WW-III అప్డేట్! క్రోధి నామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతున్నదా?
2024 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డ్ సృష్టించబోతున్నది!
ఇజ్రాయెల్, హమాస్,హేజ్బోల్ల కాన్‌ఫ్లిక్ట్ ఒక వైపు, మరో వైపు రష్యా, ఉక్రెయిన్ కాన్‌ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి.
ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీయవచ్చు ఇరు వైపులా!
ఉక్రెయిన్ తన సర్వ శక్తులూ కూడగట్టుకొని రష్యా మీద విరుచుకు పడుతున్నది.
ఇంకో వైపు రష్యా కూడా భీకరంగా దాడి చేస్తున్నది ఉక్రేయిన్ మీద.
కానీ పరిస్థితులు దారి తప్పేలా ఉన్నాయి అణు దాడి వైపు!
********
1. ఈ రోజు ఉక్రెయిన్ చేసిన దాడి భీభత్సంగా ఉంది . ఉక్రేయిన్ సరిహద్దు నుండి రష్యా లోని రోస్తొవ్ (Rostov) ప్రాంతంలో తెల్లవారు ఝామున భారీ శబ్దాలు వినిపించాయి. దాదాపు 60 ఉక్రెయిన్ డ్రోన్లు రష్యన్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.
2. మోరోజోస్క్ (Morozovsk) ఎయిర్ బేస్ లో 32 Su-34 లు,4 Su-24 జెట్స్ పార్కింగ్ లో ఉన్నాయి.
3. కడపటి వార్తలు అందే సమయానికి 4 Su 34 లు, రెండు Su 24 లు నష్టపోయింది రష్యా ఎలాంటి యుద్ధం చేయకుండా. మరో 6 విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
4. గత సంవత్సరం అంటే డిసెంబర్ 2023 లో ఇదే ఎయిర్ బేస్ మీద ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసి ఒక Su 34 విమానాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ రష్యా తన విమానాలను రక్షించే బంకర్స్ ను నిర్మించలేదు.
5. Su 34 ఫైటర్ జెట్ (నాటో కూటమి FULLBACK పేరుతో పిలుస్తుంది) ప్రత్యేకంగా గ్రౌండ్ ఎటాక్ కోసం డిజైన్ చేసింది రష్యా. ఉక్రెయిన్ ప్రత్యేకంగా Su 34 లని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నది.
6. మొత్తం మూడు పెద్ద ఎయిర్ బేస్ ల మీద దాడులు జరిగాయి. 1.Morozovsk (near Rostov), 2.Yeisk (on Azov Sea) 3.Engels (Saratov region.)
3. న్యూ జనరేషన్ డ్రోన్లు ను తయారుచేస్తున్నది ఉక్రేయిన్. వీటికి E – 300 ENTERPRISE అని పేరు పెట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పని చేసే ఈ డ్రోన్లు ఒకసారి టార్గెట్ ను FIX చేసి ప్రయోగిస్తే 3000 KM దూరం ప్రయాణించి టార్గెట్ ను కొట్టగలవు.
4. ఈ కొత్త తరం E -300 enterprise డ్రోన్లు ఉక్రెయిన్ నుండి ప్రయోగిస్తే నేరుగా రష్యాలోకి 1000 KM దూరం ప్రయాణించి టార్గెట్స్ ను ధ్వంసం చేస్తున్నాయి. విశేషం ఏమిటంటే ఈ డ్రోన్లు రిమోట్ సెన్సింగ్ తో పని చేయడం వల్ల ప్రత్యేకించి ఆపరేటర్స్ అవసరం లేదు. ఫైర్ అండ్ ఫర్గెట్ అన్నమాట!
5. రష్యాలోని తతర్‌స్థాన్ (Tatarsthan) లోని ఒక డ్రోన్ ఫ్యాక్టరీ, మరో ఆయిల్ రిఫైనరీ నీ ధ్వంసం చేశాయి ఉక్రెయిన్ డ్రోన్లు.
6. దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి రష్యాలోకి చొచ్చుకుపోయి దాడి చేశాయి అంటే రష్యన్ రాడార్లు వీటిని పసిగట్ట కుండా AI బోల్తా కొట్టించింది. మొత్తం 30 డ్రోన్స్ గుంపుగా వెళ్ళి దాడి చేయడం రష్యా ఏమీ చేయలేకపోవడం విస్మయం కలిగించే అంశం!
Ads
*******
రష్యా బెలారస్ నుండి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ ను దిగుమతి చేసుకుంటున్నది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఆయిల్ ఎగుమతి చేస్తున్న రష్యాకి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
Lukoil’s ను ఉత్పత్తి చేసే NORSI రిఫైనరీనీ గత మార్చి నెల 12 వ తేదీన ఉక్రేనియన్ డ్రోన్లు దాడి చేసి ధ్వంసం చేశాయి.
NORSI రిఫైనరీ రష్యాలో నాలుగవ పెద్ద రిఫైనరీ.
మార్చి 12 న దాడి జరిగితే మంటలని ఆర్పడానికి రెండు రోజులు పట్టింది ఫైర్ ఫైటర్స్ కి.
కానీ ఇప్పటి వరకూ నోర్సి రిఫైనరీ ఉత్పత్తి తిరిగి ప్రారంభించలేదు.
దాంతో రష్యా కి 40% ఆయిల్ కొరత ఏర్పడ్డది.
రష్యాలోని నాలుగు పెద్ద రైఫైనరీల నిర్వహణ అమెరికన్, యూరోపు సంస్థలు చేస్తూ వచ్చాయి.
ఎప్పుడయితే రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ (ఫిబ్రవరి 23, 2022) పేరుతో ఉక్రేయిన్ మీద దాడికి దిగిందో వెంటనే అమెరికన్, యూరోపియన్ సంస్థలు ఎక్కడివి అక్కడే వదిలేసి రష్యా నుండి వెళ్లిపోయాయి.
గత రెండేళ్లుగా విడిభాగాలు దొరకక రష్యన్ ఆయిల్ రిఫైనరీలు ఇబ్బందులని ఎదుర్కుంటూ వచ్చాయి. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ను శుద్ధి చేసే రిఫైనరీల ఉత్పత్తి సామర్థ్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.
కానీ డ్రోన్ దాడితో ధ్వంసం అయిన నోర్సీ రిఫైనరీకి కొత్త స్పేర్ పార్ట్శ్ కావాల్సి వచ్చింది కానీ ఆంక్షల వల్ల అవి కొనలేదు రష్యా!
అందుకే బెలారస్ నుండి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటున్నది రష్యా.
విమానాలకి కావాల్సిన జెట్ ఫ్యూయల్ కి కూడా బెలారస్ మీద ఆధారపడి వలసి వస్తున్నది.
పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ తో పాటు ల్యూబ్రికెంట్స్ కి కూడా కొరత ఏర్పడింది.
యుద్ధ కాలంలో 40% కొరత ఏర్పడడం సాధారణ విషయం కాదు.
*******
ఇదే అదనుగా భావించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ అగ్నికి ఆజ్యం పోసే ప్రకటన చేశాడు. ఉక్రేయిన్ కి నాటో సభ్యత్వం ఇస్తున్నాము అంటూ! అంటే రష్యా ఇంధనం కొరతతో ఉన్నప్పుడే ఉక్రేయిన్ కి నాటో సభ్యత్వం ఇచ్చి నాటో దళాలు ఉక్రేయిన్ లోకి ప్రవేశించి రష్యాతో యుద్ధం చేస్తాయి అన్నమాట!
*******
జెర్మనీ తన లేపర్డ్ 2 (Leopard II ) ట్యాంకులను 200 లకి పైగా సరిహద్దుల దగ్గర మొహరించింది!
పోలాండ్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం మొదటి సారిగా తన ఆయుధ బడ్జెట్ ను 200% పెంచి అమెరికా, జెర్మనీ, ఫ్రాన్స్ ల నుండీ అత్యాధునిక ఆయుధాలు కొనడం కోసం ఆర్డర్ ఇచ్చింది.
ఈ వారంలోనే నార్వే తన 32 F -16 లని ఉక్రేయిన్ కి పంపించబోతున్నది. ఒక బాచ్ ఉక్రేయిన్ పైలట్లకి ట్రైనింగ్ ఇవ్వడం పూర్తి చేసింది.
SO! ఉక్రెయిన్ F-16 లని తన డిఫెన్స్ కోసం వాడబోతున్నది. అమెరికా చట్టాల ప్రకారం ఆత్మరక్షణ కోసం F16 లని వాడాలి.
కానీ F16 గేమ్ చేంజర్ అవుతుందా?
నిపుణులు భిన్నమైన అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు.
1. ఉక్రేనియన్ పైలట్లు ఇప్పటి వరకూ సోవియట్ యూనియన్ నాటి మిగ్, సుఖోయ్ జెట్ ఫైటర్స్ ను నడుపుతూ వచ్చారు. ఇన్స్ట్రుమెంట్ పానెల్ అనేది కీలక పాత్ర వహిస్తుంది!
2. రష్యన్ భాషలో ఉండే కాక్ పిట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాటి కంట్రోల్స్ ను వాడిన ఉక్రేనియన్ పైలట్లు వాటికి భిన్నంగా ఉండే డిజిటల్ పానెల్ ఉండే F16 కాక్ పిట్ ను ఎంత సమర్ధవంతంగా ఆపరేట్ చేస్తారు అన్న సందేహం ఉంటుంది!
3. ఎంత కఠినమైన శిక్షణ తీసుకున్నా అత్యవసర పరిస్థితుల్లో ఉక్రేనియన్ పైలట్లు ఎంత వేగంగా (తడబడకుండా) ఆపరేట్ చేస్తారు అన్నదానిమీద గేమ్ చేంజర్ అవుతుందా కాదా అని తెలుస్తుంది.
4. కానీ రష్యన్ జెట్ ఫైటర్స్ ఉక్రేనియన్ సరిహద్దులు దాటి దాడి చేస్తే మాత్రం ఇబ్బంది ఉండవచ్చు.
*******
చైనా హెచ్చరిక!
2022 ఫిబ్రవరి 23 న రష్యా ఉక్రేయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పటి నుండి చైనా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కానీ మూడు రోజుల క్రితం మొదటి సారిగా స్పందించింది చైనా.
‘ రష్యా మీద మూకుమ్మడిగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోము ‘ అంటూ తీవ్రంగా ప్రకటన చేసింది చైనా!
కాబట్టి ఒక వేళ నాటో దేశాలు రష్యా మీద దాడికి దిగితే చైనా వెంటనే రంగంలోకి దిగుతుంది అని అర్థం చేసుకోవచ్చు!
ఉత్తర కొరియా!
వారం క్రితం హైపర్ సానిక్ మిస్సైల్ ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి సిస్టమ్ పని తీరును రికార్డ్ చేసింది. రష్యా రహస్యంగా హైపర్ సానిక్ టెక్నాలజీ ను సప్లై చేసింది CIA కి తెలియకుండా! ఉత్తర కొరియాను తురుపు ముక్క కింద వాడుకోబోతున్నాయి రష్యా, చైనాలు. నాటో కూటమి సాహసం చేస్తుందా? ఖచ్చితంగా సాహసం చేస్తుంది. దానికి శ్రీకారం చుట్టింది ఇజ్రాయెల్!
Share this Article