Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పారిపోవడం కూడా యుద్ధవ్యూహంలో ఓ భాగమే అంటారు పెద్దలు…

May 5, 2024 by M S R

Subramanyam Dogiparthi….. పారిపోవటం కూడా యుధ్ధ వ్యూహంలో ఒక భాగమే అని ఈమధ్య వచ్చిన మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడు చెపుతాడు . సీరియల్ అని ఎందుకు అన్నానంటే వ్యాస భారతంలో అన్నాడో, భాగవతంలో అన్నాడో నాకు తెలియదు . ప్రవచనకర్తలు జరాసంధుని గోల పడలేక కృష్ణుడు మధుర నుండి ద్వారకకు షిఫ్ట్ అయ్యాడని చెపుతుంటారు . సరే . ఇప్పుడు కలియుగ భారతానికి వద్దాం …


పాపం రాహుల్ ! 2004 , 2009 , 2014 ఎన్నికల్లో అమేధీ నుండి లోకసభకు గెలిచారు . 2019 లో అమేధీలో ఓడిపోయి , వాయినాడ్లో గెలిచారు . ఇప్పుడు 2024 ఎన్నికలకు వాయినాడ్ , రాయబెరెల్లీ నుండి పోటీ చేస్తున్నారు .BJP వారు రాహుల్ పారిపోయాడని ఎత్తిపొడుస్తున్నారు . రాజకీయాల్లో సూటిపోటి మాటలు మామూలే . కానీ…

నరేంద్ర మోడీ గుజరాత్ వారు . 2014 ఎన్నికల్లో వదోధర , వారణాసి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసారు . 2019 ఎన్నికల్లో వారణాసి నుండి పోటీ చేసి గెలిచారు . పొలిటికల్ కెరీర్ అంతా గుజరాతే అయినా వారణాసి నుండి కూడా ఎందుకు పోటీ చేసారో తెలియదు …

BJP వ్యవస్థాపకులలో ఒకరయిన వాజపేయి ఉత్తర ప్రదేశ్ వారు . ఆయన బలరాంపూర్ , మధుర , లక్నో , గ్వాలియర్ , ఢిల్లీ , గాంధీనగర్ నియోజక వర్గాల నుండి పోటీ చేసారు . కొన్ని సార్లు ఓడిపోయారు . ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ లో లేవు …

మరొక వ్యవస్థాపకులు అధ్వాణీ . ఆయన కరాచీలో విభజనకు ముందు జన్మించి , తర్వాత బొంబాయికి వచ్చారు . ఆయన ఢిల్లీ , గాంధీ నగర్ లోకసభ సీట్ల నుండి పోటీ చేసారు …

భాజపా మిత్రులు అమితంగా అభిమానించే కాంగ్రెస్ నాయకుడు పివి . ఆయన తెలంగాణా వారు . హనుమకొండ నుంచే కాదు , రాంటెక్ , నంద్యాల , బెర్హంపూర్ ల నుండి కూడా పోటీ చేసారు .

రాజకీయ నాయకులు ఏ ప్రాంతం వారయినా ఎక్కడెక్కడ నుండో పోటీ చేస్తుంటారు , పారిపోతుంటారు . అవన్నీ యుధ్ధ వ్యూహాలే మనకు నచ్చితే . అదండీ ఈ పారిపోయే స్టోరీ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions