నో డౌట్… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోడీ పాపులారిటీ మీద ఆధారపడుతోంది… బలమైన సైద్ధాంతిక పునాది ఉన్నట్టు చెప్పుకునే బీజేపీ ‘సంఘ్’ బదులు ఓ వ్యక్తిపూజలో మునిగిపోవడం విచిత్రమే… దీంతో ప్రతిపక్షాలు మోడీ ఇమేజీని దెబ్బతీసే పనిలో పడ్డాయి… మోడీని డీఫేమ్ చేసేకొద్దీ తమకు వోట్లు పెరుగుతాయనే ఆశో లేక మోడీ పాపులారిటీని కౌంటర్ చేయలేని అసహాయతో… అన్ని గీతలూ దాటుతున్నారు…
మొన్నామధ్య లాలూప్రసాద్ యాదవ్ ‘‘తల్లి అంత్యక్రియలు చేసినవాడు గుండు గొరిగించుకోలేదు, తను హిందువే కాదు’’ అన్నాడు… ఎప్పటిలాగా కూసిన పిచ్చి కూత కాదు, టార్గెటెడ్… మోడీని, హిందుత్వను కలిపి తిట్టడం… అక్కడొకరు, ఇక్కడొకరు మోడీ మీద వ్యక్తిగత దాడిలా కామెంట్స్ చేస్తున్నారు… సరే, ప్రస్తుత రాజకీయాల స్టాండర్డ్స్ రీత్యా నిర్లిప్తంగా చదువుతూ, చూస్తూ ఉంటున్నామేమో…
Ads
టీఎంసీ నాయకుడొకరు పీజూష్ పాండా మరీ దారుణమైన వ్యాఖ్యలకు దిగాడు… తను బ్రాహ్మణుడు… తను మాట్లాడుతున్న ఓ వీడియోను బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి షేర్ చేశాడు ట్విట్టర్‌లో… ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తోసహా… అందులో ఈ పాండా ఏమంటాడంటే… ‘‘ఒక తేలి (గానుగ పట్టి నూనె అమ్ముకునే కులం… గుజరాత్‌లో ఓబీసీ… ) రామమందిరాన్ని ఎలా ప్రారంభిస్తాడు..? చిన్నతనంలో తను ఏదో రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్ముకున్నాడట, ఆ రైల్వే స్టేషన్ ఏదో చెబితే, ఆధారాలు చూపిస్తే నేను రాజకీయాల్నే వదిలేస్తాను…
మోడీ వయస్సు 70 ఏళ్లు, 50 ఏళ్ల క్రితం చదివాడో ఎవరికీ తెలియదు, అప్పటికి కంప్యూటర్లు, టైప్ రైటర్లు లేవు, అన్నీ చేతిరాతలే, కానీ మోడీ సర్టిఫికెట్లు మాత్రం కంప్యూటరైజ్డ్ అట… ఉత్త ఫేక్, పిచ్చోడు… ‘‘ఒక తేలి కులపు వ్యక్తి రామమందిరాన్ని ప్రారంభిస్తే మరి మేమేం చేయాలి, మేం బస్ స్టేషన్ వద్ద బూట్లు పాలిష్ చేసుకోవాలా..? (అంటే మోడీ వంటి ఓబీసీలు బూట్లు పాలిష్ చేసుకుని బతకాలా..?) నేను నా జంధ్యాన్ని మోడీ ఆఫీసుకు పంపిస్తాను… దీని ఉపయోగం ఏముంది నాకు..? నోరు తెరిస్తే అబద్ధాలే మోడీ నోటి వెంట… దొంగలు, దోపిడీదార్లు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడరు…
నలుగురు శంకరాచార్యులు చెబుతున్నారు, అబ్రాహ్మణుడు రామమందిరం ప్రారంభించడం ఏమిటని… (నిజానికి శంకరాచార్యుల అభ్యంతరాలు వేరు, వాళ్ల కూతల్ని హైందవ సమాజం ఏమీ పట్టించుకోలేదు, అది వేరే సంగతి)…’’ ఈ వ్యాఖ్యలు, విమర్శలకు సువేందు అధికారి బదులిస్తూ… సదరు పీజూష్ పాండా టీఎంసీలో ఓ కీలక నేత, అంటే ఈ వ్యాఖ్యలు పార్టీ అధికారిక అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవాలా..? ఓబీసీలను కించపరచడాన్ని టీఎంసీ సమర్థిస్తుందా..?’ అనడిగాడు…
Share this Article