హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది… ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical Indication – GI) లభించింది…
కేవలం గాజులు కొనడానికి రోజూ అనేకమంది మహిళలు చార్మినార్ దగ్గర లాడ్ బజార్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు తెలుసు కదా… హైదరాబాద్ వచ్చిన విదేశీ టూరిస్టులు సైతం వీటిని కొనుగోలు చేస్తుంటారు… ఇవి హైదరాబాద్ యూనిక్ ప్రొడక్ట్స్… బోలెడు డిజైన్లతో కేవలం గాజులు మాత్రమే అమ్మే దుకాణాలు కూడా బోలెడు…
లక్క గాజులకు ఈ జీఐ ట్యాగ్ కోసం 2022 జూన్‌లో హైదరాబాద్ క్రిసెంట్ హ్యాండీ క్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది…
Ads
చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ 2024 మార్చి2న జీఐ ట్యాగ్ ప్రకటించింది… ఇప్పటికే హైదరాబాదీ హలీంకు (2010-11) జీఐ ట్యాగ్ లభించిన సంగతి తెలిసిందే కదా… ఈ లక్క గాజులు తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ దక్కించుకున్న 17వ ఉత్పత్తి…
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ లక్క గాజులకు 500 ఏళ్ల చరిత్ర ఉంది… తరతరాలుగా తమ విశిష్టతను నిలబెట్టుకుంటూ వస్తున్నాయి ఇవి… ఈ లాడ్ బజార్ ఉత్పత్తినే తెలుగులో లక్కగాజులు అంటాం (లాక్ బ్యాంగిల్స్)… రెసిన్‌ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది… దీనిని వృత్తాకారంలో మలిచి దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్త కళాకారులు చేతితో అమరుస్తారు…
వేలాది మందికి ఇదే ఉపాధి కూడా… గాజుల తయారీలో వాడిన సరుకులను బట్టి వాటి ధరలు ఉంటయ్… ఎలాంటి పరికరాలు యూజ్ చేయరు… ఒకప్పుడు రాజకుటుంబాల్లోకి మహిళలు ధరించే ఈ గాజులు ఇప్పుడు అందరి పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఫేమస్… హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలు ఈ గాజులు…
అవునూ, తెలంగాణ నుంచి జీఐ గుర్తింపును పొందిన మొత్తం 17 ఉత్పత్తులు ఏమిటీ అంటారా..? ఇదుగో జాబితా…
- పోచంపల్లి ఇక్కత్ చీరలు
- కరీంనగర్ వెండి కళాకృతులు
- నిర్మల్ బొమ్మలు
- నిర్మల్ ఫర్నీచర్
- నిర్మల్ పెయింటింగ్స్
- గద్వాల చీరెలు
- సిద్దిపేట గొల్లభామ చీరెలు
- చేర్యాల నకాషీ పెయింటింగ్స్
- హైదరాబాద్ హలీం
- పెంబర్తి ఇత్తడి హస్తకళలు
- నారాయణపేట చేనేత చీరెలు
- బనగానపల్లి మామిడి
- ఆదిలాబాద్ డోక్రా
- వరంగల్ డర్రీస్
- తాండూరు కందిపప్పు
- పుట్టపాక తేలియా రుమాల్
- పాతబస్తీ లక్క గాజులు
ఇవే కాదు, మరికొన్ని ఉత్పత్తులకూ జీఐ ట్యాగుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి… వాటిల్లో వరంగల్ టమాట (చపాట) మిర్చి, బాలానగర్ సీతాఫలం, నల్గొండ పచ్చడి దోసకాయ, నిజామాబాద్ పసుపు, కొల్లాపూర్ మామిడి వంటివి పరిశీలనలో ఉన్నాయి… గుడ్…. Inputs By Ramanagoud Godisela
Share this Article