నావల్లనే ప్రాబ్లమ్ అయితదంటే ఎల్లిపోతా నేను ఈడ నుంచి… అని జాతిరత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్..! వాట్సప్ కూడా అదే అంటోంది… నా పాలసీతో మీకు ప్రాబ్లం అయ్యేదుంటే నేను ఇండియా నుంచి వెళ్లిపోతా అంటోంది కేంద్ర ప్రభుత్వంతో… ఫైట్ చేస్తోంది, బెదిరిస్తోంది…
మూణ్నాలుగేళ్లుగా నడుస్తున్న పంచాయితీయే… ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది… విషయం ఏమిటంటే..? అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐటీరూల్స్ -2021 అని ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది… ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయినా సరే తప్పనిసరిగా ఓ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, గ్రీవియెన్స్ రెడ్రసల్ ఆఫీసర్ పోస్టుల్ని క్రియేట్ చేయాలి, నెలకోసారి నివేదిక సమర్పించాలి.,.
అంటే వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది సారాంశం… బహుళ జాతి సోషల్ మీడియా సంస్థలు దీనికి మొరాయిస్తున్నాయి… ప్రభుత్వ రూల్స్ గనుక కోరుకుంటే మెసేజుల ఒరిజినల్ సోర్స్ వెల్లడించాల్సి ఉంటుంది… అంటే సపోజ్ ఒక ప్రమాదకరమైన మెసేజ్ వ్యాప్తి చెందుతోంది అనుకొండి… ఎక్కడి నుంచి అది జనరేటయిందో తెలుసుకుంటుంది… తద్వారా అసాంఘిక ప్రచారకర్తలను పట్టుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం ఉద్దేశం…
Ads
వాట్సప్ మెసేజులు డిఫరెంట్, సెక్యూర్డ్… అది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్… అంటే మెసేజును బైనరీ డిజిట్లలోకి మార్చి పంపిస్తుంది… ఎండ్ పాయింట్‌లో డీక్రిప్ట్ అయిపోతాయి అవి… మధ్యలో దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు, చదవలేరు, చూడలేరు… అంటే యాక్సెస్ చేయలేరు… కానీ దీనివల్ల అవాంఛనీయ, ఫేక్, హేట్, వయెలెంట్ సందేశాలను ఎవరు క్రియేట్ చేస్తున్నారో పట్టుకోవడం కష్టం… అదుగో అక్కడ వస్తోంది ప్రాబ్లం…
యూజర్ డిటెయిల్స్ బయటికి తెలియడం, ఎన్‌క్రిప్టెడ్ మెసేజుల్ని బ్రేక్ చేయడం కస్టమర్ల ప్రైవసీ హక్కును కాలరాయడమే అంటోంది వాట్సప్.,. కాదు, మా దేశ అంతర్గత భద్రత మాకు ముఖ్యం అంటుంది కేంద్రం… ఇక కాదూ, కూడదూ ఆ రూల్స్ పాటించాల్సిందే అంటే తమకు ఇండియాను వదిలి వెళ్లిపోవడం తప్ప గత్యంతరం లేదు అని వాట్సప్ పేరెంట్ సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టులో చెప్పింది…
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ఆమధ్య కేంద్రం ఓ కొత్త బిల్లు పాస్ చేసింది… ఇంకా దాని అమలు రూల్స్ నోటిఫికేషన్ గట్రా జారీ కావల్సి ఉంది… సో, ఇలా వాట్సప్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ అనే కేసు… ప్రైవసీ రైట్ వర్సెస్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నట్టుగా మారిపోయింది… ఢిల్లీ హైకోర్టు ఏమంటుందో వేచిచూడాలి…
Share this Article