రాజకీయాల్లో గానీ, ఇతర ఫీల్డ్స్‌లో గానీ… మందబుద్దులు కొందరిని పప్పు పప్పు అంటుంటారు గానీ… ఎగతాళి చేస్తారు గానీ… పప్పు పప్పే… మాంసాహారంకన్నా పోషకాల్లో దిట్ట, కొన్ని అంశాల్లో మాంసాహారంలోని మైనస్ పాయింట్లు కూడా పప్పులో ఉండవు… సో, శ్రేష్టమైనది పప్పే…
నీళ్లలాగా ఏ కూరగాయతోనైనా ఎంచక్కా కలిసిపోగలదు… స్టార్టర్, మెయిన్ కోర్స్, పులుసు… ఏం చేయాలనుకున్నా పప్పు పప్పే… హబ్బా… ఓ జాతీయ నేతను, ఓ ప్రాంతీయ నేతను ఉద్దేశించి చెప్పడం లేదు… నిజంగానే పప్పు గురించే చెప్పుకునేది… అంతెందుకు..? tasteatlas అని ఫేమస్ ఫుడ్ సైట్ ఉంది తెలుసు కదా…
Ads
ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఫుడ్ ఏదో ప్రతి ఏటా సర్వేలతో ర్యాంకులిచ్చి, మరీ ప్రకటిస్తుంటాడు… స్నాక్స్, డెజర్ట్స్, కరీస్, ఇలా అన్ని కేటగిరీల్లోనూ..! తాజాగా బెస్ట్ స్ట్యూ (stew) కేటగిరీలో టాప్ 50 ప్రకటిస్తే అందులో 9 మన ఇండియావే… రెండు పప్పువే… దటీజ్ పప్పు… ఒకటి దాల్ తడ్కా, మరొకటి ప్లెయిన్ దాల్… మిగతా ఏడులో నాలుగైదు నాన్ వెజ్… అందులోనూ రొయ్యలు, చికెన్, మటన్, పోర్క్ గట్రా ఉన్నయ్…
అవునూ, stew ను తెలుగులో ఏమనాలి..? సరిగ్గా ఇదీ అని చెప్పలేం… గ్రేవీ ఎక్కువగా ఉండే కూర… పోనీ, ముక్కలు ఎక్కువేసి వండిన గ్రేవీ… ఇప్పటికీ కొన్ని ఇళ్లలో చేసుకునే దప్పళం, ముక్కల పులుసు, చిక్కటి సాంబారు… అన్నీ… ప్చ్, తెలంగాణలో పాయ ఫేమస్… కానీ సిరి పాయ పేరిట పాకిస్థాన్ జాబితాలో పెట్టేశారు దాన్ని… టాప్ 50లో చోటుచేసుకున్న ఇండియన్ టాప్ స్ట్యూలలో మిసాల్ కూడా ఉంది…
మరి అది పులుసు కాదు, గ్రేవీ కాదు… అచ్చంగా కూరే… ఐనా సరే ఈ జాబితాలోనే చేర్చేశారు… చాట్ బండార్‌లలో పావ్ బజ్జీతోపాటు ఇస్తారు కదా, అదీ మిసాల్… టాప్ 50 జాబితాలో ఆరో ప్లేసులో ఉన్న కీమా అందరికీ తెలిసిందే… 22వ ప్లేసులో కొర్మా ఉంటుంది… ఇదీ దాదాపు కూరే… పెరుగుకు మటన్ లేదా చికెన్ లేదా కూరగాయలు యాడ్ చేసి మసాలాలతో వండేది… ఇది ఓ మొఘలాయి వంటకం
26 వ ప్లేసులో ఉన్న విండాలూ నిజానికి పోర్క్‌తో చేసేది… పోర్చుగీస్ తరహా వంటకం… అందుకే మన గోవా, దాని పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది… 32వ ప్లేసులో ఉన్నది సాగ్ పన్నీర్… పాలకూర లేదా ఇతర ఆకుకూరలతో పన్నీర్‌ను కలిపి చేసేది… నిజానికి ఇదీ పులుసు కేటగిరీ కాదు, కూర… షాహీ పన్నీర్ కూడా జాబితాలో ఉంది, ఇదీ మొఘలాయి వంటకమే… థిక్ గ్రేవీ… రాజకుటుంబాల పులుసు కమ్ కరీ… చెప్పొచ్చేది ఏమిటంటే… పప్పు అంటూ ఎవరినీ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అని..! రాహుల్ ప్రధాని కావొచ్చు, లోకేష్ ముఖ్యమంత్రీ కావొచ్చు..!!
Share this Article