ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడు?
జగన్ పదవీ కాంక్షకు సహాయపడ్డా – 29-Oct-2022.
.
జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవడు – (30 కు అటు ఇటుగా) Oct-2023.
.
జగన్ గెలవటం కష్టం – 07-Mar-2024 .
Ads
.
ఈ స్టేట్మెంట్స్ చూస్తే జగన్ గెలవడు దగ్గర నుంచి కష్టం అనే వరకు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం మారింది.
ప్రశాంత్ కిషోర్ గతంలోలా టీమ్స్ పెట్టి పనిచేయటం లేదు, అభిప్రాయాలు మాత్రమే చెబుతున్నాడు.
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ కు తిరుగు లేదు, BRS హ్యాట్రిక్ కొడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవొచ్చు అని అభిప్రాయపడ్డాడు.
ఇప్పుడు జగన్ గెలవటం కష్టం, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది, దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుంది అని నిన్న ప్రశాంత్ కిషోర్ అన్నాడు.
పై మూడు అభిప్రాయాల్లో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ మొదటి స్థానంలో నిలుస్తుంది అనేది నిజం కావాలి అంటే బీజేపీ కనీసం ఎనిమిది స్థానాలు గెలవాలి, అన్ని సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలే భావించటం లేదు. దక్షిణాదిలో తమిళనాడులో అన్నామలై ఎంత వేవ్ క్రియేట్ చేసినా ఒకటి లేదా రెండు ఎంపీ సీట్లు గెలవటం కూడా కష్టం. బీజేపీ తెలంగాణ గవర్నర్ తమిళ్ సై గారిని రాజీనామా చేయించి మరీ చెన్నై సౌత్ నుంచి పోటీకి దించింది కానీ ఆవిడ గెలుపు మీద ధీమా లేదు.
దక్షిణాదిలో బీజేపీ నమ్మకం పెట్టుకుంది కర్ణాటక మీద, 2019 ఎన్నికల్లో మొత్తం 27 స్థానాల్లో 25 సీట్లు గెలిచింది. ఇప్పుడు 8 నుంచి 12 గెలుస్తామన్న అంచనాతో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ JDS తో పొత్తుపెట్టుకొని దెబ్బతినింది. ఈ ఎన్నికల్లో బీజేపీ JDS తో పొత్తుపెట్టుకుంది. ఈ పొత్తు మీద కూడా బీజేపీ శ్రేణుల్లో అసహనం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు, ఆయన వర్గానికి ప్రాధాన్యత లేకుండా సీట్లు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు దాదాపు 20 సీట్లు యడ్డ్యూరప్ప వర్గానికి ఇచ్చింది. దీనితో మిగిలిన సీనియర్లు గుర్రుగా ఉన్నారు ..
దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్ అంచనా నిజం కావాలి అంటే మొత్తం సౌత్ లో బీజేపీ కనీసం 30 సీట్లు గెలవాలి లేదా 2019లో గెలిచిన 25 సీట్లు అన్నా గెలవాలి.
ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజం అవుతాయో లేదో కానీ ప్రశాంత్ కిషోర్ paid perception ను క్రియేట్ చేయటానికే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. డిజిటల్ మీడియాలో influencers తో వీడియోలు చేయించుకున్నట్లు perception క్రియేట్ చేయటానికి ప్రశాంత్ కిషోర్ కష్టపడుతున్నట్లుంది.
ఇన్ని అభిప్రాయాలు చెబుతున్నా ప్రశాంత్ కిషోర్ తానూ ఆంధ్రా ఎన్నికల్లో టీడీపీకి పనిచేస్తున్నాను అని మాత్రం చెప్పటం లేదు, టీడీపీకి పనిచేయటం లేదు అని ప్రకటన చేశాడు .. గత నవంబర్ నుంచి ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తున్నాడు, దీని మీద గత డిసెంబర్ లో పోస్ట్ రాశాను.
ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తుంది లేనిది ఆయన హైద్రాబాద్ కు ఎన్నిసార్లు వస్తుంది తెలిసినవాళ్లకు అర్థం అవుతుంది .
పనిచేయకుండా అభిప్రాయాలు చెప్పటం
నిర్దిష్టంగా కాకుండా random గా గెలుపు ఓటముల గురించి మాట్లాడటం అంటే perception build చేయటానికే!
ప్రశాంత్ కిషోర్ Strategist నుంచి Paid Influencer గా రూపాంతరం చెందుతున్నట్లుంది…. (Post By Siva Racharla)
Share this Article