సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..?
‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే.
మేం కూడా జై శ్రీరామ్ అంటున్నం. కానీ మేం రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. యాదాద్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు.. దాన్ని రాజకీయంగా వాడుకోలేదు. నిజమైన హిందువు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు అని కేటీఆర్ పేర్కొన్నారు… (యాదాద్రి ప్రారంభాన్ని అచ్చంగా పార్టీ కార్యక్రమంలాగా చేసింది ఎవరు సార్..? ఏ పార్టీ నాయకుల్ని పిలిచారు..? అదేమైనా రాజకీయ కార్యక్రమమా అలా జరపడానికి..?)
Ads
https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-talks-on-jai-sriram-slogan-1534166
ఎవరూ జైశ్రీరాం అనొద్దంటాడు, మళ్లీ తనే తన ప్రసంగంలో తామూ జైశ్రీరాం అంటాం, కానీ రాముడి పేరు చెప్పి వోట్లు అడుగుతలేం అంటాడు,.. (తమదే సెక్యులర్ పార్టీ అని ప్రతి క్రిస్టియన్, ప్రతి ముస్లింకు కార్యకర్తలు చెప్పాలని కేటీయార్ సూచించినట్టుగా మరికొన్ని మీడియా సంస్థల్లో కనిపించింది…)
స్థూలంగా అనిపించేది ఏమిటంటే..? గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందూ వోటు సంఘటితమవుతూ బీజేపీకి ఫాయిదా కలుగుతున్నదనే సోయి కలిగి… వెంటనే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందువు కేసీయారే, అబ్బే, మజ్లిస్‌తో మాకేమీ సంబంధం లేదు అని బాగా ప్రచారం చేసుకున్నది కేసీయార్ క్యాంపు… ఇన్నేళ్లూ మజ్లిస్‌ను తమ జాన్ జిగ్రీ దోస్త్ పార్టీ అని చెప్పుకున్నదీ వాళ్లే… సరే, సెటిలర్ల వోట్ల పుణ్యమాని బీజేపీని కాస్త నిలువరించి అంతిమంగా జీహెచ్ఎంసీలో గెలుపు మమ అనిపించుకున్నారు అది వేరే కథ…
తరువాత మోడీ వ్యతిరేకతతో సాక్షాత్తూ కేసీయారే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని అయోధ్య గుడిని వెక్కిరించాడు… తమ పార్టీ నాయకులు అయోధ్య చందాల మీద గాయిగత్తర లేపారు… అంతకుముందు హిందూగాళ్లు, బొందుగాళ్లు అన్నదీ కేసీయారే… ప్రస్తుతం కేటీయార్ వ్యాఖ్యల సరళి పరిశీలిస్తే ఆ పార్టీ అదే పాత భావజాలంలోనే ఉన్నట్టుగా ఉంది… కాకపోతే ఓ విపరీతమైన సందిగ్ఢంలో జారిపోయి… అప్పుడే జైశ్రీరాం అనొద్దు అంటాడు, అబ్బే, మేమూ అంటుంటాం అంటాడు…
ఒకవైపు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల బీఆర్ఎస్ ప్రముఖ నేతలంతా రేవంత్ రెడ్డీ జై అంటున్నారు… కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు… ఇన్నేళ్లూ అంటకాగిన మజ్లిస్ కూడా కాంగ్రెస్ వైపు కన్నుకొడుతోంది… మరోవైపు బీజేపీ పాజిటివ్ వోటు ఉండనే ఉంది… దీంతో జనంలోకి వెళ్లి ఏం మాట్లాడాలో ఏం చెప్పుకోవాలో సమజైతున్నట్టు లేదు… ఉద్వేగాలు కడుపు నింపవు అంటాడు… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఓ ఉద్వేగమే కదా సార్… అసలు మీ పార్టీ పుట్టుకే ఆ ఉద్వేగం మీద కదా…
ఉద్యోగాలకూ పార్లమెంటులో కొట్లాటకు సంబంధం ఏమిటి..? అసలు ఇదే పార్టీ పార్లమెంటులో ఏ ప్రజాసమస్య మీద ఎప్పుడు ఎలా కొట్లాడింది..? చివరగా ఓ నిజం… సెక్యులరిజం అంటే జైశ్రీరాం అనకపోవడం కాదు, అయోధ్యను గుడ్డిగా వ్యతిరేకించడం కాదు, శూర్పణఖ జన్మభూమి అని వ్యంగ్యంగా తిట్టిపోయడం కాదు… హిందూయిజాన్ని వ్యతిరేకించడం కాదు… సెక్యులరిజం అంటే తన మతాన్ని, తన దేవుళ్లను ప్రేమిస్తూనే ఇతర మతాలనూ గౌరవించడం, సమభావనతో ఉండటం..!!
Share this Article