Nallamothu Sridhar Rao …. ఏ వైద్య విధానం సరైనది? ప్రతీ దాంట్లో వాదించుకోవడమే మనకు ఇష్టమా?
ఇంగ్లీష్ మెడిసిన్ (అల్లోపతి) గొప్పదా, ఆయుర్వేదం గొప్పదా, హోమియో గొప్పదా, ఎనర్జీ మెడిసిన్.. ఇలా ఏవి గొప్పవి అని ఎవరివారు వాదించుకోవడం పూర్తిగా అర్థరహితం. చిన్న ఉదాహరణతో మొదలుపెడతాను.
మీకు జలుబు వచ్చింది అనుకోండి.. ముక్కులు కారుతుంటే, కొద్దిగా పసుపు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం చేస్తారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మెడిసిన్ స్పెషలిస్టులు కూడా ఇదే పని చేస్తారు. పసుపు ఏంటి? ఆయుర్వేదం కోవకు చెందిందే కదా! కొంతమంది బజ్జీలు తినేటప్పుడు వాము బజ్జీలు తింటారు, వాము, జీలకర్ర డైజెస్టివ్ సిస్టమ్‌ని మెరుగుపరుస్తాయని తరాల తరబడి అందరూ ఫాలో అవుతుంటారు. ఇదేంటి.. ఆయుర్వేదమే కదా!
Ads
కొంతమందికి సమస్య ప్రారంభ దశలో ఉంటే ఈ వంటింటి చిట్కాలతో తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే ఏ పాంటాప్రజోల్‌నో, రేజో లాంటివో వాడేసి ఉపశమనం పొందుతారు. సో అవసరాన్ని బట్టి ఏ వైద్య విధానం వాడాలన్నది ఒక వ్యక్తి యొక్క ఇండివిడ్యువల్ ఛాయిస్. మీరు ఇదే వాడండి.. అని ఎవరూ ఎవర్నీ బలవంతం చెయ్యలేరు. అది ఒక వ్యక్తి free willని అడ్డుకున్నట్లు అవుతుంది. యూనివర్శ్‌లో వందలాది ఛాయిస్‌లు ఉంటాయి.. తనకు నచ్చిన, తనకు ఇష్టమైన ఛాయిస్‌ని అవసరాన్నిబట్టి ఎంచుకునే స్వేచ్ఛ మనిషికి ఉంటుంది.
అలాగే ఆయుర్వేదం, హోమియో, ఎనర్జీ మెడిసిన్ ద్వారా ఎన్నో క్రానిక్ డిసీజెస్ తగ్గిన సందర్భాలున్నాయి. అవి ఎవరి స్వీయ అనుభవాలు వారివి. ప్రాణాపాయ స్థితి నుండి ఇంగ్లీష్ మెడిసిన్, సర్జరీలు మనిషిని కాపాడిన సందర్భాలూ కోకొల్లలు. ఏదీ తక్కువ కాదు.. అన్ని వైద్య విధానాలూ ఏ స్థాయిలో వాటి ఫలితాన్ని అందిస్తూనే ఉంటాయి.
“సద్గురు ఆయుర్వేదాన్ని సమర్థిస్తారు కాబట్టి.. ఇంగ్లీష్ మెడిసిన్ అందించే హాస్పిటల్‌లో జాయిన్ కాకూడదు” అని బలంగా వాదించడం ఓ రకమైన మూర్ఖత్వం. సరిగ్గా ఇలానే వాదించడం ఇష్టమైతే, ఓ మెడిసిన్ రూపంలో మన వంటల్లోకి వచ్చి చేరిన వెల్లుల్లి (కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని), యాంటీబయాటిక్‌లా పనిచేస్తుందని వాడబడుతున్న పసుపుని, మనిషి భావోద్వేగపు స్థితిని బ్యాలెన్స్ చేస్తుందని ప్రవేశపెట్టబడిన గసగసాలు.. ఇలా ప్రతీ దాన్నీ ఇక నుండి మీ ఇంట్లో వాడడం మానేయండి.. దాని బదులు కొలెస్ట్రాల్ టాబ్లెట్‌ని ముక్కలు చేసి వంటలో వాడండి.. పసుపు బదులు ఎరిథ్రోమైసిస్ పౌడర్‌ని కూరల్లో కలుపుకోండి.. Yeah.. కేవలం ఒక వైద్య విధానమే గొప్పదని భావించే వారు, it is better to stop using alternate medicine in your day to day life.
మనిషికి జీవించే హక్కు ప్రకృతి ప్రసాదించింది. అందుకే భూమి మీద దొరికే 94 వరకూ వివిధ రకాల మినరల్స్‌లో 40 మినరల్స్ మన శరీరానికి అవసరం అవుతాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ధాతువులు లేకపోతే మనిషి బ్రతకలేడు. ప్రకృతిలోని వన మూలికలతో ఆయుర్వేదం ఎలా పుట్టుకొచ్చి శరీరంలోని అసమతౌల్యతలను సరిచేస్తోందో… కెమికల్స్ చర్యా, ప్రతిచర్యా ద్వారా శరీరానికి స్వస్థత చేకూర్చే పనిని ఇంగ్లీష్ మెడిసిన్ చేస్తోంది.
మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా, ఆయుర్వేదం, హోమియో, ఇంకా విభిన్న రకాల మెడిసిన్స్ వాడుతున్నా ఆ సమస్య మేనేజబుల్‌గా ఉన్నంత వరకూ మీకు ఇష్టమైన దాన్ని వాడొచ్చు. ఒకవేళ సమస్య ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్‌లో సర్జరీల సపోర్ట్ తీసుకోవచ్చు. దీంట్లో తప్పేముంది? కావలసింది మనిషి బ్రతకడం.. ఏ వైద్య విధానం వాడితే తప్పేంటి? అలాగే ఒక వ్యక్తికి ఆయుర్వేదం నచ్చితే, ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దని చెప్పడానికి, హాస్పిటల్స్‌కి వెళ్లొద్దని చెప్పడానికి మనమెవ్వరం? (రామంతపూర్ హోమియో వైద్యశాల డాక్టర్లు సీసీఎంబీ సహకారంతో హోమియో మందులతో ఎయిడ్స్ వైరల్ లోడ్ గణనీయంగా తగ్గించగలిగారు…)
ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కిడ్నీల మీద లోడ్ పడుతుందని చాలామంది మందులు వాడడానికి ఇష్టపడరు. అందుకే వంటింటి చిట్కాలు ఫాలో అవుతుంటారు. ఇదే విషయం దీన్ని నమ్మే వారు తమ అభిప్రాయంగా రాస్తుంటారు, షేర్ చేస్తుంటారు. మరోవైపు ఆయుర్వేదంలో కొన్ని చికిత్సల వల్ల లివర్ పాడై సమస్యలు ఎదుర్కొనే వారూ ఉంటారు. దాని గురించీ డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. సో, ఇవన్నీ వారి వారి స్వంత అభిప్రాయాలు. ఒక మనిషికి ఒక వైద్య విధానంలో ఉన్న లోపాల గురించి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది.
అతను అలా మాట్లాడాడు కాబట్టి.. ఇతర వైద్య విధానాలు వాడొద్దని బలవంతం పెట్టే హక్కు ఏ మనిషికీ లేదు. కారణం వాదన వేరు.. అభిప్రాయం వేరు.. ప్రాణం వేరు! ప్రాణాలతో బ్రతికే హక్కు మనిషికి డీఫాల్ట్‌గా ఉంటుంది. కేవలం అతని అభిప్రాయాన్ని సాకుగా చూపించి, నువ్వు ఫలానా వైద్య విధానాన్ని వ్యతిరేకించావు కాబట్టి.. నువ్వు హాస్పిటల్‌గా వెళ్లకుండా చచ్చిపో అని అనడం, వాదించడం, ట్రోల్ చెయ్యడం, పైశాచికానందం పొందడం ఏదైతే ఉందో అది మనిషి తత్వం కాదు.. రాక్షస తత్వం. అలాంటి రాక్షస తత్వం మన సమాజంలో ఇంకా పెరగకూడదు అనే ఆశతో ఇంత వివరంగా రాశాను. నువ్వు జీవించు.. ఇంకొకరిని జీవించనివ్వు!!
Share this Article