Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చలం లక్కీ… పద్మనాభం, కాంతారావులా చేతులు కాల్చుకోలేదు…

May 1, 2024 by M S R

Subramanyam Dogiparthi…..  ఇది భానుమతి సినిమా . ఈ సినిమాకు ఆమే షీరో . ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినామరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది . లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో . ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , జమున తల్లి పాత్రలో మోహనను ఇలా రకరకాల పేర్లతో వాయించేస్తుంటుంది .

మంచి సినిమా . An entertaining Feel Good Movie . బాగా ఆడింది . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . సినిమా ప్రారంభమే భానుమతి పాడే శరణం నీ దివ్య చరణం అనే పాటతో . చెవుల్లోని తుప్పు వదులుతుంది . మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట , నా మాటే నీ మాటై చదవాలి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . రిం జిం రిం జిం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ పాటతో …, పాటలో హైదరాబాద్ వర్ణన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో టీజింగ్ పాట హుషారుగా ఉంటుంది . ఆ డియ్యాలో అనే పదాన్ని రచయిత రాజశ్రీ ఎక్కడ నుండి పట్టకొచ్చాడో కానీ గమ్మత్తుగా ఉంటుంది .

బి వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భానుమతి , జమున , రుష్యేంద్రమణి , గీతాంజలి , మోహన , చలం , ప్రభాకరరెడ్డి , సాక్షి రంగారావు , రాజనాల , కె వి చలం , పద్మనాభం ప్రభృతులు నటించారు . చలం ‌స్వంత సినిమా కదా ! చాలామంది హాస్య నటుల్ని ఏదో ఒక పాత్రలో చూపించాడు . రాజశ్రీ డైలాగులు బాగుంటాయి . కోకమ్మ గారు అని జమునని చలం చేత అనిపిస్తారు . కోక అంటే చీరె . చీరె అంటే sari .

Ads

జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా వచ్చింది . చలం అదృష్టవంతుడు . పద్మనాభం , కాంతారావుల్లాగా చేతులు కాల్చుకోలేదు . శారదతో కలిసి ఉన్నప్పుడు తీసిన సినిమా . పేరు , డబ్బులు అన్నీ వచ్చాయి . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . యూట్యూబులో ఉంది . చూడనివవారు ఉంటే వాచ్ లిస్టులో పెట్టేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions