యోగీ అంటే అంతే… పక్కా మొస్సాద్ టైపు… వదలడు… ఈ కేసులోనూ అంతే… నిందితులైన గ్యాంగ్‌స్టర్ దంపతులు థాయ్‌లాండ్ పారిపోతే, ఇంటర్ పోల్ దాకా వెళ్లి, లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ, చివరకు థాయ్ పోలీసులనూ ఉరికించి, అక్కడ పట్టేసుకున్నాడు… పూచిక పుల్ల సహా మొత్తం ఆస్తులన్నీ సీజ్ చేశాడు… ఇప్పుడు ఆ దంపతులను పట్టుకొస్తాడట… ఏమో, జైలులోనే గుండెపోట్లు రావచ్చు, కోర్టుకు తీసుకుపోతుంటే జీపులే తిరగబడవచ్చు…
సదరు గ్యాంగ్ స్టర్ పేరు రవి కనా… అలియాస్ రవి నగర్… 40 ఏళ్లు… పేరుకు స్క్రాప్ వ్యాపారి… అదే అడ్డా… 16 మంది వరకూ తన గ్యాంగ్ యాక్టివ్ మెంబర్స్… తనకు తోడుగా తన భార్య కాజల్ ఝా… మొదట్లో తన దగ్గర ఏదో పనికి చేరిందట, తరువాత మనసులు గట్రా కలిశాయి… పెళ్లి చేసుకున్నారు… కలిసే గ్యాంగ్ మెయింటెయిన్ చేస్తారు… అధికారికంగా 11 కేసులు రిజిష్టరై ఉన్నాయి, కిడ్నాప్, చోరీ ఎట్సెట్రా…
యూపీలో నేరగాళ్ల పని పట్టడంలో యోగి స్టయిల్ వేరు కదా… ఈ స్క్రాప్ మాఫియా మీద పడింది కన్ను… యూపీ, ఢిల్లీల్లో సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, స్మగ్లింగు గట్రా బోలెడు కేసులు… ఆల్‌రెడీ కఠినమైన యూపీ గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ (Uttar Pradesh Gangsters and Anti-Social Activities (Prevention) Act) కింద బుక్ చేశారు… పోలీసులు వేట మొదలుపెట్టారు… ఆరుగురు గ్యాంగ్ మెంబర్స్ దొరికారు, లోపలేశారు.,.
Ads
ఆస్తుల స్వాధీనం మొదలుపెట్టారు… అసలే బుల్డోజర్ సర్కారు కదా… దాదాపు 350 కోట్ల విలువైన ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకున్నారు… అందులో రవి తన భార్యకు ఢిల్లీలో కొనిచ్చిన 100 కోట్ల లావిష్ బిల్డింగ్ కూడా ఉంది… స్క్రాప్ గోదాం, ఫ్యాక్టరీ, చివరకు స్క్రాప్ తరలించే ట్రక్కులు (స్క్రాప్‌తో సహా), భూమి, ఇతర వాహనాలను కూడా వదల్లేదు… దీంతో ఆ జంట థాయ్‌లాండ్ పారిపోయింది… కూపీ లాగితే అడ్రెస్ దొరికింది…
దొరికిన గ్యాంగ్ మెంబర్స్‌ను కోర్టులో హాజరు పరిచినప్పుడే 500 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు… అందులో ఈ స్క్రాప్ మాఫియా నెట్ వర్క్ మొత్తం కథ వివరించారు… ఆ జంటను పట్టుకురావడానికి ప్రస్తుతం యూపీ పోలీసులు థాయ్‌లాండ్ వెళ్లారు… శాండ్‌విచ్ మసాజ్ తప్పదేమో..!!
Share this Article