Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎక్కడైనా అక్షింతలు అంటే బియ్యమే… ఆకాశం వర్షించే గింజలు కావు…

May 5, 2024 by M S R

బీజేపీ హిందూ సంఘటన వ్యూహాల్ని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్‌కు అస్సలు అర్థం కావడం లేదు, ప్రసంగాల్లో గందరగోళం కనిపిస్తోంది… అప్పుడే ఒక మాట, మళ్లీ అప్పుడే మరో మాట… కేడర్‌లోనూ అయోమయం నింపుతున్నారు…

అన్నింటికన్నా ముందుగా… బీఆర్ఎస్‌కు మొన్నమొన్నటిదాకా మజ్లిస్ సెక్యులర్ పార్టీ, జాన్ జిగ్రీ… కానీ బీజేపీ మాత్రం మత పార్టీ… చేతనైతే బీజేపీ విధానాల్ని ఖండితంగా వ్యతిరేకించాలి, తప్పదు, తప్పులేదు, అది రాజకీయ అవసరం… అది అమాంతం మింగేయడానికి వస్తున్న అనకొండ…

కానీ అటూఇటూ కాని ధోరణి సరికాదు… జైశ్రీరామ్ అంటే కడుపులు నిండవు అంటాడు కేటీయార్ ఓసారి… అలా అన్నవారిని సముదాయించి, కన్విన్స్ చేయాలంటాడు… మళ్లీ తనే ఇంకెక్కడో రాముణ్ని మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం అంటాడు… సరే, కేసీయార్ అయితే మరీ ఘోరంగా అయోధ్య మీద వ్యాఖ్యానాలు చేశాడు, మళ్లీ మళ్లీ రాసుకోవడం, చదువుకోవడం వృథా…

Ads

కేటీయార్‌ ప్రతిచోటా బీజేపీ మీద చేస్తున్న ద్వైధీభావంతోపాటు హిందూ ఓటును తనంతట తానే బీజేపీ వైపు నెట్టేస్తున్నట్టుగా ఉంది… నాస్తికుడిగా కనిపిస్తాడు, వెంటనే ఆలంపూర్ గర్భగుడి మెట్ల మీద మొక్కుతూ కనిపిస్తాడు… సేమ్, బీజేపీ మీద చేసే విమర్శలు కూడా…

తాజాగా ఏమంటున్నాడు..? అవి అయోధ్య అక్షింతలు కావు, కేవలం రేషన్ బియ్యమే అట… బియ్యం కాకపోతే అక్షింతలు వేటితో చేస్తారు..? అవి రేషన్ బియ్యమా..? సోనా మశూరియా, బాస్మతి బియ్యమా అని కాదు… అవి ఏ సంకల్పంతో మన చేతుల్లోకి చేరాయో అది ప్రధానం… తిరుపతి లడ్డూలు, పుల్లారెడ్డి స్వీట్ షాపు లడ్డూలు సేమ్ అంటారా ఎవరైనా..? ఇదీ అంతే… అక్షింతలు ఆకాశం నుంచి రాలిపడే గింజలు కావు, రాముడి తలంబ్రాలుగా సంకల్పించుకుని, భక్తిగా కలుపుకునే బియ్యమే… అబ్బే, అవి రేషన్ బియ్యం అని వెక్కిరింతలు దేనికి..?

ktr

కేటీయార్ ఘనంగా చెప్పుకునే యాదగిరిగుట్టలో అక్షింతలు, భద్రాచలంలో అక్షింతలు మాత్రం బియ్యం కావా..? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అయోధ్య భక్తులను (తటస్థంగా, బీజేపీకి సంబంధం లేకుండా…) కించపరచడమే… పోనీ, అయోధ్య అక్షింతల్ని స్వీకరించిన సగటు గృహస్తు వాటిని బీజేపీ అక్షింతలుగా తీసుకోలేదు కదా, ఆ అక్షంతల్ని స్వీకరించడం అంటే అయోధ్య గుడికి ఓ సమర్థన, రాముడి పట్ల భక్తి…

ఎస్, బీజేపీ రాముడిని వాడుకుంటోంది… మతవాదం సరికాదు… వోకే, మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘కేసీయార్ ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువు, యాదాద్రి కట్టాడు, అయుత చండీయాగం చేశాడు, మజ్లిస్‌తో మాకు దోస్తీ లేదు’ వంటి ప్రచారం ఎందుకు జరిగింది..? హిందువుల వోట్ల కోసం, హిందూ వోటు బీజేపీకి పోకుండా చేయడం కోసం… అదొక వ్యూహం అనుకుంటే ఇక బీజేపీకి, బీఆర్ఎస్‌కూ నడుమ తేడా ఏముంది..?

అయోధ్య చందాల సేకరణ వేళ కొందరు కాంగ్రెస్ నేతలు సైతం విరాళాలు ఇచ్చారు… కారణం రాముడి మీద భక్తి మాత్రమే కాదు, రాముడు అందరివాడు, రాముడిపై బీజేపీకి పేటెంట్లు ఏమీ లేవు అని చాటడానికి..! ఆ సున్నితమైన అంశం కేటీయార్‌కు అర్థమై ఉంటే ఈ ‘రేషన్ బియ్యం’ వంటి వ్యాఖ్యలు వచ్చేవి కావు… అలాంటి వ్యాఖ్యలే చేసిన పొన్నం ప్రభాకర్‌కూ నీకూ తేడా లేనట్టేనా కేటీయార్..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions