన్నీ బూతులే కదా, దీన్నెలా సమర్థిస్తావ్, అదెందుకు మాట్లాడవ్ అన్నట్టుగా బదులిచ్చాడు… దీంతో జావేద్ డిఫెన్స్‌లో పడిపోయాడు… ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కామెంట్స్‌ను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు కానీ నప్పలేదు… పంచ్ లేదు…

‘‘మీర్జాపూర్ సీరీస్‌కు మా అబ్బాయి రచయిత కాదు, దర్శకుడు కాదు, అందులో నటించలేదు… కొందరు నిర్మాతల్లో తనూ ఒకడు… ఐనాసరే, మేం ఇలాగే సినిమాలు తీస్తాం అంటున్నారంటే మీ ఇష్టం… ఒకటి కాదు, ఇంకా చాలా యానిమల్స్ తీయండి… కానీ 53 ఏళ్ల నా కెరీర్‌లో అలాంటి సీన్లు, అలాంటి డైలాగులు, అలాంటి పాట ఒక్కటి చూపించి, నా విమర్శలకు జవాబు ఇవ్వండి… అంతేగానీ మా అబ్బాయిని ముందుబెట్టి, మీరు చేసిందంతా కరెక్టే అని సమర్థించుకోకండి’’ అని చెప్పుకొచ్చాడు…

‘‘అలాంటి సీన్లు, డైలాగులు ఎవరు తీసినా, రాసినా నేను వ్యతిరేకిస్తాను’’ అని ఒక్క మాట అనుంటే వంగా సందీప్‌రెడ్డి మొహం మాడిపోయేది… కానీ జావేద్ ‘‘ఆ సినిమా నేను చూడలేదు, ఆ సీన్ల గురించి ఎవరో చెబితే విన్నాను’’ అనడంతో మరింత తన విమర్శల్లో పదును పోయింది… అవును, వంగా సమర్థన తీరు కరెక్టుగా లేదు గానీ మీర్జాపూర్ సీరీస్ ఈ వెగటు ట్రెండ్‌లో ఏమీ తీసిపోలేదు కదా జావేద్ భాయ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions