భయం అక్కర్లేదు… ఇది ట్రావెలాగ్ అస్సలు కాదు… వర్జీనియాలో ఓ టూరిస్ట్ స్పాట్ ఉంది… అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి ఓ గంటన్నర ప్రయాణం… ఆ స్పాట్ పేరు లూరే గుహలు… (luray caverns)…
మన బొర్రా గుహల్లాంటివే… కానీ బొర్రా గుహలతో పోలిస్తే చాలా పెద్దవి… గతంలో ఏమో గానీ, రీసెంటుగా బాగా డెవలప్ చేస్తున్నారు… పర్యాటకులూ పెరుగుతున్నారు… అచ్చం ఇండియాలోలాగే కమర్షియల్ హంగులు ఎక్కువే… మ్యూజియం, టాయ్స్, మెమొంటోలు, ఫోటోలు, కేఫ్, ఇతరత్రా స్పోర్ట్స్ ఎట్సెట్రా…
సరే, ఏ టూరిస్ట్ స్పాటయినా సరే ఇంతే కదా… లోపల కూడా వీలైనంత లోతుకు తీసుకెళ్లేలా ఫుట్ పాత్… ముఖ్యమైన దర్శనీయ పాయింట్లలో లైట్లు… ప్రమాదకరంగా ఉన్నచోట్ల స్టీల్ గ్రిల్స్ గట్రా అన్నీ బాగున్నయ్… మొత్తం దాని నేచురాలిటీని డిస్టర్బ్ చేయకుండా, అక్కడక్కడా లైట్ల బిగింపు, టూరిస్టులు కాలినడకన తిరిగే బాట దగ్గర కొంత ఆల్టర్నేషన్స్ కనిపించాయి… బట్, మొత్తానికి చూడదగిన ప్లేస్ అనిపించింది…
Ads
మనం చెప్పుకునే అంశం ఏమిటంటే..? ప్రపంచంలో ఫలానా మతం వారు అనేమీ లేదు, ఫలానా ప్రాంతం వారు అనేమీ లేదు… ఎడ్యుకేషన్, ఎకనామిక్, సోషల్ స్టేటస్‌లు గట్రా ఏమై ఉన్నా సరే… ఓ అలవాటు మాత్రం కనిపిస్తుంది… రాజమండ్రి రైల్వే వంతెన మీద రైలు వెళ్తుంటే డబ్బులు, పైసలు విసురుతారు కదా…
అక్కడే కాదు, చాలాచోట్ల నదీప్రవాహాలు, ప్రత్యేకించి పుణ్యక్షేత్రాల దగ్గర నీళ్లల్లో నాణేలు వేయడం అలవాటు… కొన్నిచోట్ల గుళ్లల్లో కోనేర్లు, బావుల్లో కూడా వేస్తుంటారు… ఎందుకు అంటే పుణ్యం… అంతే… ఈ లూరే గుహల్లో కూడా ఓ చోట పై నుంచి బొట్లుబొట్లుగా పడే నీరంతా ఓచోట చేరుతుంది… ఓ బావిలా ఏర్పడింది…
మహానది గుడి కొలనులో నీటిలాగా స్వచ్ఛంగా… పై నుంచి గుండు సూది వేస్తే కిందకు చేరేదాకా కనిపిస్తూనే ఉంటుంది… దీని పేరు wishing well… అంటే శుభాన్ని లేదా మంచిని కోరడం అనుకోవచ్చు… లేదా కోర్కెల బావి అని కూడా అనుకోవచ్చు… అందులోనే అందరూ డాలర్లు, సెంట్లు వేసేస్తున్నారు… ఏమిటీ, ఎందుకూ అంటే..? అది ఏదైనా మంచి కార్యానికి ఉపయోగపడుతుంది, పుణ్యం అట…
నిజం… ఏ దశాబ్దంలో ఎంతెంత డబ్బు సమకూరింది, ఏయే కాజ్ కోసం వాటిని ఖర్చు చేస్తున్నారో కూడా ఓ బోర్డు పెట్టారు… నిజంగానే ఏదైనా మంచి కాజ్ కోసం డబ్బులు అడిగితే ఓ డబ్బా పెట్టి, అందులో వేయమని అడగొచ్చుగా… నో, ఆ బావిలోనే వేయాలట… ఎందుకయ్యా అంటే..? దాని పేరే విషింగ్ వెల్ కదా… సో, ఇలాంటి నమ్మకాలకు ఎవరూ, ఏ ప్రాంతమూ అతీతం కాదు…
ఇప్పటివరకూ వచ్చిన మొత్తం మన రూపాయల్లో చెప్పాలంటే… 9- 10 కోట్ల రూపాయలు… నీటి అడుగున నాణేలు, పైన తేలుతూ నోట్లు… ఆడ్‌గా అనిపించింది… కానీ ఒకటి మాత్రం నిజం… ప్రపంచంలో ఎక్కడైనా సరే, నీళ్లు కనిపించగానే నాణేలు వేయడం వింతగా అనిపించింది… అఫ్‌కోర్స్, ఇక్కడ ఆ డబ్బు మంచి పనుల కోసం వెచ్చిస్తున్నారు… శుభం…!!
Share this Article