Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రత్యేకంగా పేర్లు దేనికి..? ప్రతి బిడ్డకూ ఓ ప్రత్యేకమైన ‘గుర్తింపు పాట’…

April 5, 2024 by M S R

Prabhakar Jaini…… మనం నాగరీకులమని, మనకు మాత్రమే సున్నితమైన, మధురమైన భావాలుంటాయని, మనకు గొప్ప భాష ఉందనీ, సంస్కృతి ఉందని మనం అతిశయంతో ఉంటాం. అది కొంత వరకు మాత్రమే నిజం!


కానీ, నాగరీకులం అని అనుకునే మనమంతా కూడా నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఆఫ్రికా దేశంలో ‘హింబా’ అనె తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఆ జాతి ప్రజలు తమ పిల్లల పుట్టిన తేదీని, ఆ బిడ్డ పుట్టిన రోజు నుండో, బిడ్డ కడుపులో పడ్డ రోజు నుండో లెక్కించరు.
ఆ బిడ్డ పుట్టిన రోజును, బిడ్డను కనాలనుకున్న తల్లి మనసులో తను బిడ్డను కనాలనుకున్న ఆలోచన పుట్టినరోజు నుండి లెక్కిస్తారు.

ఆ తల్లి తన బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె వెళ్ళి, ఒంటరిగా అడవిలోని ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఆ కాబోయే తల్లి మనసులో తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ పాట

Ads

రూపుదిద్దుకునేంత వరకు అక్కడే కూర్చుంటుంది. ఆ పాటను ప్రకృతే, ఆ తల్లికి వరంగా ప్రసాదిస్తుందేమో. తన బిడ్డకో పాట రూపుదిద్దుకున్న తర్వాత ఆమె వచ్చి ఆ పాటను కాబోయే తండ్రికి నేర్పిస్తుంది. తర్వాతనే వాళ్ళిద్దరూ, ఒక పవిత్రమైన కావ్యంలా, తమ బిడ్డ పాటను పాడుకుంటూ, సంగమిస్తారు. ఆ పాటతో తమ బిడ్డ పురుడు పోసుకుని తమ జీవితాల్లోకి రావాలని ఆహ్వానిస్తారు.

బిడ్డ కడుపులో పడగానే, ఆ తల్లి తన బిడ్డ పాటను, ప్రసవం చేసే మంత్రసానికీ, ఊళ్ళోని పెద్ద ముత్తైదువలకు నేర్పిస్తుంది. బిడ్డ పుట్టగానే, వాళ్ళంతా ఆ పాటనే పాడుతూ ఆ బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానిస్తారు. అలా ఆ బిడ్డ పెరిగి పెద్దవుతున్న ప్రతీ సందర్భంలోనూ ఆ పాట పాడతారు. బిడ్డ కింద పడి ఏడుస్తున్నప్పడూ, వయసుకు వచ్చినప్పుడూ, పెళ్ళి చేసుకున్నప్పుడు, ఏదైనా వీరోచిత కార్యం చేసినప్పుడూ అదే పాట పాడుతారు. ఏదైనా తప్పు చేసినా, అందరి సమక్షంలో ఆ పాట వినిపించి, తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తారు.

అలా వారి జాతిలో ఆ బిడ్డకు ఆ పాట ప్రత్యేకం. చివరకు కాలం చేసినప్పుడు కూడా, ఆ పాటతోనే వీడ్కోలు పలుకుతారు. అలా తన తల్లి మదిలో రూపుదిద్దుకున్న, ఆ పాటనే జీవితాంతం పాడుకుంటూ ఆ బిడ్డ జీవనం సాగిస్తాడు. ఆ పాటే అతని మనుగడకు సాక్ష్యం. ఆ పాటే అతనికి గుర్తింపు. జీవితాంతం తల్లి తన కోసం పాడిన పాటను స్మరించుకుంటూ జీవించడంలోని మాధుర్యం వెలకట్ట లేనిది.

మనం కూడా మన జీవితంలో ఒక పాటను ఆలంబనగా చేసుకుంటే, మనం దారి తప్పినప్పుడు, ఆ పాట విషాదరాగంలో వినిపిస్తుంది. మంచి చేస్తే ఆనందభైరవిలో ఆనందభాష్పాలు కారుస్తుంది. మన గొంతుక బాగుండకపోవచ్చు. మనకు సంగీతం తెలియక పోవచ్చు. కానీ, మన కోసం మనం ఒక పాటను తప్పక ఎంచుకోవాలి…  డాక్టర్ ప్రభాకర్ జైనీ, నవలా రచయిత, సినీ దర్శకుడు. 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions