Sampathkumar Reddy Matta….. నువ్వుసోగి ౼ చెక్కుతొక్కు
~~~~~~~~~~~~~~~~~~
ఇటీవల సోషల్ మీడియాలో
తొక్కుల గురించిన వ్యాఖ్యానాల
పైత్యం బాగనే కనవడుతంది గదా !
జీవిస్తున్న ప్రాంతాన్ని బట్టి
నడుస్తున్న సమకాలాన్ని బట్టి
పదార్థం దొరికే తీరుతెన్నుబట్టి
పెద్దలు చెప్పిన సూత్రాలను బట్టి
ఆర్థిక సామాజిక అంతస్తులను బట్టి
అభిరుచిలో ఆధునికత స్థాయిని బట్టి
తొక్కులు పెట్టుట్ల వైవిధ్యాలు సహజమే గద.
మూలాలు తెలియక, తెలుసుకునే ఓపిక లేకనే
కొందరికి దీన్ని ట్రోల్ చేసే పిచ్చిలక్షణం ఏందోయేమో !!
~•~•~•~•~•~
మాకు ఎన్ని తొక్కులున్నా
మామిడికాయ తొక్కు పరమం.
మల్ల దాంట్ల ఎన్నిరకాలు పెట్టుకున్నా
నువ్వుసోగి లేకపోతే అసలు తృప్తి కానేగాదు.
నువ్వులు వేయించి పొడిగొట్టి పోసి
పెట్టుకునే దానిపేరే నువ్వుసోగి మామిడితొక్కు.
మామూలుగా అయితే ఇది పెద్దవక్కలతో పెట్టుకుంటం.
నిన్న, ఒక్క కాయైనాసరే, పెద్ద ముక్కలు చేద్దామని కూచుని
కొట్టే ప్రయత్నం చేస్తే, ఈలపీట తన బలం ఏమాత్రం సరిపోదన్నది.
ఎంతైనా పెట్టింది పేరు గదా అని, ప్రెస్టీజ్ చాకు తీసుకుని కూచున్న,
చాకు విరిగిపోయింది. అదృష్టం కొద్ది చేతికి ఏమీ కాలేదనుకోవాలె.
ఆరంభింపరు నీచమానవులు, ఆరంభించియు పరిత్యజింతురు
మధ్యములు, ధీరులు విఘ్ననిహన్యమానులగుచున్ ప్రారబ్దాన్ని
ఉజ్జగింపరు అనిపెద్దలు చెప్పిన బుద్ధిమాటలు గుర్తుకు తెచ్చుకుని
ఈ ప్రెస్జీజు చాకు ప్రారబ్దం ఇంతేవుందని ఒక్కచిత్తం చేసుకున్నాను.
కొంత తక్షణమైన మార్పు చేసుకుని , నువ్వుసోగి పనైతే మానలేదు.
వక్కల స్థానంలో పొరుసు అంటే పొట్టుతీసి సన్నముక్కలుగ చెక్కి
వీటితోనే సోగిపని పూర్తి చేసి పెట్టిన. ఈ తీరు పచ్చెడ మాకలువాటే.
చైత్ర పౌర్ణమి దాటిపోయింది గద, ఇగ తొక్కుల పని మొదలుపెట్టచ్చు.
మామూలు ఆవ, అల్లం పచ్చెడ, నువ్వుసోగి, పొరుసు, ఉప్పుతొక్కు
ఇవీ, మా కరీంనగరోళ్లు బాగ ఇష్టంగ పెట్టుకునే మామిడి తొక్కులు.
పచ్చి శెనగలు, మామిడి జీడి, ఎల్లిపాయలు ఎవరికి ఏవి ఇష్టమైతే
అవ్వి తొక్కుల్లో ఊరేసుకునుడు మనకు పెద్దలు నేర్పిన పద్ధతే గద…. ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి

Share this Article