Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని ధర్మదాత… ఎవ్వడి కోసం ఎవడున్నాడు… పొండిరా పొండి…

March 26, 2024 by M S R

Subramanyam Dogiparthi….. ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి , నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి , ఉన్న వాడిదే రాజ్యమురా లేనివాడి పని పూజ్యమురా , మనుషులలోన మమతలు లేవు మంచితనానికి రోజులు కావు , పొండిరా పొండి . వీర హిట్టయిన పాట . పట్టుదలతో పోగొట్టుకున్న రాజమహల్ని తిరిగి పొందటానికి ఓ ధర్మదాత పడే ఆరాటం , ముసలి పౌరుషం . తమ దార్లు తాము చూసుకున్న పిల్లలను ఉద్దేశించి పాడే ఈ పాటలో ANR నటన బ్రహ్మాండం . సినిమా పేరు కూడా ధర్మదాత…


రెండు రోజులు భోజనం చేయలేదట ANR ఈ పాటకు మొహంలో దైన్యం కోసం . సినిమా కాబట్టి దారితప్పిన కొడుకులు దారికొచ్చారు . నిజ జీవితంలో ఈరోజుల్లో సంతానానికి వాళ్ళ తిక్కలు , బలుపులు , idiosyncrasies , eccentricities , pervertions వారివే . తల్లిదండ్రుల ఆశయాల గురించి , పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది . తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ళని తాకట్టు పెట్టే సంతానం పెరిగిపోతున్న రోజులు .

తమిళంలో హిట్టయిన ఎంగ ఊరు రాజా అనే సినిమాకు రీమేక్ . నాగేశ్వరరావు పాత్రను శివాజీ గణేశన్ వేసారు . ధర్మదాత 11 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . హైదరాబాద్ శాంతి థియేటర్లో శత దినోత్సవం జరిగింది . అక్కినేని సంజీవి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ANR ద్విపాత్రాభినయం , జానకి , కాంచన , నాగభూషణం , పద్మనాభం , గీతాంజలి , ఝాన్సీ , రేలంగి , అనిత ప్రభృతులు నటించారు .

Ads

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . జో లాలీ జో లాలి లాలీ నా చిట్టితల్లి , చిన్నారీ బుల్లెమ్మ సిగ్గెందుకులేవమ్మా , హల్లో ఇంజనియర్ , ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి , ఎవరూ నీవారు కారు నీ తోడు రారు , ఓ నాన్నా నే మనసే వెన్న పాటలు చాలా బాగుంటాయి . పునర్జన్మ సినిమాలోని ఎవరివో నీవెవరివో పాటతో మొదలు పెట్టి ఇతర పాటలను మిక్సింగ్ చేసి పద్మనాభం , గీతాంజలిల మీద తీసిన పాట సరదాగా ఉంటుంది .

ప్రధానంగా చెప్పుకోవలసింది నాగేశ్వరరావు నటనే . ముసలి పౌరుషం , పట్టుదల , ఆత్మాభిమానం , పోగొట్టుకున్న రాచరికం , పోగొట్టుకోని దాతృత్వం వంటి విభిన్న షేడ్లలో బాగా నటించారు . కుర్ర నాగేశ్వరరావుగా చలాకీగా విభిన్నత్వం చక్కగా చూపారు . మా నరసరావుపేటలోనే చాలాసార్లు చూసా . టివిలో కూడా వచ్చినప్పుడల్లా చూస్తుంటా . ముసలి ANR పాత్ర మీద నాకు చాలా సానుభూతి . నన్ను నేను చూసుకుంటూ ఉంటా . సినిమాలో ANR సక్సెస్ అయ్యాడు . నేను పొరపాటున కూడా సక్సెస్ కాను . తేడా అంతే .

యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . Feel Good , emotional , entertaining and musically hit movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugumovies #telugucinema #telugureels 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ కృష్ణే బతికి ఉంటే… ఎన్ని గొప్ప ప్రజా సినిమాలు వచ్చి ఉండేవో కదా…
  • SCO దెబ్బ..! సొంత గోచీబట్ట సర్దుకుంటూ ట్రంపు ఆపసోపాలు..!!
  • Anjana Krishna IPS …. ఇంతకీ ఎవరీ లేడీ సింగం..? ఏమిటీ వివాదం..?!
  • మౌనమే మన స్ట్రాటజీ… ట్రంపుడు అందుకే అగ్గిమండిపోతున్నాడు…
  • కుటుంబమే వదిలేసేసరికి… ఇక కవితపై పింక్ శ్రేణుల ఉగ్ర దాడి..!
  • కారుతో పులిని గుద్దేశాడు… పులి హతం, కారు పల్టీ… దేహమంతా గాయాలు…
  • పెప్పర్ వడ విత్ రసం… ఆహా… సరిగ్గా కుదరాలే గానీ అదుర్స్…
  • Pure Veg Mineral Water…! అంతా మాయ.., అంతా మన భ్రమ… అంతా ఓ దందా…
  • ‘‘ నెల రోజులపాటు పొద్దున్నే రండి.., జీవితాంతం ఉద్యోగభద్రత ఇస్తా ’’
  • ఆ చిన్న పాట వందల మందిని చంపేసింది… ఆ రచయితను కూడా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions