Subramanyam Dogiparthi…. సినిమా అంతా యస్ వరలక్ష్మే . ఆమె చుట్టూ అన్ని పాత్రలూ తిరుగుతుంటాయి . ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే . శివాజీ గణేశన్ లాగా అరుస్తూ ఊగిపోతుంటుంది . ఫుల్ ఏక్షన్ . భర్త , ఓ అల్లుడూ , ఓ కాబోయే అల్లుడూ అందరూ ఆమెతో పందెం కడతారు . సినిమా చాలా బాగుంటుంది . ఎక్కడా బోర్ కొట్టదు . హుషారు హుషారుగా సాగుతుంది . విషాదాంతాలు తీసే బాలచందర్ చక్కటి వినోదభరిత సినిమా తీయటం విశేషమే . 1971 లో వచ్చిన మన ఈ బొమ్మా బొరుసా తెలుగు సినిమాకు మాతృకయిన పూవా తలయ్యా సినిమాకు కూడా ఆయనే దర్శకుడు .
AVM వారి సినిమా కదా ! సాధారణంగా వాళ్ళ సినిమాలు జాగ్రత్తగా తీస్తారు . ఆ క్రమంలోనే ఈ సినిమా కూడా కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . నేనయితే ఎన్ని సార్లు చూసానో మా నరసరావుపేటలో కానీ , టి వి లో కానీ . యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే చూసేయండి . మీకు నచ్చుతుంది . నాదీ గ్యారంటీ . ఎలక్షన్స్ టైం కదా ! బడా బడా నాయకులందరూ గ్యారంటీలు ఇస్తున్నారు కదా ! నేనేమయినా తీసిపోయానా ?! నేనూ ఓ గ్యారంటీ పడేసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article
Ads