Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔనా..? హవ్వ… పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తుందా మృణాల్…!!

April 28, 2024 by M S R

హేమిటో… యూట్యూబ్ వీడియోల థంబ్ నెయిల్స్ చూస్తుంటే ఎవడికైనా మతిపోవాల్సిందే… ఎవడైనా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చాక, తరువాత ఆ వీడియో తాలూకు ప్రోమో చూసినా, థంబ్ నెయిల్ చదివినా సదరు ఇంటర్వ్యూ ఇచ్చినవాడికే బుర్ర గిర్రున తిరిగిపోతుంది…

సరే, వ్యూయర్ అటెన్షన్ డ్రా చేయడానికి థంబ్ నెయిల్ అలా ఫుల్లు మసాలాలతో పెట్టారే అనుకుందాం… తీరా లోపలకెళ్తే ఆ వీడియో ఏదేదో సుత్తి కొట్టి చావగొడుతుంది… ఈలోపు వాడికి రావల్సిన ఒక వ్యూ వచ్చేస్తుంది… ఇప్పుడు ట్రాజెడీ ఏమిటంటే..? ప్రింట్, డిజిటల్ మీడియా కూడా అదే థంబ్ హెడ్డింగులు, డెక్కుల రోగానికి గురికావడం… అవును, ఇదొక జాడ్యం…

పేపర్ పేరెందుకు లెండి గానీ… ఓ హెడింగ్ చదివితే బోల్డంత హాశ్చర్యమేసింది… ‘సీక్రెట్ రివీల్’ ఇదీ హెడింగ్… అబ్బో, మృణాల్ ఠాకూర్ బొమ్మ వేసి, సీక్రెట్ రివీల్ అని రాశాడంటే, ఏదో కొత్త సంగతి, ఆమెకు సంబంధించిన రహస్యమేదో విప్పుతున్నట్టు మనకు ఓ భ్రమ… అసలే ఈమధ్య గిరాకీ అధికంగా ఉన్న వీరోయిన్ కదా…

Ads

mrinal

దానికి డెక్కులు ఏమిటంటే..? పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు రెడీ అయిన మృణాల్… ఆమె డెసిషన్‌పై బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్న నెటిజన్లు… ఇవీ మిల్ లీడింగ్… నిజానికి ఆమె చెప్పింది… వార్త కంటెంటులో కరెక్టే రాసుకొచ్చారు ఫాఫం…

‘ఇప్పుడు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అని సలహాలు ఇచ్చేవాళ్లెవరూ నిజంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్లీ కనిపించరు… ఏ నలభయ్యేళ్లకో పిల్లల్ని కనాలనిపిస్తే కష్టం అవుతుంది… అందుకని  ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాను…’ ఇదీ ఆమె చెప్పింది…

నిజం… ఆమెకు ఇప్పుడు ఫుల్లు గిరాకీ ఉంది, ఇది ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుంది… పైగా ఇండస్ట్రీలో పిల్లల్ని కంటే హఠాత్తుగా సినిమా పెద్దలు వదిలేస్తారు… నిష్కర్షగా చెప్పాలంటే పనికిరాని సరుకు అవుతుంది… (కొందరు మినహాయింపు)… నయనతారకు ఇదంతా తెలుసు కాబట్టే సరోగసీ ద్వారా కవలల్ని పొందింది… తల్లితనాన్ని, ఇటు తమిళ స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తోంది… తెలివైంది…

మృణాల్ ఠాకూర్ నిర్ణయం అభినందనీయం… ఆమే కాదు, రీసెంటు ఇయర్స్‌లో బోలెడు మంది తమ ఎగ్స్ (అండాలు) భద్రపరుచుకుంటున్నారు… బోలెడు ఎగ్ బ్యాంక్స్ కూడా వచ్చాయి… నిజంగానే ఈ జనరేషన్‌లో ఫర్టిలిటీ సమస్యలు బాగా పెరిగాయి… ఫర్టిలిటీ రేటు బాగా పడిపోతోంది… కెరీర్ మీద, స్థిరపడటం మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అనివార్యత… ఏ 30 ఏళ్లకో పెళ్లి…

ఆ వయస్సు దాటాక పిల్లల కోసం మరికొంత వ్యవధి… కానీ మిస్ క్యారేజీలు, అబార్షన్లు గట్రా ఎక్కువయ్యాయి… ఫర్టిలిటీ సెంటర్లకు ఫుల్లు గిరాకీ ఇప్పుడు… ఆమధ్య చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో సంతాన ప్రసాదం పెడతాము అని చెప్పగానే లక్షల మంది ఎలా పోటెత్తారో చూశాం కదా… ఫుల్లు ట్రాఫిక్ జామ్… వర్తమాన సమాజంలో పెరుగుతున్న సంతానరాహిత్యానికి ప్రబల ఉదాహరణ అది…

ఎస్, మృణాల్ చెప్పింది కరెక్టు… ఆ సమయానికి తనే గర్భం ధరించకపోయినా సరే, తన హెల్త్ సహకరించకపోయినా సరే, సరోగసీ ఉండనే ఉంది… అదేమీ నేరం కాదు, అనైతికత అసలే కాదు… లీగల్… పైగా తన సొంత డీఎన్ఏ… అంటే తన సొంత బిడ్డ అనే ఓ ఫీల్ అమితంగా ఆనందాన్నిస్తుంది… చివరగా ఒక్క మాట చెప్పండి… ఆమె చెప్పిందేమిటి..? ఈ వార్తకు పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు రెడీ అయిన మృణాల్ అనే వంకర బాష్యం దేనికి..? సదరు జర్నలిస్టుడు కావాలనే రాశాడా..? ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్టే అర్థం కాలేదా..?! ఆమెకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నవ్వీ నవ్వీ ఏమయ్యేదో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions