Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకూల జీవోతో సాక్షికి నో ఫాయిదా… కోర్టుకు వెళ్లి ఈనాడు తెల్లమొహం…(2)

April 10, 2024 by M S R

ప్రతి జిల్లాలోనూ వేలాది మంది జగన్ నియమించిన వాలంటీర్లు ఉన్నారు… వాళ్లు నెలనెలా డెయిలీ పేపర్ కొనడానికి డబ్బులు ఇస్తూ ఓ జీవో కూడా ఇచ్చాడు… అధికారంలో ఉన్నాడు, కోట్లకుకోట్ల యాడ్స్ ఇస్తున్నాడు పత్రికకు… అలాగే సర్క్యులేషన్ పెంపునకూ ఇదొక మార్గం అని అందరూ భావించారు… ఒక కోణంలో అది అనైతికమే అయినా సరే, ఇలాగైనా ఈనాడును బీట్ చేస్తుందని అనుకున్నారు…

తమ నంబర్ వన్ స్థానం పోతుంది, యాడ్స్‌కు, ఆదాయానికి దెబ్బ అనీ.., జనంలోకి తాము తీసుకుపోతున్న జగన్ వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ సాక్షి ద్వారా మరింతగా జనంలోకి పోతుందని, అది తెలుగుదేశానికి నష్టమనీ రామోజీరావు భావన… (అసలే ఈ ఎన్నికలు తెలుగుదేశానికి చావుబతుకుల సమస్య) తను చంద్రబాబు కోసం ఏదైనా చేస్తాడు కదా, ఆ జీవో మీద కోర్టుకెక్కాడు… కానీ నిజానికి అది ఖచ్చితంగా సాక్షిని కొనాలనే జీవో కాదు కదా, అలా ఇవ్వలేరు కదా… సో, దాని ఇంపాక్ట్ సాక్షి మీద కొద్దిగా పడింది తప్ప ఈనాడును బీట్ చేయలేకపోయింది… అనవసరంగా కోర్టుకు పోయి ఇప్పుడు తెల్లమొహం వేసింది ఈనాడు…

ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారాలకు విరుగుడుగా సాక్షిని మరింతగా జనంలోకి తీసుకుపోవచ్చునని జగన్ అనుకుని ఉండవచ్చు, అది పొలిటికల్ డెసిషన్ కావచ్చు… కానీ అది పెద్దగా ఫాయిదా ఇవ్వలేదు… కర్నూలు, నెల్లూరుల్లో కాస్త, తిరుపతి, ఒంగోలుల్లో ఈనాడుకన్నా ఎక్కువ సర్క్యులేషన్ వచ్చింది… కానీ మిగతా జిల్లాల్లో ఈనాడును బీట్ చేయలేక చతికిలపడింది… అంటే అనుకూల జీవో ఇచ్చినా ప్రయోజనం లేదన్నమాట…

Ads

నిజానికి ఏపీలో మూడు పత్రికలూ ఒకే టైపు… సాక్షి వైసీపీ డప్పు, మిగతా రెండు టీడీపీ డప్పులు… కానీ మరీ ఆంధ్రజ్యోతి బజారులో నిలబడి పోతరాజు టైపులో కొరడాలతో కొట్టుకునేరకం కదా… 2.3 లక్షల దగ్గరే ఆగిపోయింది… తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, రాజమండ్రి, విశాఖపట్నం ఏరియాల్లో ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఓవరాల్‌గా ఏపీలో ఈనాడు 7.4 లక్షలతో స్టిల్ నంబర్ వన్… సాక్షి 6.5 లక్షలు… సాక్షి ఈనాడుకన్నా లక్ష దూరంలోనే ఉండిపోయింది…

తెలంగాణలో పరిస్థితి…

సాక్షి తెలంగాణలో ఇన్నాళ్లూ బీఆర్ఎస్ బాకా… అది నమస్తే సాక్షి అనిపించుకుంది… కేసీయార్‌తో మస్తు సఖ్యత… బీఆర్ఎస్ కుప్పకూలిన ప్రస్తుత స్థితిలో కూడా అది కేసీయార్ వైపే… ఎందుకంటే..? జగన్ అంటే రేవంత్‌కు పడదు, కాంగ్రెస్‌కూ పడదు… సాక్షి నిజానికి తెలంగాణలో నిష్పాక్షికంగా ఉంటే బెటర్‌గా ఉండేదేమో, కానీ పత్రికల పొలిటికల్ లైన్స్‌కు చాలా మార్మిక విధానాలు ఉంటాయి కదా… జై కేసీయార్ అన్నట్టే సాగింది, కేసీయార్ వ్యతిరేకత ప్రభావం నమస్తే తెలంగాణ పత్రిక మీద చాలా ఎక్కువగా ఉండగా, అది సాక్షి మీద కూడా ఉంది…

ఎందుకంటే..? హైదరాబాద్‌ను వదిలేస్తే (ఇక్కడ తెలంగాణతోపాటు ఏపీ, రాయలసీమ పాఠకులూ మిక్స్‌డ్ ఉంటారు కాబట్టేమో…) మిగతా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా ఈనాడుకు దరిదాపుల్లో లేదు, రాదు… కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సర్క్యులేషన్ గురించి, ఈనాడుతో పోటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఉదాహరణకు కరీంనగర్‌లో ఈనాడు 60 వేలు, సాక్షి 25 వేలు…

తెలంగాణలో ఈనాడుది మరో చిత్రమైన సిట్యుయేషన్ ఇప్పుడు… కేసీయార్‌తో సఖ్యత (తెలంగాణ ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే జగన్ నుంచి రక్షణ కాబట్టి…), అందుకే కేసీయార్ చల్లనిచూపు కోసం ఎప్పుడూ తన్లాట… అసలే కాంగ్రెస్ వ్యతిరేకత కదా ఈనాుడకు మొదటి నుంచీ… కానీ రేవంత్ మాత్రమేమో మనవాడు… ఇప్పుడు పొలిటికల్‌గా కేసీయార్ డౌన్, రేవంత్ అప్… మరి ఏ పొలిటికల్ లైన్ తీసుకోవాలి..? ఈనాడుకే అర్థం కావడం లేదు… ఐనాసరే, ఈరోజుకూ తెలంగాణలో నంబర్ వన్ అదే… బలమైన ఏజెన్సీలు ఓ కారణం కావచ్చు, మరీ కేసీయార్ రంగును దట్టంగా పూసుకున్నట్టు కనిపించకపోవడం కూడా కావచ్చు…

ఆంధ్రజ్యోతి గతంలో వరంగల్‌లో టాప్… పలు జిల్లాల్లో మంచి పోటీ ఇచ్చేది… ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఈనాడు, సాక్షికన్నా చాలా దూరం… హైదరాబాదులో కూడా అంతంతమాత్రమే… 55 వేలు… మొత్తంగా తెలంగాణలో సిట్యుయేషన్ చూస్తే ఈనాడు 5.5 లక్షలు, సాక్షి 3.5 లక్షలు, జ్యోతి 1.5 లక్షలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…
  • కుహనా సెక్యులర్ పార్టీల బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌కు ఎదురుదెబ్బ..!!
  • అడుగడుగునా అల్లరల్లరి… జంధ్యాల మార్క్ మరో కామెడీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions