2700 డర్టీ వీడియోలతో బట్టబయలైన ప్రజ్వల్ రేవణ్న డర్టీ చరిత్ర దేశవ్యాప్తంగా ఓ సంచలనం… చివరకు చెల్లి వరుస అమ్మాయిని, వృద్ధురాళ్లను, పనిమనుషులను కూడా వదలని కామాంధుడు… కర్నాటక ప్రభుత్వం దొరికాడు కదాని వెంటనే కేసులు నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేయగానే జర్మనీ పారిపోయాడు…
ఇదంతా తెలుసు కదా… డిప్లమాటిక్ పాస్‌పోర్టు మీద దేశం దాటిపోయాడు… పట్టుకుని తీసుకురావడానికి లుక్ అవుట్ నోటీసులు మన్నూమశానం ఏదో ప్రొసీజర్ నడుస్తోంది… ఆ జేడీఎస్ పార్టీతో పొత్తు కూడినందుకు బీజేపీ మింగలేక, కక్కలేక, ఏమీ చెప్పలేక, సమర్థించుకోలేక, ఖండించలేక నానా పాట్లూ పడుతోంది…
అప్పుడు సదరు ప్రజ్వలుడి అయ్య, అనగా నాన్న ఏమన్నాడు..? అబ్బే, అవి పాత వీడియోలు అన్నాడు… అంటే పాత వీడియోలు అయితే అందులో నిజాలు లేవనా..? కాదు కదా… పైగా ఆ ధూర్తచరితుడు ప్రజ్వల్‌కన్నా వాళ్ల తండ్రి సమర్థనే ఛండాలంగా ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా… ఈ కథలో మరో ట్విస్టు… ఈసారి ఏకంగా ఆ అయ్యే అరెస్టయ్యాడు, అదీ తన అయ్య ఇంట్లో రక్షణ ఉంటుందని అక్కడ చేరితే పోలిసులు అక్కడికే వెళ్లి జీపెక్కించారు…
Ads
ఎవరో మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసు తనపై… ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే బెంగుళూరు కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది… అరెరె, నేను కూడా జర్మనీ జంపైపోతే బాగుండేదని అనుకుంటూ దేవెగౌడ ఇంటికి పరుగు తీశాడు, మాజీ ప్రధాని ఇళ్లయితే ఇమ్యూనిటీ ఏమీ ఉండదు కదా… సిట్ వెళ్లింది, ఛల్ ఛల్ అని జీపెక్కించి తీసుకుపోయారు… ప్రజ్వల్ కేసులో అయ్యగారు కూడా నిందితుడే…
అంటే, ప్రజ్వలుడు మాత్రమే కాదు, అయ్య కూడా ఆటగాడే అన్నమాట… అందుకే కొడుకును అలా సమర్థించుకొచ్చాడు… ఇంకా బయటపడని కేసులెన్ని ఉన్నాయో… ఏం ఫ్యామిలీరా బాబూ అని కన్నడిగులు ఛీకొడుతున్నారు… ఎస్, ఈ దేశానికి నిజమైన శాపం ఏమిటీ అంటే… ఇదుగో ఇలాంటి అవినీతి, అక్రమాల, కుటుంబ, డర్టీ ప్రాంతీయ పార్టీలు…
మొన్నామధ్య మనం ఓ కథనం చదువుకున్నాం కదా… జేడీఎస్ దేవెగౌడ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఓ పోస్టులో ఉంటారు… అలా అకామిడేట్ అయిపోతారు, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, చివరకు జెడ్పీ ఛైర్మన్… ఏదీ వదలరు, ఇంకెవరికీ పదవులు ఇవ్వరు… తీరా తవ్వితే ఇదుగో ఇలాంటి డర్టీ బాగోతాలు… ఛ, ఇలాంటి డర్టీ పొలిటిషియన్స్‌ను ఎన్నుకుంటున్న ఆ జనానిది తప్పు… అంతే…!!
Share this Article