మామూలుగానే టీవీల్లో వంటల పోటీలు అంటేనే ఓ స్క్రాప్ ప్రోగ్రామ్… టీవీల్లో వచ్చే వంటల ప్రోగ్రాములు, పోటీలు ఉత్త నాన్సెన్స్… సింపుల్ వంటకాల్ని కూడా నానా పెండాబెల్లం కలిపేసి, ఏవేవో పైన జల్లేసి, నూరి, మిక్సీ చేసి, తలతిక్క గార్నిషింగులతో వింత వింత వంటకాల్ని ముందు పెట్టి జడ్జిల మొహాన వెధవ నవ్వులు విసురుతారు కంటెస్టెంట్లు…
మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రసారం అవుతూ ఉంటుంది… అనేక భాషల్లో… తెలుగులో కూడా ఫ్లాప్ అది… సరే, ఆస్ట్రేలియాలో కూడా ఏదో టీవీలో సీజన్ 16 నడుస్తోంది… అంటే కమర్షియల్‌గా సక్సెస్ అయిందేమో… 2018, 2021 పోటీల్లో, అంటే సీజన్లలో మన ఇండియన్స్ శశి చెల్లయ్య, జస్టిన్ నారాయణ్ ఫస్ట్ ప్రైజులు గెలుచుకున్నారు… దీపిందర్ ఛిబర్, సందీప్ పండిట్, అది నైగీ వంటి కంటెస్టెంట్లు కూడా జడ్జిలను ఇంప్రెస్ చేశారు వేరే సీజన్లలో…
ఈసారి సుమీత్ సైగల్ అని 46 ఏళ్ల మహిళ కంటెస్టెంటు… ఆమె ఆలోచించిన తీరు నచ్చింది… అఫ్ కోర్స్, అది జడ్జిలకు కూడా బాగా నచ్చేసి భలే ఇంప్రెసయ్యారు కూడా… ఇంతకీ ఆమె ఈ పోటీలో ప్రజెంట్ చేసిందేమిటో తెలుసా..? పానీపూరీ… అదేనండీ, గోల్‌గప్పా… పుచుక్… పేరేదయితేనేం… ఇండియన్స్ రోజూ కొన్ని కోట్ల గప్‌చుప్‌లను గప్‌చుప్‌గా మింగేస్తుంటారు తెలుసు కదా…
Ads
అది ఇండియన్స్‌కు వదులుకోలేని ఓ చాట్ వ్యసనం… దీనంత పాపులర్ స్ట్రీట్ ఫుడ్ మరొకటి లేదు… ఈ వంటల పోటీ కోసం తన సేల్స్ మేనేజర్ కొలువునూ వదులుకొని కష్టపడుతోంది ఈమె… 17 ఏళ్ల ఇద్దరు కవలలు తనకు… కొత్త కొత్త డిషులు దేనికి..? గప్‌చుప్‌నే గప్‌చుప్‌గా కొత్త ఫ్లేవర్‌తో ప్రజెంట్ చేస్తే పోలా అనుకుంది… ఎస్, అదే చేసింది…
మామూలుగా మనం గప్‌చుప్ చాట్ బండ్ల దగ్గర తినే గప్‌చుప్ తరహా గాకుండా… ఆమె ఆలూ మిక్చర్‌ను కాస్త భిన్నంగా చేసింది… దానికి కొత్తిమీర, చింతపండు చెట్నీలను వేర్వేరుగా యాడ్ చేసి, పుదీనా-చాట్ మసాలా కలిపిన నీళ్లను కూడా పోసేసి జడ్జిలకు ఇచ్చింది… అలా నోట్లో పెట్టుకున్నారో లేదో జడ్జిలు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్‌కు అదిరిపోయారు… ఇప్పుడు ఆ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయిపోయింది…
ఇదీ ఆ ప్రోమో…
ఆమె కూడా ఒక పోస్టు ఇన్‌స్టాలో పెట్టుకుంది… ఆనందపడిపోయింది… ఇదీ ఆ పోస్టు…
Share this Article