కోట్ల మందిని నవ్విస్తూ… తెలుగు టీవీ కార్యక్రమాలకే తలమానికంలా నిలిచిన మా అభిమాన జబర్దస్త్ షో మీద అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తున్నవ్, నీ మొహం, నీకసలు టేస్టుందా..? మా రామోజీరావు టేస్టుకే వంక పెట్టేంత సీనుందా నీకు..? అని సీరియస్‌గానే అడిగాడు ఓ ఫేస్బుక్ మిత్రుడు ఇన్ బాక్సులో…! తన దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన కామెడీ అంటే మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్ల ఈ సబ్ స్టాండర్డ్ ఉత్పత్తే… సర్లె, ఒక్కొక్కరి టేస్టు ఒక్కో విధము… వారస హీరోల ఫ్యాన్స్‌లాగే ఈ ఈటీవీ అత్యుత్తమ ఫ్యాన్ కూడా అంతే అనుకుని, సగటు ట్రోల్ భాష వాడలేదు కదాని ఆనందపడేలోపు… అదే ఫేస్బుక్లో ‘మస్త్ జబర్దస్త్’ అంటూ ఓ ప్రమోషనల్ వీడియో కనిపించింది…
అసలు కరోనా పిరియడ్ తరువాత కదా మనో ఈ షోకు జడ్జిగా వచ్చింది.., మరి కరోనా తరువాత అవినాష్ స్కిట్ ఎక్కడిదబ్బా… ఇది పాత వీడియో అని అర్థమవుతూనే ఉంది… పాత వీడియోల ప్రసారం ఈటీవీకి ఉన్న దరిద్రాల్లో ఒకటి కదా… అసలు ఇదేమిటో చూద్దామనుకుని క్లిక్ చేస్తే… నిజం చెప్పొద్దూ… జబర్దస్త్ సబ్ స్టాండర్డ్ క్వాలిటీకి పర్ఫెక్ట్ ఉదాహరణగా కనిపించింది… అసలు జబర్దస్త్ షో అంటేనే బూతులు, అక్రమ సంబంధాలు కదా… ఇది వాటినీ మించిపోయింది… చిల్లర, వెగటు, బిస్కెట్ కామెడీ… చిరాకు కాదు, అసహ్యమేసింది…
Ads
ఈ లింక్‌లో ఆ మహత్తర, అద్భుత స్కిట్‌ను అందరూ చూడవచ్చు, ఇక్కడే క్లిక్ చేయండి… మేమే ఫలానా అని మెడలో బోర్డులు వేసుకుని చేసే చెత్తా స్కిట్లలో ఇదీ ఒకటి… ఒకరు సుడిగాలి సుధీర్ అట, ఒకరు రష్మి, ఒకరు రోజా, ఒకరు గెటప్ సీను, ఒకరు విష్ణుప్రియ, అవినాష్ ఏమో స్కూల్ టీచరట… (బహుశా తను మల్లెమాల బాపతు అనాగరిక, వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్ సిస్టం) నుంచి విముక్తమైపోతూ, వాళ్లకు పది లక్షలు కట్టేసి, బిగ్‌బాస్ షోకు వెళ్లకముందు చేసిన షో అయి ఉంటుంది…)
- స్కిట్ నిండా విపరీతమైన రోజా భజన… బిస్కెట్లు… ఓరకమైన వెగటు పుట్టేలా… ఇదుగో ఇదే, జీటీవీ వాడి అదిరింది షోను భ్రష్టుపట్టించేసింది… జై నాగబాబు, జైజై నాగబాబు అనే భజన చివరకు ఆ షో అర్థంతరంగా ఆగిపోయేలా చేసింది… జనం చీదరించుకున్నారు, ఛీత్కరించారు…
- ఇప్పుడు రోజా భజన కూడా జబర్దస్త్‌లో అదే స్థాయిలో ఉంది… ఇక పరమ రొటీన్, పురాతనకాలం నాటి స్కూల్, పరీక్ష తరహా స్కిట్… అందులో విపరీతమైన బాడీ షేమింగ్… అవినాష్, విష్ణుప్రియ ముక్కుల మీద అసహ్యకరమైన పంచులు… చివరకు ఓ దశలో ఈ అవినాష్ విష్ణుప్రియ పాత్రధారి ముక్కును ఓపెన్ చేస్తూ ఏదో పంచ్ డైలాగ్ వేస్తాడు… ఏవగింపు… ఇదేనట్రా కామెడీ… థూమీబచె… దైహిక లక్షణాల మీద కామెడీ ది వరస్ట్ కామెడీ అని ప్రపంచ వ్యాప్త అభిప్రాయం… ఈ గలీజు గాళ్లకు తెలియదు…
- ఎప్పటిలాగే సుధీర్ పాత్రధారి రష్మి పాత్రధారి మీద, విష్ణుప్రియ మీద పడీపడిపోవడం… ఇదంతా చూస్తూ రోజా పడీపడీ నవ్వడం… ఫాఫం, రోజా… తను రాజకీయంగా ఎదిగిందేమో గానీ… ఇంకా సాదాసీదా సగటు టాలీవుడ్ నటిలాగే ఉండిపోయింది… తన టేస్టు, తన లెవల్ ఆఫ్ డిగ్నిటీ అది… మనో అనే సింగర్‌కు ఏదో పెద్దగా అర్థమైనట్టు సూపర్ బంపర్ అంటూ జడ్జిమెంట్లు… ఎందుకొచ్చార్రా భయ్ బుల్లితెర మీదకు…?
- ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే..? ఈమధ్యే ఓంకార్ నిర్మించే కామెడీ స్టార్స్ అనే షో మాటీవీలో క్లిక్కయింది… రేటింగ్సులో జబర్దస్త్‌ను కొట్టేసింది… అర్థమైంది కదా… జబర్దస్త్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రేక్షకులు ఎంత బలంగా కోరుకుంటున్నారో… ఇదుగో ఇలాంటి చెత్తా స్కిట్లను చూడలేక డైవర్ట్ అయిపోతున్నారు..? మనోను వదిలేయండి, ఎలాగూ హోప్ లెస్… నాలుగు ప్లాస్టిక్ నవ్వులు, నాలుగు చెక్కుల బాపతు తను… రష్మి సేమ్ సేమ్… రోజాకు, మల్లెమాలకు కూడా ఎలాగూ అర్థం కాదు… ఆ స్టాండర్డ్ అదే… రామోజీరావు గారూ మీ టీవీ పరిస్థితి ఏమిటో మీకైనా అర్థమవుతోందా..?!
Share this Article