Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమస్య లేకపోవడమూ ఓ సమస్యే… భార్య అర్థమైతే అదొక విడ్డూరమే…

April 17, 2024 by M S R

ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని ఏమిటి..? ‘మహిళల్ని అర్థం చేసుకోవడం, అందులోనూ భార్యల్ని అర్థం చేసుకోవడం…’ ఈ కాన్సెప్టుతో కొన్ని లక్షల జోకులు, కార్టూన్లు, మీమ్స్, కథలు గట్రా వచ్చి ఉంటాయి కదా… అందులో ఒకటి ఇదుగో ఈ కార్టూన్ కూడా… జస్ట్, ఓ ఉదాహరణ కోసం…

wife

బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ కాకా… ఫుట్‌బాల్ ప్లేయర్లలో చాలా అందగాడిగానే పేరు… లుక్స్ మాత్రమే కాదండోయ్… అటాకింగ్ మిడ్ ఫీల్డర్… వేగానికీ, చురుకుదనానికీ, డ్రిబ్లింగ్ సామర్థ్యానికీ మంచి పేరు… టాప్ యూరోపియన్ టీమ్స్ ఏసీ మిలన్, రియల్ మాడ్రిడ్ జట్లకు మాత్రమే కాదు, 2002 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడు… 2006 ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా ఆడాడు…

Ads

2005లో కాకా తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి కరోలిన్ సెలికోను సాల్ పోలోలో పెళ్లి చేసుకున్నాడు… అందమైన జంట అని అందరూ పొగిడారు… కానీ పదేళ్ల తరువాత వాళ్లు విడాకులు తీసుకున్నారు… తమ విడాకులకు కారణమేమిటో ఇన్నేళ్లూ ఏమీ చెప్పలేదు… ఇద్దరిలో ఎవరూ… మొన్న ఆమే పెదవి విప్పింది…

"Problem Was He Was Too Perfect": Brazil Star Kaka's Ex-Wife Caroline Celico's Intriguing Reason For Divorce

‘‘ప్రాబ్లం అంటే నిజానికి ఏమీ లేదు… నన్నెప్పుడూ మోసగించలేదు, అత్యంత నమ్మకస్తుడు… నన్ను బాగా చూసుకునేవాడు… నాకొక బ్రహ్మాండమైన కుటుంబాన్ని ఇచ్చాడు తను… అత్యంత పర్‌ఫెక్ట్ మొగడు తను…’’ అని చెప్పుకొచ్చింది…

 

మరెందుకు విడాకులు తీసుకున్నావమ్మా అనడిగితే… ‘విడిపోవాలనే నిర్ణయం నాదే, తనకు ఇష్టం లేదు, అంత బాగా ప్రేమించాడు నన్ను… కానీ అంతా బాగానే ఉన్నా సరే, నాలో ఏదో తెలియని అసంతృప్తి, ఏదో మిస్సవుతున్న ఫీలింగ్, ఇంకా నేరుగా చెప్పాలంటే, తను అంత పర్‌ఫెక్ట్ భర్త కాబట్టే విడాకులు అడిగానేమో…’ అని వివరించింది…

అసలు ఆమె చెప్పదలుచుకున్నది ఏమైనా తనకైనా అర్థమవుతోందా అనంటే… నిజమే, నేనే విడమరిచి చెప్పలేకపోతున్నాను అంటోంది…

kaka

చూశారుగా… భర్త సరిగ్గా లేకపోతేనేమో అదొక సమస్య… ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం… గొడవలు… అశాంతి… అసలు అవేమీ లేకపోతేనే ఏదో వెలితి ఫీలయ్యిందా ఆమె… సమస్య లేకపోవడమే ఓ సమస్యగా భావించిందా..? పెక్యూలియర్ కేరక్టర్…

తరువాత ఏమైందీ అంటారా..? విడాకుల తరువాత… 2019లో కాకా బ్రెజిలియన్ మోడల్ కరోలినా డయాస్‌తో తన ఎంగేజ్‌మెంట్ ప్రకటించాడు… చాన్నాళ్లు ఒంటరిగా ఉండీ ఉండీ ఇక ఉండలేక ఆమెకు చేయి అందించాడు… ఆమె, అనగా తనకు విడాకులు ఇచ్చిన సెలికో 2021 దాకా ఒంటరిగా ఉండి, స్కార్ప జూలియావోను పెళ్లి చేసుకుంది, అసలు తనకు పెళ్లే సూట్ కాదని అనుకుందట మొదట… కానీ ఏమైందో మరో పెళ్లికి సై అనేసింది…

కాకా కూడా తన ఆటకు 2017లోనే రిటైర్‌మెంట్ ప్రకటించాడు… ‘ఫుట్‌బాల్ ఫీల్డులోనే ఉంటాను, కొనసాగుతాను, కానీ మరోరకంగా, ఒక అథ్లెట్‌గా, ఒక ప్లేయర్‌గా మాత్రం ఇక ఉండను’ అన్నాడు… అంటే మేనేజర్, స్పోర్టింగ్ డైరెక్టర్ వంటి పనుల్లో కొనసాగుతాడన్నమాట… అవునూ, నువ్వు పర్‌ఫెక్ట్ మొగుడివని నీ మాజీ భార్య అంటోంది, నీ స్పందన ఏమిటి అంటే మాత్రం తను నోరువిప్పడు… నిజమే, అత్యంత పర్‌ఫెక్ట్ మొగుడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions