జాగర్లమూడి క్రిష్… వయస్సు 45 ఏళ్లు… అమెరికాలో ఉన్నత చదువులు చదివి, సినిమా మీద ప్యాషన్‌తో ఇండియాకు తిరిగొచ్చేసి, 2008 నుంచీ ఫీల్డ్‌లో ఉన్నాడు… మొదట్లో మంచి సినిమాలు వచ్చినయ్ తన నుంచి… మెరిట్ ఉన్న దర్శకుడు… అందులో ఏ డౌటూ లేదు… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త భిన్న కథాంశాలను ఎంచుకున్నాడు… గుడ్…
కానీ ఏదో ఏలిన్నాటి శని పట్టుకున్నట్టుంది… బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి తీశాడు, బాగానే ఉంది సినిమా… ఆ నమ్మకంతోనే బాలకృష్ణ ఎన్టీయార్ బయోపిక్స్ ఇచ్చాడు… కథానాయకుడు, మహానాయకుడు… కానీ పొలిటికల్ అవసరాలు, ఎన్టీయార్‌ను ఆకాశమెత్తు చూపించాలనే ఒత్తిళ్ల నడుమ కథ అదుపు తప్పి, సినిమాలు రెండూ ఫ్లాప్… క్రిష్ తెల్లమొహం వేశాడు… అంతటి ఎన్టీయార్ బయోపిక్స్‌ను ప్రేక్షకులు చూడలేదంటే అదొకరకంగా మేకర్స్‌కు అవమానమే…
ఆ తరువాత హిందీలో కంగనాతో దెబ్బతిన్నాడు… మణికర్ణికకు తనే మొదట దర్శకుడు… కానీ మధ్యలోనే ఆమెకు ఎందుకో కోపం వచ్చి, తనే మెగాఫోన్ పట్టింది… క్రిష్ వదిలేసి వచ్చేశాడు… తరువాత క్రిష్‌కు పేరు తెచ్చిన సినిమా లేదు, పెద్ద ప్రాజెక్టు లేదు, పైగా తన సంసారంలో కలతలు, విడాకులు… మొత్తానికి అస్తవ్యస్తంగా అయిపోయింది జీవితం…
Ads
పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు అని అప్పుడెప్పుడో మొదలుపెట్టారు… రెండు భాగాలు అనుకున్నారట… కానీ పవన్‌తో సినిమా అంత ఈజీ కాదు, అడుగడుగునా తన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది… దర్శకుడు- స్వేచ్ఛ వట్టి మాటలు… ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు గానీ, రాబోయే ఎన్నికల్లో కొంత ఫాయిదా ఉంటుందని అనుకున్నారేమో హఠాత్తుగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ వంటిది వదిలారు…
తీరా చూస్తే అందులో నిర్మాత పేరుంది, పవన్ పేరుంది, ఐదు భాషల పేర్లున్నయ్, పాన్ ఇండియా కదా, ప్రొడక్షన్ హౌజ్ పేరుంది… ధర్మం కోసం యుద్ధం అనే ట్యాగ్ కూడా ఉంది, ఓ బల్లెం కూడా కనిపిస్తోంది… ఎటొచ్చీ క్రిష్ పేరు లేదు… అదేమిటి..? దర్శకుడి పేరు లేకుండా ఈ ప్రచారం ఏమిటీ అంటారా..?
ఏమో… మణికర్ణిక అనుభవమే మళ్లీ ఎదురైందేమో…! అందుకేనేమో క్రిష్ పేరు మాయమైంది, కాదు కాదు, అసలు ఉంటే కదా మాయమైపోయేది… పవన్‌తో ఏం డిఫరెన్సెస్ వచ్చాయో తెలియదు… కానీ ఒకటి గుర్తొచ్చింది… ఆమధ్య ఏదో సినిమా… దర్శకుడికీ నిర్మాతకూ నడుమ ఏవో విభేదాలు… హఠాత్తుగా దర్శకుడిని ఇంటికి పంపించేసిన నిర్మాత ఒకరిద్దరు అసోసియేట్ డైరెక్టర్లతోనే సినిమా చుట్టేసి, తనే దర్శకుడిగా పేరే వేసుకున్నాడు…
సినిమా ఫీల్డ్ కదా, ఏదైనా జరగొచ్చు… నిజానికి క్రిష్ వంటి దర్శకులు స్టార్ హీరోలు, పెద్ద బ్యానర్ల జోలికి పోవద్దు… రకరకాల పరిమితులు, ఒత్తిళ్లు ఉంటయ్… ప్రతి చిన్న ఇష్యూలోనూ హీరోల జోక్యం, రాగద్వేషాలు, అభిరుచులు, ఇమేజులు గట్రా స్వేచ్ఛాకథనాలకు అడ్డుపడతయ్… ప్రభావితం చేస్తయ్… హరిహరా… ఇదండీ వీరమల్లు తాజా కథ…
Share this Article