సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ సెలబ్రిటీల గురించి కథలు రాస్తాం మనం… చదువుతాం… ఇన్ స్పిరేషన్ అనుకుంటాం… కానీ పేరొందిన సైంటిస్టులు, కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ఖతర్నాక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రత్యేకించి జడ్జిల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు… భిన్న రంగాల ప్రముఖుల జీవితాలు, జీవనశైలిపై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తోంది… గుడ్…
మన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లీగల్ సర్కిళ్లలో మంచి పేరు ఉంది… సహజంగానే తన లైఫ్ స్టయిల్‌పై కూడా రీడర్స్‌కు ఆసక్తి ఉంటుంది… ఆయనది చంద్రచూడ్ వారసత్వం… తాత లాయర్, అంకుల్ లాయర్… తండ్రి ఎక్కువ కాలం సుప్రీం చీఫ్ జస్టిస్‌గా చేశాడు… ఇంట్రస్టింగు తీర్పులు ఎన్నో… ఆయన ఇద్దరు కొడుకులూ లాయర్లే… అభినవ్ ముంబైలో, చింతన్ లండన్‌లో… అంటే వరుసగా నాలుగో తరం కూడా లాయర్లే…
మొత్తం కుటుంబ వాతావరణమంతా సెక్షన్లు, రాజ్యాంగం, దావాలు, హక్కులతో నిండి ఉంటుంది… ఢిల్లీలో లా డిగ్రీ చేశాక, హార్వర్డ్ లా మాస్టర్స్ స్టూడెంట్ తను… తరువాత ముంబై, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీస్… 38 ఏళ్లకే సీనియర్ అడ్వొకేట్… తరువాత హైకోర్టు జడ్జిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్…
(
ఇదంతా ది వీక్ మీడియాలో వచ్చింది… రీసెంటుగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ స్టయిల్ వివరాలూ షేర్ చేసుకున్నాడు… ‘‘నా దినచర్య తెల్లవారుజామున 3.30 గంటలకు స్టార్టవుతుంది… అప్పుడు వాతావరణం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది… (బ్రాహ్మిముహూర్తం)… 25 ఏళ్లుగా నేను యోగా చేస్తున్నాను… యోగా చేసే టైమ్ కూడా అదే…’’
Ads
నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నయ్… సమస్యలను అధగమిస్తామనే ఆశావాదంతో, నమ్మకంతో ఉండటమే శరణ్యం… ప్రతి కష్టానికి ఓ ప్రయోజనం ఉంటుంది… కష్టం వచ్చినప్పుడు అది తెలియదు, తరువాత తెలుసుకుంటాం… ఫుడ్ విషయానికి వస్తే తృణధాన్యాలకన్నా రాందాణా ఇష్టపడతాను… (దీన్నే రాజగిర royal grain అంటారు, బాగా పోషక విలువలున్న ఫుడ్)… 25 ఏళ్లుగా నేను ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాను… మహారాష్ట్రలో ఉపవాసం రోజుల్లో సాబుదానా కిచిడీ చేస్తారు… అదీ మంచిదే… ఈ ఫుడ్ అలవాట్లకు అప్పుడప్పుడూ బ్రేక్ (చీట్ డే) ఉంటుంది… ఐస్‌క్రీమ్ తింటాను… మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటే సగం సమస్యలు అవే పరిష్కారం అవుతాయి..’’
Share this Article