ప్రతీకారం అంటే ఇజ్రాయిల్ గూఢచార విభాగం ఏజెంట్లు… మొసాద్… వరల్డ్ ఫేమస్… తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరినైనా, ఎంత కాలమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఖతం చేయడం దాని స్పెషాలిటీ… రష్యన్ గూఢచార విభాగం కేజీబీకి కూడా దాదాపు అదే చరిత్ర ఉంది… మరి మన దేశంలో లెక్కలేనన్ని విద్రోహచర్యలకు పాల్పడుతుంటారు కదా అనేకమంది అంతర్గతంగా, బయటి నుంచి.,. మరి మనకు చేతకాదా..?
ఇది కదా ప్రశ్న… మన గూఢచార విభాగం మొత్తాన్నే నిర్వీర్యం చేయడానికి సాక్షాత్తూ ఓ ఉపరాష్ట్రపతే ప్రయత్నించాడని కదా ఆరోపణలున్నవి… అదీ మన నిబద్ధత… కానీ రెండేళ్లుగా ఇండియన్ గూఢచార సంస్థ గుర్తుతెలియని వ్యక్తులుగా భారత వ్యతిరేకులను ఖతం చేస్తోందని ఆమధ్య గార్డియన్ ఏం రాసిందో గుర్తుంది కదా… ‘‘మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక విదేశాల్లో, ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావించే వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది… 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మందిని ఇలా ఖతం చేశారు… రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) పర్యవేక్షణలో ఈ హత్యలు జరుగుతున్నాయి…’’
2019 పుల్వామా దాడి తరువాత ఇండియా వైఖరి మారింది… భారత వ్యతిరేక శక్తులను వాళ్ల అడ్డాలోనే హతమార్చే దూకుడు కనబరుస్తోంది, ఇజ్రాయెల్ ఏజెన్సీ మొసాద్, రష్యా ఏజెన్సీ కేజీబీలే స్పూర్తి’’ అని రాసుకొచ్చింది గార్డియన్… 2023లోనే పాకిస్థాన్‌లో 15 మంది కీలక వ్యక్తులను భారత ఏజెంట్లు లేపేశారని ఆ దేశ గూఢచారవర్గాలే చెప్పాయట… ఈ వార్త కనిపించిన మరుసటి రోజే మరొకరిని పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు… నిన్న మరొకడు… నొటోరియస్… ఒకరకంగా ఒక ఇండియన్ ఏజెంట్ హత్యకు ఇది ప్రతీకారం అనుకోవాలి…
Ads
అమీర్ సర్ఫరాజ్… ఓ మాఫియా డాన్… లష్కరేతొయిబా ఫౌండర్‌కు సన్నిహితుడు… తనను నిన్న లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని మోటార్ సైకిలిస్టులు కాల్చి చంపారు… హాస్పిటల్ తీసుకెళ్లేలోపు చనిపోయాడు… తను ఎవరో తెలుసా..? 1990 పాకిస్థాన్ పేలుళ్లకు సూత్రధారి, భారత గూఢచారి అనే ఆరోపణలపై పాకిస్థాన్ మన సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో వేసింది, శిక్ష విధించింది… తనను జైలులోనే కొందరు 2ే013లో ఇటుకలు, ఐరన్ రాడ్డులతో బాదితే ముందు బ్రెయిన్ డెడ్, మరుసటి రోజు కన్నుమూశాడు… అదుగో ఆ హత్యకు నేతృత్వం నిన్న హత్యకు గురైన పక్కా భారత వ్యతిరేకి అమీర్ సర్పరాజ్… తనను లాహోర్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వదిలేసింది…
మన పార్లమెంటు మీద దాడికి తెగబడిన అఫ్జల్ గురును ఉరితీశాం కదా, అదుగో దానికి ప్రతీకారం జైలులో ఉన్న ఖైదీని ఈ సర్ఫరాజ్ చేత హత్య చేయించారని అప్పట్లో వార్తలు… సరబ్‌జిత్ కుటుంబం సరైన న్యాయవిచారణ కోసం చాలా ప్రయాసపడింది… కానీ న్యాయం జరగలేదు… ఇప్పుడు సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు… ఇలా, ప్రతి గుర్తుతెలియని హత్య వెనుక ఓ మోటివ్ ఉంది… ఇన్నాళ్లుగా ఇండియా దాచుకుంటున్న ఓ దేశభక్తిపూరిత కసి ఉంది… ప్రతీకార వాంఛ ఉంది… ఈ సరబ్‌జిత్ మీద రణదీప్ హుడా, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రధారులుగా ఓ బయోపిక్ కూడా వచ్చింది అప్పట్లో…
రణదీప్ హుడా ఈ సర్ఫరాజ్ హత్య వార్త తెలిసిన వెంటనే ‘గుర్తుతెలియని ఆ వ్యక్తులకు’ అంటూ ఓ నమస్కారం ఐకన్ పెట్టాడు… ఇంతకీ సరబ్‌జిత్ ఎవరు..? పొరపాటున సరిహద్దు దాటితే ఇండియా ఏజెంట్ అనుకుని అరెస్టు చేశారని ఆ కుటుంబం వాదించింది చాన్నాళ్లు… 23 ఏళ్లు జైలులో గడిపాడు… చివరకు తన హంతకుడు, నొటోరియస్ డాన్ సర్ఫరాజ్ హతమయ్యాడు… సరబ్‌జిత్ కుటుంబం స్పందన ఏమిటో తెలుసా..? తను ఒక్కడే కాదు, సరబ్‌జిత్‌ను జైలులో చంపిన ఆ మిగతా వారికి కూడా శిక్ష ఎలా అని ప్రశ్నిస్తోంది… ఇంతకీ… సరబ్‌జిత్ మరణాన్ని పాకిస్థాన్ ఏమని చెప్పుకుందో తెలుసా..? గుండెపోటు మరణం..!!
హిజ్‌బుల్ చీఫ్ సలాహుద్దీన్ సహా చాలామంది భారత వ్యతిరేకులు ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారట… ఎందుకు..? ఎవరో ఇద్దరు మోటార్ సైకిలిస్టులు వచ్చి కాల్చిపారేస్తారనే భయంతో..!!
Share this Article