WW3 అప్డేట్! ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఇరాన్! ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇజ్రాయెల్! గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కిన వాతావరణం!
****
ఏప్రిల్ 1,2024.
గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతూ అడపా దడపా అటు లెబనాన్, సిరియా ల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్!
లెబనాన్ లో ఉన్న హెజ్బొల్ల తీవ్రవాదులు IDF కి గట్టి పోటీ ఇస్తున్నారు గత అయిదు నెలలుగా! గాజాలో ఒక పక్క హమాస్ తో పోరాడుతూ ఇంకో వైపు లెబనాన్ నుండి దాడులు చేస్తున్న హేజ్బొల్లా ను ఎదుర్కోవడం సవాలుగా మారింది ఇజ్రాయెల్ కి.
అర్బన్ వార్ ఫేర్ లో అద్భుతమయిన అనుభవం మరియు రికార్డ్ ఉన్న ఇజ్రాయెల్ కి విజయాలతో పాటు అపజయాలు కూడా మూట కట్టింది IDF.
గత సంవత్సరం అక్టోబర్ 10 న IDF గాజాలో దాడి మొదలు పెట్టింది.
కానీ మునపటి లాగ విజయం అంత సులభంగా రాదు అని అర్థం చేసుకోవడానికి నెల రోజులు పట్టింది IDF కి.
మొదట్లో గాజా నుండి హమాస్ ను పూర్తిగా తుడిచి పెట్టడానికి నెల రోజులు చాలు అనుకున్నారు.
కానీ గత రెండు దశాబ్దాలుగా రష్యా, ఇరాన్ ల ప్రోద్బలంతో హమాస్ చాల శక్తివంతమైన గెరిల్లా ఫైటర్ గ్రూపుగా అవతరించింది. కానీ CIA కానీ మోస్సాద్ కానీ విషయం పసిగట్టలేక పోయాయి.
హమాస్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది అని ఊహించలేదు IDF.
గత జనవరిలో IDF హమాస్ ల మధ్య జరిగిన పోరుని మరో స్టాలిన్ గ్రాడ్ గా అభివర్ణించారు నిపుణులు.
Ads
స్టాలిన్ గ్రాడ్ యుద్ధం!
రెండవ ప్రపంచ యుద్ధo లో జెర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడికి దిగింది. జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ ముఖ్య నగరం ఆయిన స్టాలిన్ గ్రాడ్ ను ముట్టడించింది. ఆ యుద్ధం అర్బన్ వార్ ఫేర్ లో ఇప్పటికీ అతిపెద్ద సంఘటన గా మిగిలిపోయింది.
రైల్వే స్టేషన్ ను స్వాధీనం చేసుకోవడానికి జర్మన్ సైన్యం ప్రయత్నించడం సోవియట్ సైన్యం ప్రతిఘటించడం జరిగింది.
ఆ రోజు జరిగిన యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ స్టేషన్ 6 గంటల వ్యవధిలో 6సార్లు జర్మన్ మరియు సోవియట్ సైన్యం చేతులు మారింది. అంటే ఒక గంట జెర్మన్ల చేతిలో ఉంటే తరువాత గంట సోవియట్ సైన్యంతో ఉండేది.
ఆరోజు జరిగిన భీకర పోరులో జర్మన్, సోవియట్ సైనికులు వందల్లో చనిపోయారు 6 గంటల వ్యవధిలో. అలాగే ఒకరి ఆయుధాలు ఇంకొకరి చేతిలోకి వెళ్లడం మళ్ళీ అసలు వాళ్ల దగ్గరకి చేరడం జరిగింది.
గత జనవరిలో IDF VS హమాస్ తో జరిగిన గెరిల్లా పోరులో హమాస్ దే పైచేయి అయింది.
IDF కి ప్రాణ నష్టంతో పాటు ఆయుధాలను హమాస్ కి కోల్పోయింది.
దాంతో IDF ఒక బెటాలియన్ ను గాజా నుండి వెనక్కి పిలిపించాల్సి వచ్చింది. ముందు ముందు ప్రాణ, ఆయుధ నష్టం జరగకుండా ఉండేందుకు.
మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ యొక్క గాజా ఆపరేషన్ విఫలం అయ్యింది అని చెప్పవచ్చు.
********
మొత్తం 208 బందీలు హమాస్ చెరలో ఉండగా చనిపోయిన వారు చనిపోగా కొద్ది మందిని రక్షించింది IDF. ఇప్పటికీ వందకి పైగా బందీల జాడ కనుక్కోలేక పోయింది IDF.
వాళ్ళు బ్రతికి ఉన్నట్లేనా?
అఫ్కోర్స్! IDF ఇద్దరు బందీలను హమాస్ ఉగ్రవాదులుగా పొరబడి కాల్చి చంపింది!
ఇది యూదుల ఫ్రస్ట్రేషన్ ను సూచిస్తున్నది!
IDF ఫ్రెండ్లీ ఫైరింగ్ లో ముగ్గురు IDF సైనికులు చనిపోయారు.
26 IFV (Infantry Fighting Vehicles) ను హమాస్ ధ్వంసం చేసింది!
ఇక పేరు గొప్ప ఇజ్రాయెల్ MBT MERKAVA లు 5 ను ధ్వంసం చేసింది హమాస్!
ఇప్పటి వరకూ 526 మంది IDF సైనికులు చనిపోయారు హమాస్ చేతిలో.
300 కి పైగా గాయపడి యుద్ధం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు.
ఇవన్నీ కాకి లెక్కలు. నష్టం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. లేకపోతే ఒక బెటాలియన్ గ్రౌండ్ ఫోర్స్ ను వెనక్కి ఎందుకు పిలిపించింది ఇజ్రాయెల్ గాజా నుండి ?
7,000 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టు పెట్టామని ఇజ్రాయెల్ చెపుతున్నది. కానీ 10 వేల మంది పౌరులు కూడా మరణించారు . హమాస్ సాధారణ పౌరులని రక్షణ కవచంగా వాడుకోవడం వల్లనే సాధారణ పౌరులు మరణించారు అన్నది సత్యం!
మరి ఇజ్రాయెల్ సాధించింది ఏమిటి?
గాజాను నేలమట్టం చేసింది!
అది ఏ దేశం అయినా చేయగలదు. గాజాకి సైన్యం లేదు. ఎయిర్ డిఫెన్స్ లేదు. యుద్ధ విమానాలు, ట్యాంకులు లేవు.
కానీ గ్రౌండ్ ఫోర్స్ తో ఎదుర్కోలేక విమానాలు, డ్రోన్లు, మిస్సైల్స్ తో గాజాని నేలమట్టం చేయగలిగింది.
అమెరికా అపాచీ ఎటాక్ హెలికాప్టర్ల ను పంపించినా వాటిని వాడలేదు IDF. హమాస్ వాటిని కూల్చేస్తుంది అనే భయంతో!
ఒక పోలిక……
రష్యా రెండేళ్ల నుండి యుక్రేయిన్ ను తన అధీనంలోకి తీసుకోవడంలో పాక్షికంగా విజయం సాధించింది.
ఇజ్రాయెల్ బందీలను విడిపించడంలో విఫలం అయ్యింది!
రష్యా పశ్చిమ దేశాల దృష్టిని ఉక్రెయిన్ నుండి మరలించడానికి మిడిల్ ఈస్ట్ లో థియేటర్ ను ఓపెన్ చేసింది.
ఇప్పుడు అదే వ్యూహాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లు చేస్తున్నాయి కాకపోతే అది ఆగ్నేయ ఆసియాలో.
ఇజ్రాయెల్ కొత్త థియేటర్ ను ఓపెన్ చేసింది ఇరాన్ లో!
*********
నేతన్యాహు ఫాక్టర్!
Yes! అక్టోబర్ 7,2023 న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయకముందే నేతన్యాహు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అక్కడి ప్రజలలో.
నేతన్యాహు మీద అవినీతి ఆరోపణలు, ఇజ్రాయెల్ న్యాయ చట్టాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఇజ్రాయెల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
గత అక్టోబర్ లో హామాస్ దాడి చేయకుండా ఉండి ఉంటే నవంబర్ లో నేతన్యాహూ రాజీనామ చేయాల్సివచ్చేది!
కానీ హమాస్ దాడి నెతన్యాహు కి కలిసివచ్చింది.
వెంటనే గాజా మీదకి దాడికి దిగినా బందీలను రక్షించడంలో విఫలమయ్యాడు 6 నెలలు గడిచినా!
So! ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక పెద్ద కారణం కావాలి.
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద వైమానిక దాడి చేయించాడు.
అయితే బాంబు గురి తప్పి ఇరాన్ కాన్సులెట్ పక్కన ఉన్న భవనం మీద పడ్డది.
******
వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య కార్యాలయం మీద దాడి చేయకూడదు.
షరా మామూలుగా అన్ని దేశాలు ఇరాన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ప్రకటనలు చేశాయి.
కానీ ఇజ్రాయెల్ లెక్కచేయలేదు.
ఇరాన్ మాత్రం పది రోజులపాటు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకుని దాడికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏప్రిల్ 10 న ఒక ప్రకటన చేస్తూ తాము ఇజ్రాయెల్ మీద దాడి చేసి తీరుతాము అని ప్రకటించింది.
ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్ హెచ్చరికను స్వీకరిస్తూ దాడి కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని ప్రకటించింది.
*******
నిన్న ఉదయం అమెరికా ఒక ప్రకటన చేస్తూ 48 గంటలలో ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగవచ్చు అని పేర్కొంది.
అమెరికన్ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ తో పాటు జెర్మనీ, ఫ్రాన్స్ లు కూడా తమ పౌరులు ఇజ్రాయెల్, ఇరాన్ లలో ఉంటే వెంటనే వెనక్కి రావాల్సిందిగా కోరాయి.
జెర్మనీ ఎయిర్ లైన్స్ luftansa తన సర్వీసులను టెహ్రాన్, ఇజ్రాయెల్ నగరాలకు రద్దు చేసింది.
*********
అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ కాదు.
ముందస్తుగా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి!
జరగబోయే పరిణామం ఏమిటో తెలుసుకున్న పుతిన్ ఇరాన్ ను తొందరపడద్దని కోరాడు!
ఇక ఇరాన్, ఇజ్రాయెల్ బలాబలాలు ఏమిటి?
అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో మరో అప్డేట్ లో తెలుసుకుందాం!
Share this Article