ఈమధ్య బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ అన్ హెల్తీ పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ డ్రింకుల్లోని కంటెంటు ప్రమాదాల గురించి సోషల్ మీడియాయే బయటపెట్టింది… నెస్లే… ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ… ప్రధానంగా పిల్లల ఆహారాల ఉత్పత్తుల సంస్థ… దానిపై దుమారం రేగుతోంది…
శిశువులకు, చిన్న పిల్లలకు నెస్లే ఫుడ్ (సెరిలాక్ తరహా ఫుడ్) పెడుతుంటారు ప్రపంచవ్యాప్తంగా… ఐతే రూల్స్‌కు విరుద్ధంగా ఈ సంస్థ కొన్ని దేశాల్లో ఫుడ్‌లో చక్కెర శాతాన్ని పెంచి అమ్ముతోందని తాజా ఆరోపణ… జర్మనీ, బ్రిటన్, స్విట్లర్లాండ్ వంటి దేశాల్లో మాత్రం చక్కెర లేకుండా అమ్మే ఈ సంస్థ ఇండియా సహా పలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో మాత్రం చక్కెరతో ఫుడ్ అమ్ముతోందట…
దీన్ని బయటపెట్టింది పబ్లిక్ ఐ అనే సంస్థ… శాస్త్రీయ ఆధారాలతో ప్రకటించింది… ఆయా దేశాల్లో సుగర్ 3 శాతం నుంచి కొన్ని దేశాల్లో అయితే ఏకంగా ఆరేడు శాతం వరకూ ఉంటోందనీ, సుక్రోజ్, తేనె రూపంలో ఫుడ్‌కు సుగర్ జోడిస్తోందని కనిపెట్టారు… నిజానికి శిశువులకు సుగర్ ఉన్న ఫుడ్ పెట్టకూడదని ఇంటర్నేషనల్ రూల్స్ చెబుతున్నాయి… కానీ నెస్లే మొదటి నుంచీ అంతే కదా… తన ఇష్టారాజ్యం…
Ads
ఈ తాజా ప్రచారంతో నెస్లే స్టాక్స్ ధరలు పడిపోయాయి ఇండియాలో… తమ అమ్మకాలు, తమ లాభాలు తప్ప టార్గెటెడ్ సెక్షన్ ఆరోగ్యాన్ని మాత్రం సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు… తమ ఉత్పత్తుల ప్యాకింగులపై నిజాల్ని కూడా రాయదు ఆ కంపెనీ… అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే… నెస్లే ఇండియా ప్రతినిధి ఒకాయన దీనిపై వివరణ ఇస్తూ… ‘‘మేం ఎప్పటికప్పుడు మా ఉత్పత్తుల నాణ్యతను సమీక్షించుకుంటాం, గత ఏడాది సుగర్ పర్సంటేజీని 30 శాతం వరకూ తగ్గించాం’’ అన్నాడు…
అంటే ఇండియాలో కూడా ఏ ఇథియోపియా పిల్లలకు అమ్మినట్టే ఐదారు గ్రాముల (ప్రతి సర్వింగ్‌కు) సుగర్ జతచేసినట్టే కదా… నెస్లే సంస్థే అంగీకరిస్తున్నట్టు కదా… మరి మన కేంద్ర మంత్రిత్వ శాఖలకు మాత్రం వీటి నాణ్యత పరీక్షలు, నిఘా ఏమాత్రం పట్టవు… ఇదే నెస్లే గతంలో కూడా చాలా వివాదాలకు గురైంది… వాటిల్లో కొన్ని…
- 2014 లో మ్యాగీలో మోనోసోడియం గ్లుటామేట్ ఉనికిని ఉత్తరప్రదేశ్ యంత్రాంగం కనుక్కుంది… అనుమతించబడిన లెడ్ పర్సంటేజీకన్నా వందల రెట్లు అధికంగా ఉంది… దీంతో 38 వేల టన్నుల మ్యాగీని రిటెయిల్ షాపుల నుంచి వెనక్కి తీసుకుని, ధ్వంసం చేసింది… అది ఇండియా మార్కెట్‌లో పెద్ద దెబ్బ దానికి…
- బేబీ మిల్క్ ఫార్ములాను ఫోకస్ చేయడానికి, ప్రమోషన్లలో బ్రెస్ట్ మిల్క్‌ను డిస్కరేజ్ చేస్తోందని అమెరికాలో 1977లో నెస్లే చిల్ట్రన్ ఫుడ్‌ను బహిష్కరించారు… అది యూరప్ దేశాలకూ విస్తరించింది…
- ఐవరీ కోస్ట్ కోకో ఫామ్స్‌లో బాల కార్మికులను వలస కూలీలుగా వాడుకుంటున్నట్టు ఆరోపణలు…
- కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో అనుమతి, పరిమితులకు మించి నీటి బాటిలింగ్ ఆరోపణలు…
- ప్రపంచంలోని టాప్ ప్లాస్టిక్ కాలుష్య కంపెనీల్లో నెస్లే ఒకటి… ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పోజల్ కూడా సరిగ్గా చేయదు…
- పాకిస్థాన్‌లో భూగర్భజలాల్ని కలుషితం చేస్తున్నట్టు మరో ఆరోపణ… ఇలా బోలెడు ఆరోపణలు, వివాదాలు ఈ కంపెనీపై… (అదేదో పాత జంధ్యాల సినిమాలో ఓ డైలాగ్… అందుకే వాటిని ‘డబ్బా పాలు’ అంటారు…)
Share this Article