చర్వితచరణమే… ఇక ఈనాడులో తప్పుల గురించి, దాని పతనావస్థ గురించి చెప్పుకోవడం దండుగేమో… అప్పుతచ్చులు కాదు, అజ్ఞానపు రాతలు, అలవిమాలిన నిర్లక్ష్యం అలవాట్లుగా మారిపోయాయి ఈనాడుకు… ఇక్కడ మరోసారి చెబుతున్నా… వేరే దిక్కుమాలిన పత్రికల్లో ఏమొచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు… కానీ ఈనాడులో తప్పులు రావడమే పెద్ద తప్పు… దాని రేంజ్ అది… ఇన్నేళ్లూ తెలుగు పాత్రికేయంలో దాని స్థానం అది… మిగతావి జస్ట్, ఇగ్నోర్… అలాంటి ఈనాడులో చివరకు రామోజీరావుకు అవమానకరంగా, ఆయన్ని చూసి నవ్వుతున్నట్టుగా తప్పులొస్తున్నయ్… జిల్లా ఎడిషన్లు, జోన్ పేజీల్లో కాదు… ఏకంగా మెయిన్ పేజీలో… డబుల్ కాలమ్ ఫోటో ఐటమ్స్‌లో… హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సంబంధించిన వార్తను కూడా సబ్బింగ్ చేసుకోలేకపోవడం, పేజీల్లో పెట్టేముందు చూసుకోకపోవడం ఈనాడు వ్యవస్థ ఒక సమూహంగా, స్థూలంగా సిగ్గుపడాల్సిన అంశమే… ఇదీ ఆ వార్త…
చదివారు కదా… హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి పాల్గొన్న మీటింగు… అన్ని న్యాయస్థానాలకూ సొంత భవనాలు కడుతున్నారు కదా, ఒక భవనం భూమి పూజలో పాల్గొన్నప్పటి వార్త… శంకుస్థాపన లేదా భూమిపూజను ఇంగ్లిషులో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమనీ అని రాస్తున్నాం… బహుశా అక్కడ ఫలకంపై రాశారో లేక ఆహ్వానపత్రికలో రాశారో లేక మీడియా ఇన్విటేషన్లో అలా రాశారో గానీ… ఈ వార్త రాసిన రిపోర్టర్ ఆ కోర్టు కాంప్లెక్స్ పేరే ‘‘గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమనీ’’ అనుకుని, అదే రాసేసి పంపించినట్టున్నాడు… సరే, మూసాపేట కంట్రిబ్యూటర్ పొరపాటున రాసి ఉంటాడు… మరి దిద్దిన సబ్ ఎడిటర్ ఎవరు..? పేజీల్లో పెట్టిన సబ్ ఎడిటర్ ఎవరు..? పేజీల్ని పాస్ చేసిన బాస్ ఎవరు..? ఇంతకీ ఈనాడును ఇలా కుళ్లబొడుస్తున్న పెద్దలెవరు..? నిన్ననో మొన్ననో ఏదో పత్రికలో ఒక యాడ్ వచ్చింది… ఎంపీ సంతోష్ కోటిమొక్కల బాపతు ప్రకటన అది… అందులో వృక్షార్చన అనే పదం రెండుసార్లు ఉంది… ఆ బుుత్వం ఎగిరిపోయి అది కాస్తా వక్షార్చన అయ్యింది… పబ్లిష్ అయ్యేవరకూ ఎవరూ పట్టుకోలేదు… ఎందుకు..? ప్రూఫ్ రీడింగ్, ఫైనల్ చెక్ లేకపోవడం వల్ల… అదేదో చిన్న పత్రిక అయి ఉంటుంది, మరి ఈనాడుకేం పుట్టింది..? పత్రికకు కీలకమైన ఆ విభాగం ఎందుకు లేకుండా పోయింది..? ఇంకా ఎన్ని ‘గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమనీ’లు చేస్తారు మహాప్రభూ…! అసలు భాషను, పాత్రికేయ శైలిని ప్రేమించే వాళ్లు ఇంకా ఎవరైనా మిగిలారా అందులో..? లేక తప్పులు చూస్తూ చూస్తూ వాళ్లలోవాళ్లే కుమిలిపోతున్నారా..?!
Ads
Share this Article