వోకే… బీజేపీ సొంతంగా 370 సీట్లను, ఎన్‌డీయేతో కలిసి 400 సీట్లను సాధించాలనే భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది… దాని టార్గెట్ హ్యాట్రిక్ కాదు, ఇప్పట్లో ఏ పార్టీకి సాధ్యం కాని నంబర్ సాధించడం… పలు మీడియా సంస్థలు చేయించిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని నంబర్లు కనిపిస్తున్నాయి… గుడ్, కానీ నిజంగా బీజేపీ అంత బలాన్ని ప్రదర్శించబోతోందా..?
కాసేపు ఈ ఒపీనియన్ పోల్స్, సర్వేలు పక్కన పెడితే… వోటర్ల మూడ్‌ను కొన్నిసార్లు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టుకోలేవనే నిజాన్ని పరిగణనలోకి తీసుకుంటే… ఇండి కూటమి చేయించుకుంటున్న సర్వేల సారాంశం కూడా పరిశీలిస్తే… నాణేేనికి మరోవైపు కూడా చూడాలనుకుంటే… పరిస్థితి ఇలా ఉండవచ్చు…
Ads
ఒక సర్వే ఇది… ఇండి కూటమి కూడా ఇదే నమ్ముతూ, ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే మెజారిటీ ఫిగర్ చేరుకుంటామనే ఆశాభావంతో ఉంది… ఒకటీ రెండు శాతం తేడా వోట్లు పెద్దగా ప్రభావం చూపిస్తాయి ఎన్నికల్లో..! ఒకవేళ ఈ సర్వే గనుక నిజమయ్యే పక్షంలో… బీజేపీ మరికొన్ని సీట్లు గనుక కోల్పోయే సిట్యుయేషన్ గనుక వస్తే… బీజేపీ అప్పుడు వైసీపీ, బీజేడీల మీద ఆధారపడాల్సి ఉంటుంది…
బీజేడీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నించినా, ఒడిశా బీజేపీ శాఖ వల్ల పొత్తు వర్కవుట్ కాలేదంటారు… ఎంపీ సీట్లు బీజేపీకి ఎక్కువ యిచ్చి, తను అసెంబ్లీ సీట్స్ ఎక్కువ తీసుకోవాలని పట్నాయక్ ఆలోచన… ఐనా సరే, నవీన్ పట్నాయక్ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ వైపు ఉండడు… అలాగే జగన్ కాంగ్రెస్ వైపు వెళ్లడు… (పైగా కాంగ్రెస్‌లో తన కొత్త శత్రువు చేరింది)… ఐనా సరే బీజేపీ టీడీపీ, జనసేనలతో కలవకుండా ఉండాల్సిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది… ఎందుకంటే, చంద్రబాబు ఏమాత్రం నమ్మదగని కేరక్టర్ కాబట్టి, ఇండి కూటమి గనుక అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తే తను వెంటనే జంపయ్యే బాపతు కాబట్టి… భయానికో భక్తికో జగన్ అనధికార NDA సభ్యుడిగానే ఉన్నాడు, మూడో కూటమి ఎలాగూ లేదు…
ఇండికూటమిలో అంతర్గత సర్దుబాట్లు కష్టంగా ఉన్నాయి… వోటు ట్రాన్స్‌ఫర్, పొత్తు పెద్దగా వర్కవుట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు కొన్ని రాష్ట్రాల్లో… కానీ డీఎంకే, టీఎంసీ మంచి నంబర్ సాధిస్తాయి… యూపీలో ఎస్పీ, బిహార్‌లో ఆర్జేడీ బలపడిన సూచనలు కనిపిస్తున్నాయి… మహారాష్ట్రలో కూడా బీజేపీ స్వీప్ చేసే సిట్యుయేషన్ ఏమీ లేదు…
కేరళలో లెఫ్ట్‌తో, బెంగాల్‌లో టీఎంసీతో పొసగడం లేదు కాంగ్రెస్‌కు… ఐనా సరే, రేప్పొద్దున బీజేపీ గనుక అనుకున్నన్ని సీట్లు సాధించలేని పక్షంలో… యాంటీ బీజేపీ పేరిట అందరూ ఒక్కటవుతారు… కొంతలోకొంత బీజేపీకి నయం ఏమిటంటే..? మోడీ పాపులారిటీ బాగుంది, అయోధ్య సెంటిమెంట్ ఉంది… ఆర్టికల్ 370, ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి అంశాల ఫాయిదా… యూపీఏ పదేళ్ల హయాంలో రోజుకొక స్కాము బయటపడేది, కానీ ఏ స్కాములు లేవు ఈ పదేళ్లలో…
ఎలక్టోరల్ బాండ్స్ సగటు వోటర్‌కు అర్థం కావు… పైగా ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు… బోలెడన్ని ఆరోపణలు చేస్తున్న డీఎంకే సదరు కేరళ లాటరీ డాన్ నుంచి వందల కోట్లు కుమ్మేసింది… కేరళ నుంచి అక్కడెక్కడో ఉన్న టీఎంసీ కూడా అంతే… కాంగ్రెస్ కూడా నిధులు సేకరించింది… కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే బీజేపీ ఎక్కువ ఫాయిదా పొందింది… ఐతే యాంటీ బీజేపీ వోటు, సీటు చీలకుండా గరిష్ఠ స్థాయిలో ప్రయత్నాలు చేయడంతో పాటు రాజస్థాన్, యూపీల మీద కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ చేస్తోంది…!!
Share this Article