వర్మ… భ్రష్టుపట్టిపోయిన ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్… ఈ వ్యాఖ్యకు వివరణలు కూడా అనవసరం… ఐతే ప్రయోగాలు చేయడంలో దిట్ట, కానీ తలతిక్క ప్రయోగాలు… తను తీసిన రాజకీయ చిత్రాలన్నీ పెద్ద బక్వాస్…
చాలా చిత్రాలు డిజాస్టర్లు… తనలోని దర్శకుడు ఏనాడో చచ్చిపోయి, యూట్యూబ్ యాంకర్లతో పిచ్చి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టుతూ అదోరకం ఆనందం పొందే దిగజారిన స్థాయి తనది… మొన్న జగన్ మీద తీసిన రెండు పార్టుల సినిమాలు మెగా బంపర్ సూపర్ బ్లాక్ బస్టర్ డిజాస్టర్లు…
దాంతో హఠాత్తుగా వర్మ కళ్లు తెరుచుకున్నాయట… ఛ, ఈ పాపిష్టి పొలిటికల్ బయోపిక్స్ ఇక తీయను, అసలు నేనేంటి, నా లెవలేంటి, ఈ సినిమాలేంటి అని తత్వం బోధపడిందట… ఇక మరో ప్రహసనానికి తెరతీస్తున్నాడు… అదేమిటంటే…
Ads
డెమొక్రటిక్ మూవీస్… అంటే ప్రజల కోసం తీయబడే సినిమాలు కాదండోయ్… ప్రజలు ఎంచుకున్న టెక్నిషియన్స్‌తో ఆరు నెలలకు ఓ సినిమా తీసి ప్రజల మీదకు వదులుతాడట… ముందుగా వర్మ కంపెనీ ఓ స్టోరీ లైన్‌ను వెబ్ సైట్‌లో పెడుతుంది… నచ్చిన హీరోలు, హీరోయిన్లు, యాక్టర్స్, డైరెక్టర్స్ ఎట్సెట్రా సినిమా పీపుల్ అప్లయ్ చేసుకోవాలట… వాటిని షార్ట్ లిస్ట్ తీసి వోటింగుకు పెడతాడట… ప్రజలు ఎవరికి ఎక్కువ వోట్లు వేస్తే, వాళ్లకు ఆడిషన్లు, పరీక్షలు… ఉత్తీర్ణులైతే వాళ్లతోనే సినిమా తీస్తాడట…
చూడటానికి, వినడానికి, చదవడానికి స్థూలంగా ఇదేదో బాగుందే అనుకోవద్దు… పేరున్న ఏ టెక్నీషియన్ వోటింగుకు సిద్ధపడడు… ఏదో ఓ రాయి వేసి చూద్దాం అనుకునేవాడే అప్లయ్ చేస్తాడు… అసలు అన్నింటికీ మించిన ఫ్లా ఏమిటంటే… శృతి…
ఎస్, ఉదాహరణకు ఒక దర్శకుడికి ఒక సినిమాటోగ్రాఫర్‌తోనే వేవ్ లెంత్ సూటవుతుంది… తనతో కోఆర్డినేట్ చేసుకోగలడు… ఒక దర్శకుడికి ఒక తరహాా నటీనటులే అక్కరకొస్తారు… సో, ప్రజల చాయిస్ అనేది అబ్సర్డ్… సినిమా ఒక టీంగా పనిచేయాల్సిన క్రియేషన్… అంతేతప్ప, సమయానికి వచ్చి ఎవరి డ్యూటీ వాళ్లు చేసే యవ్వారం కాదు…
అన్నింటికీ మించి ఒక దర్శకుడికి తన టీం ఎలా ఉండాలో ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి… లేకపోతే ఔట్‌పుట్ దరిద్రంగా ఉండటమే కాదు, అసలు సినిమాయే ముందుకెళ్లదు… అన్నీ వర్మ ఈమధ్య తీసిన సినిమాల్లాగే ఉంటాయి…పైగా ప్రజలు వోట్లేసి ఎంచుకున్న టెక్నీషియన్లకు కూడా మళ్లీ ఆడిషన్లు, పరీక్షలు, పాస్ మార్కులు వర్మ వేసేట్టయితే… ఈ మొత్తం వోటింగు ప్రహసనం దేనికి..? అందుకే వర్మకు ఎక్కడో ఏదో దెబ్బతింది… రిపేరు లేదు..!!
Share this Article