త్రిపుర సీఎం… బిప్లబ్ దేబ్…. పలకడానికి కష్టంగా ఉందా…? నిజమే, కష్టమే, తనను అర్థం చేసుకోవడంలాగే తన పేరు కూడా…. తన పేరు విప్లవ్ దేవ్… బెంగాలీ భాషలో వ ఉండదు కదా, బ అని పలకాలి కదా… ఇదీ అంతే… జనం నవ్విపోతారు అనే సోయి కూడా లేకుండా, గతంలో పలుసార్లు అనేక అంశాల్లో తన అపరిమిత జ్ఞానసంపదను జాతికి ప్రదర్శించాడు కదా, ఈసారీ అంతే… ‘‘మా అమిత్ షా నేపాల్, శ్రీలంకల్లోకి కూడా బీజేపీని విస్తరించి, ఆ దేశాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సంకల్పించాడు’’ అని అంటున్నాడు… అదెలా..? వేరే దేశాల్లో మన దేశ పార్టీ విస్తరించడం ఏమిటి..? ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏమిటి అనే సందేహాలు, ప్రశ్నలు మీకు రాకూడదు… సామాన్యుడి జేబులు కత్తిరించేలా పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్ ధరల మీదొట్టు… మీరలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయకూడదు… ఎందుకంటే… బీజేపీని అభిమానించే వాళ్లు కూడా తిక్కరేగి, తిట్టుకునే కేరక్టర్లు ఇవి…
అసలు ఒక దేశంలోని ఒక పార్టీ వేరే దేశాల్లోకి కూడా విస్తరించవచ్చా..? దానికి ఆయా దేశాల రాజ్యాంగాలు అనుమతిస్తాయా…? వేరే దేశపు పార్టీలను ఆ ప్రజలు అంగీకరిస్తారా.,.? అలాంటప్పుడు భారతీయ కమ్యూనిస్టు పార్టీ, లెక్కలేనన్ని ఇతర లెఫ్ట్ పార్టీలు దేనికి..? చైనా కమ్యూనిస్టు పార్టీ అని సొంత శాఖే ఏర్పాటు చేసేది కదా చైనా… ఇండియాలోనే కాదు, బోలెడు దేశాల్లో పార్టీ శాఖల్ని ఏర్పాటు చేసేది కదా…!! అఫ్ కోర్స్, ఆ చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పుచేతల్లో, ఆ ఎంగిలి భావజాలంలో బతికే పక్కా విదేశీ పార్టీయే… కానీ అది చైనా పార్టీ అధికారిక శాఖ కాదు, పేరుకు మన రాజ్యాంగం మేరకు ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ అంటూ ఓ సొంత దుకాణం పెట్టారు కదా… సేమ్, శ్రీలంకలో అయినా, నేపాల్లో అయినా… బీజేపీ తన పార్టీ శాఖలు ఏర్పాటు చేయలేదు, కాకపోతే బీజేపీ ఆఫ్ నేపాల్, బీజేపీ ఆఫ్ శ్రీలంక అని పెట్టుకోవాల్సిందే…
Ads
ఈ విప్లవదేవుడికి తెలియనిది మరొకటి ఉంది… శ్రీలంకనే ఉదాహరణగా తీసుకుంటే… అది నొటోరియస్ జాతీయవాదం ఉన్న దేశం… అక్కడి బుద్దిస్టులు, ముస్లిములు, క్రిస్టియన్లు మాత్రమే కాదు, హిందువులనూ దగ్గరకు రానివ్వరు… అంతటి మోస్ట్ నొటోరియస్ తమిళ ప్రత్యేక వాదాన్నే తుత్తునియం చేశారు… ఈలం అనే భావననే దాదాపు బొందపెట్టేశారు… పైగా ఇదే బీజేపీ ఒకవేళ అక్కడ పార్టీ శాఖను ఏర్పాటు చేసినా సరే, తమిళ ప్రజలు దాన్ని విశ్వసించరు… బీజేపీ ఓ ఆర్యన్ పార్టీ… ఉత్తరాది పార్టీ… అది యాంటీ-ద్రవిడ పార్టీ… మరి శ్రీలంకలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తావోయ్ విప్లవ దేవుడా..? నీ నోటికెంత వస్తే అంతేనా..? సేమ్, నేపాల్..! ఇంకా నయం… అమిత్ షా చైనా, కెనడా, బ్రిటన్, అమెరికాల్లో కూడా పార్టీ, ప్రభుత్వ విస్తరణలపై ఆలోచిస్తున్నాడనలేదు… హమ్మయ్య… ఎంతైనా నువ్వు గ్రేట్ బాసూ… ఏళ్ల తరబడీ లెఫ్ట్ పాలనలో, రాజకీయ చైతన్యం పెంచుకున్నారని అందరూ విశ్వసించిన ప్రజలు నిన్ను సీఎంగా ఎన్నుకోవడం అంటే మామూలు విషయమా మరి..?! అవును, బ్రదరూ… బర్మా, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నీకు ఏం అన్యాయం చేశాయి..?!!
Share this Article