Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన… అక్షరాలా ఇది వాణిశ్రీ సినిమా…

April 28, 2024 by M S R

Subramanyam Dogiparthi….  చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన , నిర్మాత బాలయ్యకు డబ్బులు గల్లుగల్లుమని రాలగా … తెలుగు వారి అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు డీగ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ చెల్లెలి కాపురం సినిమా .. సినిమా తపస్వి కె విశ్వనాథ్ కళాతపస్వి విశ్వనాథ్ గా రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన తొలి సినిమా అని కూడా పేర్కొనవచ్చేమో !

నటుడు బాలయ్య ఎప్పుడో వ్రాసిన నలుపు – తెలుపు అనే కధను విశ్వనాథ్ సానబెట్టి కళాత్మకంగా తీసారు … కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వంతో పాటు ఈ సినిమాను సూపర్ హిట్ చేసినవారు సంగీత దర్శకులు కె వి మహదేవన్ … సి నారాయణరెడ్డి వ్రాసిన రెండు పాటలు ఈ సినిమాలో సూపర్ హిట్ గా ఈరోజుకీ మిగిలిపోయాయి . ఒకటి చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన , మరో పాట కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా .
వాణిశ్రీ నటన … చాలా అందంగా ఉంటుంది … ఆమెవి రెండు శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి … రెండింటిలోనూ ఆమె నృత్యం కనులకు విందును చేస్తుంది … చరణ కింకిణులు నృత్యంలో ఘనత సగం పాట రచనకు పోతే , మిగిలిన సగం నృత్య దర్శకునికి , సంగీత దర్శకునికి , వాణిశ్రీకి పోవాలి . మరో నృత్యం రానే వచ్చాడు తీరా తానే వచ్చాడు పాటకి … నీల మేఘ వర్ణంలోని రాధగా వాణిశ్రీ , తనను కృష్ణుడు ప్రేమిస్తాడా అని కలవరపడే పాట …
కృష్ణుడిగా చంద్రమోహన్ తళుక్కుమంటాడు… కృష్ణుడిగా బాగానే ఉన్నాడు . ఇద్దరి నృత్యం బాగుంటుంది . కె యస్ రెడ్డి , పసుమర్తి కృష్ణమూర్తులు నృత్య దర్శకులు . ఈ పాటను దేవులపల్లి వారు వ్రాసారు . పిల్ల గాలి ఊదింది పిల్లనగ్రోవి ఊగింది , భలే భలే మా అన్నయ్య పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి .
శోభన్ బాబు , వాణిశ్రీల తర్వాత మెచ్చుకోవలసింది నాగభూషణం , మణిమాలలను … రావు గోపాలరావు ఇంకా ఫాంలోకి రాని రోజుల్లో ఈ సినిమాలో కూడా కనిపిస్తారు . నిర్మలమ్మ , కె వి చలం , సంధ్యారాణి , అల్లు రామలింగయ్య , ఛాయాదేవి , సత్యనారాయణ ప్రభృతులు నటించారు . శంకరాభరణం సినిమాలో సంగీతం మాస్టారి డైలాగులు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యకు ఉండటం గమనార్హం …

అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఎవర్ గ్రీన్ అనేందుకు ఈ సినిమా మరో తార్కాణం . తమిళంలో MGR , జయలలితలతో రీమేక్ చేయబడింది . మన తెలుగు సినిమాకు పేరు , డబ్బులతో పాటు ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు కూడా వచ్చింది . చక్కటి చిత్రం . చూడకపోతే ఓ కళాఖండాన్ని మిస్సయినట్లే . యూట్యూబులో ఉంది . తప్పక చూసి ఆస్వాదించండి . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టివిలో ఎప్పుడొచ్చినా కాసేపయినా చూస్తుంటా . వాణిశ్రీ అభిమానిని కదా ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!
  • నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…
  • ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే… భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…
  • అసలైన హీరో… రోజర్ మూర్ మనసున్న ‘బాండ్’…
  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?
  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions