ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే… అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… తాజాగా ఏదో టీవీషోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్‌లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో గానీ… మంచి మంచి అవకాశాలు కోల్పోయి, ప్రస్తుతం ఏం వెండితెరకు సంబంధించి ఏం చేస్తున్నదో కూడా తెలియని దుస్థితి… కానీ తను ఏ షోలో కనిపించినా నవ్వుతూ, తుళ్లుతూ, అందరినీ ఆటపట్టిస్తూ, చురుకుగా… ప్లస్ స్పోర్టివ్‌గా కూడా కనిపిస్తుంది… కానీ ఆమె కంటతడి పెట్టిన సీన్ ఒకటి విశేషంగా కనిపించింది… సాధారణంగా సినిమా తారల తెర వెనుక జీవితాల్లో బోలెడంత విషాదమో, అన్నీ చంపుకునే అనుభవాలే ఊహించగలం… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది…
ఈటీవీలో ‘ఆలీతో సరదాగా’ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది తెలుసుగా… రాబోయే ఎపిసోడ్ ముమైత్ ఖాన్‌తో చిట్ చాట్… పేరుకు సరదాగా అని రాసుకున్నా ప్రతి ఎపిసోడ్లో గెస్టుతో కన్నీళ్లు పెట్టించడం, దాన్ని ప్రోమోగా ప్రచారం చేసుకోవడం అనే ఓ వింత అలవాటు ఉంది ఆలీకి… అయితే అది ప్రతి ఎపిసోడ్‌లోనూ తను అనుకున్నంతగా రక్తికట్టదు… హిమజ, వర్షిణి వంటి కేరక్టర్లు అస్సలు కన్నీళ్లే పెట్టుకోరు… కానీ పంచులు వేస్తూ, నవ్వుతూ జోవియల్‌గా కనిపించే ముమైత్ కన్నీళ్లు కాస్త విశేషంగా అనిపించాయి… విషయం ఏమిటంటే..? బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలో శ్రద్ధాదాస్‌తో ఓ పాట చేస్తున్నప్పుడు ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్‌పై కాలు స్లిప్పయి, ఒక కార్నర్ అంచుకు ఆమె తల కొట్టుకుంది… కోమాలో 15 రోజులున్నది… నిజంగానే ఇది బయట చాలామందికి తెలియదు… రెండు రోజులపాటు బ్రెయిన్ బ్లీడింగ్ ఆగలేదు, డాక్టర్లు మూడేళ్లు రెస్ట్ అవసరమని చెప్పారు… ఆమె ఎలాగోలా 3 నెలల్లో మళ్లీ ఫీల్డ్ మీదకు వచ్చేసింది… కానీ ఆ సమయంలో తను అనుభవించిన పెయిన్ పాపం అనిపించేదే… చెప్పొచ్చేదేమిటంటే… ఆమె కైపు చూపుల వెనుక మనకు కనిపించకుండా సుడులు తిరిగే ఏదో పెయిన్ ఉంటుందని..! కన్నీటిని దాచుకునేందుకూ కష్టమేనని…! ఇక్కడ ముమైత్‌ది నటన కాదు… రియాలిటీ… ఆలీతో సరదాగా షో కాస్తో కూస్తో జనంలోకి వెళ్తున్నదీ అంటే, ఇదిగో ఇదే… ఇలాంటి ఎమోషనల్ అంశాల్ని గెస్టుల నుంచి రాబట్టడమే… మిగతా సెలబ్రిటీ ఇంటర్వ్యూలకూ ఈ షోకూ నడుమ తేడా కూడా అదే…!
Ads
Share this Article