Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘అన్ హెల్తీ’ డ్రింక్స్… అన్ హెల్తీ పాలసీలు… బోర్న్‌విటా వివాదం చెప్పేదిదే…

April 14, 2024 by M S R

మొన్నామధ్య సుప్రీంకోర్టు పతంజలి యాడ్స్ మీద విరుచుకుపడింది… క్షమాపణ చెప్పినా సరే తిరస్కరించింది… పదునైన, పరుషమైన భాష వాడిన తీరు పట్ల కూడా కొన్ని విమర్శలు వచ్చాయి… ఆ కేసు ఫైల్ చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్… అదే అసోసియేషన్ సాక్షాత్తూ తాము అప్రూవ్ చేస్తున్నట్టుగా కనిపించే ప్రకటనల్ని (ex : Colgate ) ఎందుకు పట్టించుకోవడం లేదు..? అంతెందుకు..? రూల్స్ ప్రకారం, నైతికత ప్రకారం హాస్పిటళ్లు, మందులు, డాక్టర్లు వాణిజ్య ప్రకటనలు చేయకూడదు, వాటినెందుకు ఐఎంఏ పట్టించుకోదు..? వంటి అనేక ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి… దాన్నలా వదిలేస్తే…

తాజాగా హార్లిక్స్ మీద కేంద్రం ఓ నిర్ణయం ప్రకటించింది…వైద్య ఆరోగ్య శాఖ కాదు, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ… ఆ నిర్ణయం ఏమిటంటే..? అన్నిరకాల ఇ-కామర్స్ సైట్స్, పోర్టళ్లు తక్షణం బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కింద సూచించడాన్ని నిలిపివేయాలని అట… ఒక్క బోర్న్‌విటా జోలికి వెళ్లడానికి మళ్లీ వెనుకంజ, భయం… ఇలాంటి డ్రింక్స్, బేవరేజెస్ అన్నీ హెల్త్ డ్రింక్స్ అని సూచించడం ఆపేయాలని ఓ బ్లాంకెట్ సర్క్యులర్ జారీ… నిజానికి చాన్నాళ్లుగా ఎనర్జీ డ్రింకుల మీద కూడా కేంద్రం నుంచి ఏ చర్యా లేదు… విమర్శలు వస్తున్నట్టు అవి ఎందుకు ప్రమాదకరమో తేల్చే అధ్యయనాలు లేవు, కసరత్తులు లేవు…

బోర్న్‌విటా మీద ఈ నిర్ణయం… ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లో హెల్తీ డ్రింక్ అని దేన్నీ నిర్వచించలేదు కాబట్టి పిల్లల హక్కుల రక్షణ కమిషన్ విచారణ మేరకు ఇది హెల్త్ డ్రింక్ కాదు కాబట్టి ఆ కేటగిరీ నుంచి తీసేయాలట… అంతేతప్ప అది ఎందుకు డేంజరో చెప్పలేదు, ఆన్‌లైన్ పోర్టళ్లు గాకుండా బయట ప్రచారం చేసుకోవచ్చా..? నిజంగా ఇది పోషక పానీయమేనా..? ఇదే కాదు, హార్లిక్స్, కాంప్లాన్ మీద కూడా విమర్శలున్నాయి… ప్రత్యేకించి వాటిల్లోని సుగర్ కంటెంట్ మీద..!

Ads

నిజానికి మోడీ ప్రభుత్వం ఔషధ విధానానికి సంబంధించి అట్టర్ ఫెయిల్యూర్, ప్రత్యేకించి కరోనా తరువాత కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసుకున్నాయి…ఓ నియంత్రణ లేదు, పద్ధతీ లేదు… చీపుగా లభించాల్సిన జెనెరిక్ మందుల్ని కూడా అడ్డగోలు ధరలకు, బ్రాండెడ్ మెడిసిన్స్‌లా అమ్ముతున్నారు… వేక్సిన్ల ధరల బాగోతం మనకు తెలిసిందే…

ఈ బోర్న్‌విటా బాగోతం కూడా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బయటికి తీసుకొచ్చాడు… కరోనా తరువాత డ్రగ్ కంపెనీలన్నీ ఇమ్యూనిటీ బూస్టర్లు అంటూ ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశాయి తెలుసు కదా… అసలు ఇమ్యూనిటీ బూస్టర్ అంటేనే ఓ భ్రమ… హార్లిక్స్ కూడా అలాగే తన యాడ్స్ మార్చి, ప్రచారం చేసుకునే తీరుతో మొదలుపెట్టి సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ సుగర్ లెవల్, అందులో వాడే కంటెంటుతో ప్రమాదాలను కూడా ఏకరువు పెట్టాడు…

హార్లిక్స్ తీవ్ర ఆగ్రహంతో అతనికి నోటీసులు జారీ చేసింది… అతను అవన్నీ డిలిట్ చేసుకున్నాడు… రెడిట్ వంటి చాట్ గ్రూపుల్లో కనిపించింది… నిజంగా జనానికి ఉపయోగకరమైన వీడియో బిట్ అది… నిజానికి హార్లిక్స్ వంటివి చాక్లెట్ పానీయాలే తప్ప హెల్త్ డ్రింక్స్ కావు అని ఆ సోషల్ మీడియా పర్సన్ చాలా క్లియర్‌గా చెప్పాడు… ఇలాంటివి చూసుకోవల్సిన కేంద్రానికి మాత్రం ఏ సోయీ లేదు… సో, పతంజలి యాడ్స్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రకటనల మీద, వాటిల్లోని పోషక, ఔషధ, ప్రమాదకర రసాయనాల జోడింపుల మీద కదా కేంద్రం దృష్టి పెట్టాల్సింది… మరేమైంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions