Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యమగోల… దర్శకుడి పేరు వినగానే ఎన్టీయార్ సందేహించాడు…!

April 20, 2024 by M S R

Bharadwaja Rangavajhala   తాతినేని రామారావు కూడా ఓ రెండేళ్ల క్రితం క‌న్నుమూశారు … కృష్ణా జిల్లా క‌పిలేశ్వ‌ర‌పురం నుంచీ ఇండ‌స్ట్రీకి వెళ్లిన రామారావుకి ఆశ్ర‌యం క‌ల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంక‌ట సుబ్బారావు.

ఇల్ల‌రికం సినిమా టైముకి తాతినేని ప్ర‌కాశ‌రావుగారి ద‌గ్గ‌ర చేరిన రామారావు గారు .. అటు త‌ర్వాత ప్ర‌త్య‌గాత్మ‌తో కొన‌సాగారు.

పిఎపి బ్యాన‌ర్ లో ఆ రోజుల్లో డైరెక్ట‌ర్లు అయిన వారంద‌రూ దాదాపు కృష్ణాజిల్లా క‌మ్మ‌యువ‌కులే ..

Ads

మ‌ళ్లీ కులం ప్ర‌స్తావ‌న తెస్తావురా బార్బేరియ‌స్ అని తిడితే తిట్టిన‌ప్ప‌టికీ చాటునైనా య‌దార్ధం చెప్పాలి క‌దా …

పిఎపి సుబ్బారావుగారి మొద‌టి సినిమా డైరెక్ట్ చేసింది ఎల్వీ ప్ర‌సాద్ మాత్రం ఎగ్జంమ్ష‌ను..

ఆయ‌న ప‌గోజిల్లా కమ్మ అన్నమాట .

అయితే ఆయ‌న‌కీ కృష్ణా జిల్లాతో చాలా చుట్ట‌రికం ఉండేద‌నుకోండి ..

ముఖ్యంగా ఉయ్యూరు ప్రాంతంతో …

అది ప‌క్క‌న పెడితే ..

పిఎపి బ్యాన‌ర్ లోనే డైరెక్ట‌ర్ అయిన తాతినేని రామారావుగారి తొలి సినిమా న‌వ‌రాత్రి.

అక్కినేని హీరో.

ఇది త‌మిళం నుంచీ రీమేకు.

ఆలుమ‌గ‌లు ఆ బ్యాన‌ర్ లో ఆయ‌నిచ్చిన పెద్ద హిట్టు.

చిగురేసే మొగ్గేసే సొగ‌సంతా పూత‌పూచే లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయా సినిమాలో..

ప్ర‌త్య‌గాత్మ , తాతినేని రామారావు ఆల్డ‌ర్ నేటివ్ గా డైరెక్ట్ చేసేవారు …

త‌ర్వాత బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో …

మంచి మిత్రులు అనే కృష్ణ శోభ‌న్ బాబుల సినిమా తీశారు.

రామా నాయుడు బ్యానర్ లో జీవన తరంగాలు డైరెక్ట్ చేశారు.

ఎన్టీఆర్ తో తాతినేని రామారావు ప‌న్జేసిన తొలి సినిమా య‌మ‌గోల.

అక్కినేని కాంపౌండ్ డైరెక్ట‌ర్ గా పేరుంది అప్ప‌టికి తాతినేని రామారావుకి.

బ‌లే రంగ‌డు, బ్ర‌హ్మ‌చారి, దొర‌బాబు లాంటి అక్కినేని మాస్ సినిమాలు తీశారాయ‌న‌.

య‌మ‌గోల కు తాతినేని రామారావు డైరెక్ట‌ర్ అన్న‌ప్పుడు అన్న‌గారు కొంత సందేహంలో ఉన్నారు.

అందుకే … కె.వి రావును అసిస్టెంట్ గా పెట్ట‌మ‌ని కండీష‌న్ పెట్టారు.

అలాగే రైట‌ర్ ప్ర‌తిరోజూ సెట్ లో ఉండాల‌నేది మ‌రో కండీష‌ను.

ఆ సినిమా విజ‌యం సాధించిన త‌ర్వాత ఎన్టీఆర్ ఆట‌గాడు సినిమాకు డైరెక్ష‌న్ చేశారు.

tatineni

అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు తీసే సినిమాల‌కు ఎక్కువ‌గా ప‌న్జేసేవారు.

అలాగే శోభ‌న్ బాబుతో సినిమాలు తీసిన హ‌రికృష్ణ కూడా టీ కృష్ణ‌తో ట్రావెల్ మొద‌లెట్ట‌డానిక‌న్నా ముందు తాతినేని రామారావుతోనే ప్ర‌యాణించారు.

పూర్ణచంద్ర‌రావు నేతృత్వంలోనే తెలుగు సినిమాల‌ను హిందీలోకి రీమేక్ చేయ‌డం అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టి బొంబాయి డైరెక్ట‌ర్ అయ్యారాయ‌న‌.

తాతినేని రామారావుతో పాటు బాప‌య్య‌గారు కూడా ముంబై వెళ్లారు.

తాతినేని ప్ర‌కాశ‌రావు గారు తెలుగుదేశంలో చేరి వెన్నుపోటప్పుడు నాదెండ్ల వైపు ట‌ర్న్ అయిన‌ప్పుడు

ఆయ‌న కొడుకు టిఎల్వీ ప్ర‌సాద్ కు ఇక్క‌డ సినిమాలు మాయ‌మైపోయాయి.

అప్పుడు అత‌ను కూడా తాతినేని రామారావు గైడెన్స్ లోనే ముంబై షిఫ్ట్ అయ్యాడు.

అలా బాలీవుడ్ లో జండా ఎగ‌రేసిన తాతినేని రామారావు ఎన‌భై నాలుగో ఏట చెన్నైలో క‌న్నుమూశారు.

(పైన ఫోటో….. ఓ హిందీ నిర్మాతతో మాట్లాడుతున్న తాతినేని రామారావు, ఫోటోలో ఎల్వీ ప్రసాద్ ఉన్నారు… ఫోటో హిందీ న్యాయం కావాలి అప్పటిది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions