‘‘హవ్వ.., ఇంట్లో ఎవరైనా జిల్లేడు మొక్కను నాటుతారా..? ఎంత అరిష్టం…! స్మశానాల్లో ఉండాల్సిన చెట్టు అది… అసలు ఎవరు కేటీయార్కు ఈ సలహా ఇచ్చింది..? మొన్ననే ముఖ్యమంత్రి పదవి మిస్సయిపోయింది, దీంతో ఇంకా నష్టం తప్పదా..?’’ ‘‘ఏం సారూ..? మస్తు నీడనిచ్చే చెట్టు పెడుతున్నావే’’… ‘‘జిల్లేడు చెట్టుకు ఏం కాస్తాయి..? ఏం కోసుకుని తినాలి..?’’…. ఇలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు నిన్నటి నుంచీ తెగ కనిపిస్తున్నయ్… మధ్యలో ఒకరిద్దరు అర్ధ పండితులు కూడా ఎంటరైపోయి, రకరకాల బాష్యాలకు దిగారు… ఈ ట్రోలింగుకు కారణం ఏమిటయ్యా అంటే..? కేసీయార్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు కదా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు… కేటీయార్ సతీసమేతంగా ఒక మొక్కను నాటి నీళ్లు పోస్తున్న ఫోటో… ఇక దాన్ని పట్టుకుని ఎడాపెడా కామెంట్లు పెట్టేస్తున్నారు… కానీ ఈ ట్రోలర్లలో ఎవరికీ జిల్లేడు ప్రాముఖ్యం తెలియదు అని అర్థం… జస్ట్, కేటీయార్ను ట్రోల్ చేయాలనే లక్ష్యమే తప్ప ఈ వ్యాఖ్యల్లో అర్థం పర్థం ఏమీ లేదు… ఏదో ట్రోల్ తీట తీర్చుకోవడం తప్ప…! నిజంగా తనను వెక్కిరించాల్సిన సందర్భమో, పాలసీ విషయమో అయితే ఏమో గానీ, మరీ ఇలాంటి విషయాల్లోనూ అంతేనా..?
ఫస్ట్ ఆఫ్ ఆల్… కేటీయార్ ఇలాంటివి పెద్దగా నమ్మడు… దేవుళ్లు, యాగాలు, హోమాలు, నమ్మకాలు ఎట్సెట్రా పెద్దగా ఎక్కవు… తనకు ఏ దేవుడైనా ఒకటే, ఏ మొక్కయినా ఒకటే… పార్టీ కేడర్ అంతా మొక్కలు నాటడాన్ని ఓ టాస్కుగా తీసుకుని, తన డాడీని గౌరవిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి తనకు కూడా తప్పలేదు… ఇక జిల్లేడు మొక్క అంటారా..? ఇంటి ఆవరణలో జిల్లేడు మొక్క ఉండకూడదని ఏమీ లేదు… శాస్త్రం తెలిసినవారెవరైనా చెబుతారు… పైగా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే మంచిదనే చెబుతారు… దాన్ని శ్వేతార్కం అంటారు… ఆ పాలు విషంతో సమానం, ఒంటి మీద పడితే పుండ్లు పడతాయి, కళ్లల్లో పడితే కళ్లుపోతాయి వంటివి చెబుతుంటారు గానీ… నిజానికి ఆ పాలలో అనేక ఔషధ విలువలు ఉంటయ్… ఆయుర్వేదంలో జిల్లేడుకు తగు స్థానం ఉంది… చిన్నప్పుడు బక్క పలుచగా ఉండే పిల్లల వెన్నుపూసలకు నిలువునా జిల్లేడు పాలు రాసి, దానిపై పసుపు పూసే ఓ నాటు చికిత్స పద్దతి గతంలో ఉండేది… రకరకాల వ్యాధులకూ జిల్లేడును ఔషధాల్లో వాడతారు…
Ads
ఓ ప్రగతిభవన్ ఆవరణలో నాటే ఒక జిల్లేడు మొక్కను ఆయుర్వేదంలోనూ వాడేంత సీన్ రేపు లేకపోవచ్చుగాక… అది పెద్దగా పెరగదు, నీడను ఇవ్వదు… నిజమే, కానీ కొన్ని విశ్వాసాల ప్రకారం జిల్లేడు పూజల్లోనూ మంచిది… ప్రత్యేకించి శివుడికి ఇష్టమైన పూలు… రుద్రాంశ సంభవుడు కాబట్టి ఆంజనేయుడికి ఈరోజుకూ జిల్లేడు పూల మాల వేసి పూజించే భక్తులు బోలెడు మంది… ప్రత్యేకించి గ్రహచారం బాగాలేని భక్తులు..! శ్వేతార్కం గణపతికీ ఇష్టమైనదే… పైగా ఇది మొండి చెట్టు… ఒకసారి ‘‘ఏనుకున్నదంటే’’ (బతికిందంటే చాలు) ఇక ఎండిపోదు… నిక్షేపంగా పెరుగుతుంది… సో, ఇలా ఏరకంగా చూసినా సరే, కేటీయార్ను ఈవిషయంలో ట్రోల్ చేయడం తననే కాదు, తెల్ల జిల్లేడును కూడా అవమానించినట్టే…!! అన్నట్టు… ఇంట్లో ఈ జిల్లేడు మొక్క నాటాలని ఎవరి నక్షత్రాన్ని బట్టి తనకు సూచించారో మాత్రం తెలియదు..!! కేసీయార్ మాత్రం రుద్రాక్ష ‘‘చెట్టును’’ నాటాడు..!!
Share this Article