టీవీలో సుడిగాలి సుధీర్‌ను చూస్తుంటే ఎందుకు ప్లజెంటుగా ఉంటుంది..? ఆఫ్టరాల్ టీవీ స్టార్ అని తీసిపారేయకండి… తను తెలియని తెలుగు ఇల్లు లేదు… బుల్లితెర సూపర్ స్టార్ తను… (సీరియల్ నటుల కథ వేరు…) తన పాపులారిటీ చూసి తోటి ఆర్టిస్టులే ఈర్ష్యపడుతూ ఉంటారు… తన స్కిట్లు, షోలలో బ్యూటీ ఏమిటంటే..? తన మీదే సెటైర్లు పడుతుంటయ్, వేసుకుంటాడు, అమాయకంగా మొహం పెడతాడు, అందరు ఎన్నిరకాలుగా తనపైనే పంచులు వేస్తున్నా సరే, హేపీగా యాక్సెప్ట్ చేస్తాడు… చివరకు తను టీం లీడర్‌గా ఉన్న జబర్దస్త్ స్కిట్లలో కూడా తన మీదే పంచులు వేయించుకుంటాడు… ఇది ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే..? తను కూడా నిజానికి వెండితెర హీరోయే కదా… సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీమంకీస్ అయిపోయాయి, త్వరలో కాలింగ్ సహస్ర అని ఏదో సినిమా వస్తోంది… మరి తను హీరో అయి ఉండి, అల్లు అరవింద్ సినిమాలో ఆమధ్య ఏ రోల్ చేశాడు అనేది జబర్దస్త్ స్కిట్లో భలే నవ్వులు పూయించింది… విషయంలో నవ్వొచ్చే కంటెంటుకన్నా రోజా దాన్ని చెప్పిన తీరు మరీ బాగుంది…
ఓ స్కిట్… సుధీర్ హీరో, ఓ దర్శకుడు వచ్చి రెమ్యునరేషన్ విషయంలో బేరం ఆడుతుంటాడు… పొట్టి నరేష్ సుధీర్‌ను పొగుడుతూ కాస్త ఎక్కువకు సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు… ఈ సందర్భంగా ‘‘సుధీర్ సినిమాలో బన్నీ వచ్చి గెస్ట్ రోల్ ప్లే చేస్తే గ్రేటే… కానీ బన్నీ సినిమాలో సుధీర్ గెస్ట్ రోల్ చేయడం ఇంకా గ్రేట్’’ అని ఇంకా గ్యాస్ కొడుతూ ఉంటాడు… అందరూ ఆశ్చర్యపోతారు… బన్నీ సినిమాలో సుధీర్‌కు అంత ఇంపార్టెన్సా..? భలే ఉందే, ఇంతకీ ఏమిటా సినిమా..? రోజా వెంటనే పట్టేసుకుంది… రేసుగుర్రం అని పకపకా నవ్వుతూ ప్రకటించేసింది… ‘‘అసలు ఆ సినిమాలో నువ్వు ఉన్నావా..?’’ అని రష్మి కూడా హాశ్చర్యపోతుంది… సుధీర్ సంగతుల్లో రష్మికి తెలియనివి ఉండటం కూడా విశేషమే… ‘‘ఉన్నాడు, ఉన్నాడు… ఓ సీన్లో కారు తుడుస్తుంటాడు సుధీర్, నేను మా వాడికి అదుగో సుధీర్ అని చూపించేలోగా సీన్ అయిపోతుంది…’’ అని రోజా చెబుతుంటే అందరూ సుధీర్ వంక చూస్తూ నవ్వుతుంటారు… అంటే, ఆ రెండు సెకన్ల సీన్ అన్నమాట సుధీర్ చేసింది… అదీ కారు తుడిచే సీన్… ఎక్స్ట్రా ఆర్టిస్టుకన్నా ఇంకాస్త తక్కువే… అలాంటి చేదు సీన్లను, అనుభవాల్ని నిజానికి ఆర్టిస్టులు బయట చెప్పుకోవడానికే ఇష్టపడరు… నిజానికి సుధీర్ ఆ సీన్ చేయడం కూడా తనను తాను తక్కువ చేసుకోవడమే… ఐనాసరే, జబర్దస్త్ ద్వారా కోట్లాది మందికి ఇది తెలిసేలా ఎవరో స్కిట్ రాసినా… సుధీర్ దాన్ని హేపీగా యాక్సెప్ట్ చేశాడు… అదీ సుధీర్‌లో నచ్చేది… పక్కా డౌన్ టు ఎర్త్… ఆ హంబుల్‌నెస్ విడిచిపెట్టకపోవడమే ఒక సుగుణం… రియల్లీ కీపిటప్ సుధీర్…!!
Ads
Share this Article