నిజానికి ఇది అనేకసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి ఉంటుంది… ఏదో వాట్సప్ గ్రూపులో ఇంగ్లిషులో ఉన్న కంటెంటు చూసి, ఆసక్తిగా, సంక్షిప్తంగా… తెలిసీతెలియని నా అనువాద జ్ఞానంతో బాగా కుస్తీపడి, ఏదో ఆత్మానందం కోసం ఫేస్బుక్లో పోస్ట్ చేశా… సమయానికి ఫోటో కూడా దొరకలేదు… కానీ కొన్ని వందల లైకులు, షేర్లు… అదే మళ్లీ వందల వాట్సప్ గ్రూపుల్లోకి చేరి విపరీతంగా సర్క్యులేటైంది… అనేకమంది తమ పేర్లతో షేర్లు చేసుకున్నారు… పాతదే కదా… అంత వైరల్ కావల్సిన అవసరమేముంది..? అంటే… ఇలాంటి Ever Inspirative … నిత్యస్ఫూర్తి కథలు… ఉన్నత స్థాయిల్లో పనిచేసిన వ్యక్తుల నడుమ ఉండాల్సిన పరస్పర స్నేహ, గౌరవ, మర్యాదపూర్వక సంబంధాలనూ చెప్పే కథ ఇది… ఆ ఆర్ద్రత ఉంది కాబట్టే ఈరోజుకూ కొత్తకొత్తగా చదివిస్తున్నది ఈ పాత కథ… అదే ఇది…
Share this Article
Ads