Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లుంగీ పాలిటిక్స్… ఏ సీరియస్ ఇష్యూ లేక ఒడిశాలో లుంగీలపై పడ్డారు…

April 24, 2024 by M S R

రాజకీయాల్లో అంతే… మరీ ఎన్నికలొచ్చినప్పుడు పెద్దగా తిట్టుకోవడానికి సీరియస్ ఇష్యూస్ లేేనప్పుడు… ఏదో ఓ చిన్న అంశాన్ని కూడా తెర మీదకు లాగి రచ్చ చేయడానికి ప్రయత్నిస్తారు రాజకీయులు… ఏదో ఒకటి గెలకకపోతే అది రాజకీయం ఎలా అవుతుంది మరి..,?

ఒడిశాలో ఇదొక లుంగీ పంచాయితీ… లుంగీ పాలిటిక్స్… మన సౌత్ ఇండియాలో లుంగీ అంటే సంప్రదాయ వస్త్రవిశేషం… తెలుగువాళ్లయితే ఎక్కువగా ధోవతి… అవి కట్టేసుకుని మనం ఫంక్షన్లకు కూడా వెళ్తాం… అది మన ప్రైడ్, మన కల్చర్, మన ఖదర్… కానీ నార్త్‌లో ఎక్కువగా కుర్తా, పైజామా…

లుంగీలు కడతారు వాళ్లు కూడా… కానీ కేవలం ఇళ్లల్లో ఉన్నప్పుడు మాత్రమే… అదీ తక్కువే… కాకపోతే ధరించడం ఈజీ, ఫ్రీ ఎయిర్ ఫ్లో కాబట్టి కొందరు ఇష్టపడతారు… రీసెంటుగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండు చేతుల్లో రెండు శంకులు పట్టుకుని, వాళ్ల పార్టీ ఆఫీసు ‘శంక భవన్’ దగ్గర ఓ ఫోటో దిగాడు…

Ads

ఇదేమిటయ్యా అంటే… శంకు వాళ్ల ఎన్నికల గుర్తు… ఒక శంకు అసెంబ్లీ అభ్యర్థులకు, మరో శంకు ఎంపీ అభ్యర్థులకు వోట్లేయాలని వోటర్లకు అప్పీల్ అన్నమాట… ఈ ఫోటోలో ఆయన ఓ లుంగీ కట్టుకుని ఉన్నాడు… నవీన్ పట్నాయక్ మీద దుమ్మెత్తిపోయడానికి ఏమీ దొరక్క అవస్థ పడుతున్న బీజేపీకి ఇదొకటి దొరికింది…

lungi

నిజానికి రెండు పార్టీల నడుమ పొత్తు చర్చలు జరిగాయి గానీ వర్కవుట్ కాలేదు… ఎంపీ సీట్లు మీరు ఎక్కువ తీసుకొండి, అసెంబ్లీ నాకు వదిలేయండి అనేది నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ప్రతిపాదన… ఒడిశా బీజేపీ వాళ్లకు నచ్చలేదు, మనమే గెలుద్దాం, సీఎం పోస్టూ మనకే అనేది వాళ్ల అడ్డుపుల్ల… సరే, ఆ పొత్తు ఎత్తులు చిత్తయ్యాయి… (ఒడిశాలో 147 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు)…

సీఎం నవీన్ పట్నాయక్‌లాగే ఆయన వారసుడిగా చెప్పబడుతున్న వీకే పాండ్యన్ కూడా ఆ జంట శంకులను పట్టుకుని వోటర్లకు అప్పీల్ చేస్తూ కనిపించాడు మరో వీడియోలో… కానీ తను మాత్రం కుర్తా పైజామాలో ఉన్నాడు… వీకే పాండ్యన్ ఒరిజినల్‌గా తమిళుడు, ఒడిశా కేడర్‌లో పనిచేస్తూ చేస్తూ నవీన్ పట్నాయక్‌కు బాగా దగ్గరైపోయి, చివరకు తన వారసుడు అయిపోయాడు, రీసెంటుగా ఐఏఎస్ కేడర్‌కు రాజీనామా చేసి బీజేడీలో చేరిపోయాడు… గుమ్మం వద్దకే పాలన, 5టీ వంటి ప్రోగ్రాములను విస్తృతంగా జనంలోకి తీసుకుపోతున్నాడు…

తను నిజం చెప్పాలంటే యాక్టింగ్ సీఎం ఇప్పుడు… తనకే ఏ అధికార హోదా లేకపోయినా 74 మంది వరకూ సెక్యూరిటీ  సిబ్బంది అట… బీజేపీ పదే పదే తనను ‘ఈ గుమస్తా (ఏజెంట్) ఔట్ సైడర్’ అంటూ టార్గెట్ చేస్తూ ఉంటుంది… ఇప్పుడిక ఈ సీఎం లుంగీ కనిపించింది బీజేపీ వాళ్లకు… కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే అందుకున్నాడు…

‘‘ఈ ఔట్ సైడ్ ఏజెంట్ (పాండ్యన్) ఎన్నో పనులు చేసి పెడుతున్నాడు కదా, మరీ ఇలా లుంగీల్లో ప్రచారం ఏమిటి..? సీఎం గారికి ఒక కుర్తా పైజామా సమకూర్చలేకపోయాడా..? సీఎం పెద్దాయన, ఆయనంటే మాకు గౌరవం… ఒక పెద్ద మనిషి పట్ల తన ఏజెంటుకు ఏమాత్రం మర్యాద, శ్రద్ధ లేవా.,.? ’’ అని వ్యంగ్యంగా విమర్శలు వదిలాడు… ఇద్దరికీ తగిలేలా… కాకపోతే పాండ్యన్ పేరు పెట్టకుండా…

బీజేడీ ఊరుకుంటుందా..? ‘‘ఒడిశాలో లక్షలాది మంది చేనేత కార్మికులున్నారు, తమ నేత పని మీదే బతుకుతున్నారు… ప్రత్యేకించి సంబాల్‌పురి లుంగీలు మన ఉపాధి… (పోచంపల్లి చీరెల్లాగే అక్కడ సంబాల్‌పురి లుంగీలు ఫేమస్) ఈ లుంగీల మీద విమర్శ చేస్తూ బీజేపీ మన ఒడిశా చేనేత కార్మికులందరినీ అవమానిస్తోంది… బీజేపీ క్షమాపణ చెప్పాలి…’’ అని కౌంటర్లు వేశారు బీజేడీ నేతలు…

పాండ్యన్ ఔట్ సైడర్ కావడం, నవీన్ పట్నాయక్ పార్టీలో సెకండ్ చీఫ్ అయిపోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా చిర్రెక్కిస్తోంది… ‘‘ఒడిశాలో మైనింగ్ వ్యాపారమూ ఔట్ సైడర్లదే, బ్యూరోక్రాట్లు వాళ్లే, రాజకీయాల్లోనూ వాళ్లే… ఇక ఒడిశాస్వామ్యం ఎక్కడుంది..? మన ఒడిశా మనకు కావాలంటే ఈ ఔట్ సైడర్లను వదిలించుకోవాలి’’ అని అదీ విమర్శలకు దిగింది… ఏ సీరియస్ ఇష్యూ లేకపోవడంతో ఇప్పుడిలా లుంగీ పాలిటిక్స్‌లోకి, ఔట్ సైడర్ దుమారంలోకి ఒడిశా పొలిటిషియన్లు దూరిపోయారు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions