Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… మస్తు కథల్ చెబుతున్నవ్ కస్తూరమ్మా… కానీ మరీ ఈ రేంజా..?

March 28, 2024 by M S R

ఈమధ్యకాలంలో బాగా నవ్వుకున్న ఇంటర్వ్యూ ఒకటి… అదేదో యూట్యూబ్ చానెల్‌లో… నటి కస్తూరి తెలుసు కదా… ప్రధానంగా తమిళ నటి, అప్పుడప్పుడూ కన్నడ, మలయాళం, తెలుగులో కూడా..! మోడల్, కాలమిస్ట్, టీవీ ప్రజెంటర్… ఒకసారి బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎట్సెట్రా…

కస్తూరి అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది అన్నమయ్యలో చేసిన ఓ పాత్ర… ఓసారి The Bodies of Mothers: A Beautiful Body Project అనే ఓ పుస్తకం కోసం చాన్నాళ్ల క్రితం టాప్ లెస్‌గా ఫోటో దిగడం… ఆమధ్య ఆ పాత ఫోటోను మళ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం, సరోగసీపై నయనతార మీద వ్యాఖ్యలు సహా చాలా సోషల్ ఇష్యూస్ మీద ఇమీడియెట్‌గా రియాక్ట్ అయ్యే తీరు ఎట్సెట్రా… అంతేకాదు, ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ కూడా…

ఆమె వయస్సు 50 ఏళ్లు… ఇక చదవండి ఆమె సదరు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందో… ముఖ్యాంశాలు… దీన్ని టూమచ్ అనాలో, త్రీమచ్ అనాలో, మరేమనాలో…

Ads

కస్తూరి

‘‘మోహన్‌బాబుతో ఓ ప్రాజెక్టులో చాన్స్ వచ్చింది కానీ చేయలేకపోయాను… రజినీకాంత్‌తో మూడుసార్లు అవకాశం వచ్చింది, కానీ మూడుసార్లూ నటించలేకపోయాను, కాలా మూవీలో కూడా చాన్స్ ఇచ్చారు కానీ మరీ యంగ్‌గా ఉన్నానని తొలగించారు…

జెంటిల్‌మేన్ హిందీ రీమేక్‌లో కూడా చాన్స్ వచ్చింది, కానీ ఆ టైమ్‌కు టైఫాయిడ్ రావడంతో అది మిస్సయిపోయింది… చిరంజీవితో ఒక సినిమా కూడా… అంతెందుకు కల్యాణరామ్ డెవిల్ సినిమాకు సైన్ కూడా చేశాను, కానీ ఆయన పక్కన మరీ యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు… నాకు వయస్సు పెరగదా అని నేను ఫీల్ అవుతూ ఉంటాను… నాకు ఇప్పటికీ తెల్లజుట్టు రావట్లేదు తెలుసా… మదర్ క్యారెక్టర్స్ అయితే 30 ఏళ్లు మదర్ గా ఉండిపోవచ్చు… కానీ నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను కదా, ఎవరికి చేస్తాను చెప్పండి..?

Kasturi

మహేష్ బాబు వయస్సు నా వయస్సు సేమ్, ఆయనకు మదర్ రోల్ లో ఎలా చేస్తాను..? మహేష్ నేను జోడీలా ఉంటాం కదా, తనకు నేను తల్లిలా చేసినా బాగుండదు..’’ ఇవండీ ఆమె చెప్పుకున్న విశేషాలు…

ఈమె వయస్సు 50… 1991 నుంచీ సినిమాల్లో చేస్తోంది… ఓసారి కెరీర్ ఆపేసి, అమెరికా వెళ్లి, తిరిగి వచ్చి, రీఎంట్రీ… (ఇద్దరూ అమెరికాలో చదువుతారు పిల్లలు, ఒకమ్మాయి లుకేమియా సర్వైవర్…) మహేష్ బాబుకు జోడీ కాగలను తప్ప తల్లి ఎలా కాగలను అంటోంది… ఆమే ప్రస్తుతం తెలుగు టీవీలో గృహలక్ష్మి సీరియల్‌లో ముదురు తల్లిలా కనిపిస్తోంది… టీవీ సీరియల్‌లో కనిపించే ఈ తల్లి మహేష్ బాబుకు తల్లిగా చేస్తే ఏజ్ సూట్ కాదట… వామ్మో… (20 ఏళ్ల క్రితం అన్నమయ్యలో కూడా నాగార్జున పక్కన మరీ యంగ్ అని వద్దనుకుందేమో బహుశా మొదట, కానీ రాఘవేంద్రరావు ఒత్తిడి చేస్తే అంగీకరించిందేమో అయిష్టంగానే…)

రజినీకాంత్, మోహన్‌బాబు, రజినీకాంత్ సినిమాలు వచ్చాయట… హహహ… కల్యాణరామ్ వయస్సు 45, ఈమె 50… తన పక్కన యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారట… (ప్రభాస్, జూనియర్, రాంచరణ్, విజయ్, సూర్యలను వదిలేసింది ఫాఫం…) పోనీ, నటుడు శ్రీకాంత్ కొడుకు, యాంకర్ సుమ కొడుకు, సింగర్ సునీత కొడుకులతో ట్రై చేయలేకపోయావా కస్తూరీ… వాళ్ల పక్కన కూడా చిన్నగా, అంటే ఏజ్ తక్కువగా కనిపిస్తావేమో… ఐనా సరే, చల్తా… గ్రాఫిక్స్‌లో కాస్త వయస్సు పెంచి కవర్ చేద్దాం… ఏమంటావు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions