Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రబ్రీదేవి కాలేకపోవచ్చు… ఆమెకూ కోర్టు సమన్లు..!!

March 24, 2024 by M S R

Pardha Saradhi Potluri ….. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు తరువాత జరిగిన డ్రామా! అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ, అడ్వకేట్ దే ప్రధాన పాత్ర!

జస్ట్ కపిల్ సిబాల్ ఎలా అయితే ప్రతిపక్షాల కేసులతో లాభపడుతున్నాడో, అదే స్టయిల్ లో అభిషేక్ మను సింఘ్వీ కూడా లాభ పడుతున్నాడు.

కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు జరిగిన డ్రామా ఏమిటంటే… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయబోతున్నారు అని తెలుసుకొని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మను సింఘ్వీ!

Ads

ఇద్దరు సభ్యుల హై కోర్టు బెంచ్ లో జస్టిస్ మనోజ్ కుమార్, జస్టిస్ మనోజ్ జైన్ ఉన్నారు.

ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు వాదనకి దిగారు.

హై కోర్టు బెంచ్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతున్నారు కదా, ముందు మీ అభ్యంతరాలు ఏమిటో చెప్పండి అని రాజుని అడిగింది.

బంచ్ ఆఫ్ ఫైల్స్ బెంచ్ ముందు ఉంచి, ఒక్కో ఫైలు దానిలో ఉన్న విషయాన్ని వివరించారు ASG రాజు…

హై కోర్టు బెంచ్: ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా పెట్టుకొని ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు మీరు?

ASG రాజు : తొమ్మిది సార్లు ED సమన్లు ఇచ్చినా ప్రతిసారీ ఏదో ఒక కారణం చెపుతూ కేజ్రీవాల్ ED ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు.

హై కోర్టు బెంచ్ కేజ్రీవాల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నాము అంటూ తీర్పు ఇచ్చింది!

*********************

వెంటనే ED 13 వాహనాలలో కేజ్రీవాల్ నివాసం శీష్ మహల్ కి బయలుదేరే ముందు, భద్రత కోసం CRPF తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను శీష్ మహల్ దగ్గరికి రావాల్సిందిగా కోరారు.

ED అధికారులు శీష్ మహల్ లోకి ప్రవేశించగానే కేజ్రీవాల్ తనని అరెస్ట్ చేయవద్దని, మీతో సహకరిస్తానని ప్రాధేయపడ్డాడు.

సరే అని అధికారులు ఒక్కో ప్రశ్న సంధిస్తూ ఉంటే నేరుగా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం మొదలు పెట్టాడు.

ఇక లాభం లేదని అధికారులు ఫైల్ ముందు పెట్టి చదివి సంతకం పెట్టమని అడిగారు.

కేజ్రీవాల్ సంతకం పెట్టడానికి నిరాకరించాడు. తప్పనిసరి పరిస్థితులలో కేజ్రీవాల్ ను కస్టడీలోకి తీసుకుని రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లడానికి బయటకి రాగానే మొత్తం రోడ్  బ్లాక్ చేశారు aap నాయకులు!

Aap నాయకులు అధికారుల మీద దాడి చేయడానికీ ప్రయత్నించారు.

ED అధికారులు అతి కష్టం మీద Rous Evenue కోర్టుకు తీసుకెళ్లారు కేజ్రీవాల్ ను!

****************

ED అధికారులు కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ రిమాండ్ కి ఇవ్వమని పిటిషన్ వేశారు!

ఇక అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించాడు తన వంతుగా!

అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించి కోర్టు నుండి వెళ్లిపోయాడు.

వెంటనే మరో ఇద్దరు అడ్వకేట్లు చౌధురీ, గుప్తాలు ఒకరి తరువాత ఒకరు వాదనలు చేశారు కోర్టు ప్రొసీడింగ్స్ ను విస్మరించి.

అభిషేక్ మను సింఘ్వీ డ్రామా!

తన వాదనలు వినిపించి వెంటనే తన సహచర అడ్వకేట్స్ కి కూడా చెప్పకుండా కోర్టు బయటకి వచ్చిన అభిషేక్ మను సింఘ్వీ వరసగా ప్రతిపక్ష నాయకులకి ఫోన్లు చేసి రెచ్చగొట్టాడు: ఇదే మంచి సమయం, మనం అందరం ఒక్కటి అయిపోయి గట్టిగా నిలబడి, కేజ్రీవాల్ కి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని…

వెంటనే ప్రతిపక్ష నాయకులు ముక్త కంఠంతో ఇచ్చిన నినాదం – ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది – Democracy in Danger!

డెమోక్రసీ ఇన్ డేంజర్ అనేది అమెరికా యూరోపుల నినాదం అన్నది గుర్తు పెట్టుకోవాలి!

*********************

కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వగానే వెంటనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మను సింఘ్వీ!

సుప్రీం కోర్టు కింది కోర్టులో తేల్చుకోండి అని సలహా ఇవ్వడంతో తిరిగి ఢిల్లీ హై కోర్టు లో పిటిషన్ వేశాడు.

ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆదివారం అయినా సరే మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మను సింఘ్వీ!

రేపు హోలీ పండుగ కాబట్టి కోర్టుకి సెలవు. మంగళ వారం రోజున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వవచ్చు.

జస్ట్ కపిల్ సిబాల్ లాగానే అభిషేక్ మను సింఘ్వీ కూడా ఎంపీగా, అడ్వకేట్ గా రెండు తరాలకి సరిపడా సంపాదించేశాడు.

******************

ఈ రోజు జైలు నుండి ఆర్డర్ పాస్ చేశాడు కేజ్రీవాల్ ముఖ్యంత్రి హోదాలో!

పోయిన సంవత్సరం ఉప ముఖ్యమంత్రి హోదాలో మనీష్ సిసోడియా కూడా ఆరు నెలలు జైల్లో ఉండే అధికారులకి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే!

కేజ్రీవాల్ రాజీనామా చేయడు!

అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ పాలన పెట్టడం లీగల్ గా సాధ్యం కాదు, ఎందుకంటే అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 62 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

*******************

ఇది మరో ట్విస్ట్!

కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించే ఆలోచనలో ఉన్న కేజ్రీవాల్ కి చెక్ పెట్టింది ఎలక్షన్ కమిషన్!

సునీత కేజ్రీవాల్ కి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది!

***************

ఢిల్లీ కోర్టు సునీతా కేజ్రీవాల్ కి తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది!

1.ఢిల్లీ లోని చాందినీ చౌక్ నియోజక వర్గంలో సునీతా కేజ్రీవాల్ ఓటర్ గా నమోదు చేసుకుంది.

2. ఉత్తర ప్రదేశ్ లోని సాహిబాబాద్ నియోజక వర్గంలో సునీతా కేజ్రీవాల్ ఓటర్ గా నమోదు చేసుకుంది!

3. ఢిల్లీలోని తీస్ హజార్ కోర్టు సమన్లు జారీ చేసింది!

4. సెక్షన్ 17, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము రెండు చోట్ల ఓటర్ గా నమోదు చేసుకోవడం నేరం.

So! సునీతా కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిని చేయడానికీ ఇప్పట్లో సాధ్యం కాదు!

Aap నాయకుల నుండే ఎవరో ఒకరిని ఎంచుకోవాలి కేజ్రీవాల్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions