‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు….
…. ఆంధ్రజ్యోతి పత్రికలో దాని ఓనర్ రాధాకృష్ణ అనే జర్నలిస్టు రాసుకొచ్చాడిలా… ఇది ఎందుకు గుర్తుచేశాడు అంటే… జగన్ దొంగ, ఆర్థిక నేరస్తుడు, అలాంటివాళ్లు నీతులు చెబుతున్నారు, ప్రజలారా ఇక మీరే కర్తవ్యాన్ని గుర్తెరిగి జగన్‌కు వాతలు పెట్టాలి అనేది ఆయన మార్మికమైన పిలుపు…
మార్మికం ఏముంది..? ఆయన స్ట్రెయిట్‌గానే చెబుతున్నాడు తన మీడియా స్టోరీల ద్వారా… ఎటొచ్చీ ఇక్కడ నవ్వొచ్చింది ఏమిటంటే… పాత్రికేయులు పార్టీల మౌత్ పీసులుగా మారగా లేనిది, మీడియా హౌజులు పార్టీల అనఫిషియల్ ఆఫీసుల్లాగా మారగా లేనిది… సైంటిస్టులు జ్యోతిష్యం చెబితే తప్పేమిటట…
Ads
చెప్పకూడదని ఏముంది..? జర్నలిస్టులు రాజకీయ పార్టీల కార్యకర్తలు, సలహాదారులు, వ్యూహకర్తలు, సౌండ్ బాక్సులుగా అయినప్పుడు సినీనటులు భక్తిని వ్యాప్తి చేస్తే తప్పేమిటి..? ఐనా బాబాలు సైన్స్ బోధిస్తే అదేమైనా విపత్తా..? సైన్స్‌ను అంగీకరించి, అదే అంతిమం అని ప్రజలకు క్లారిటీ ఇస్తున్నట్టే కదా పరోక్షంగా…
నాయకులు దేవుడి గురించి మాట్లాడితే తప్పేమిటి..? ప్రవాస భారతీయులు దేశాన్ని ప్రేమించాలని చెబితే తప్పేమిటి..? NRI అంటే పొట్ట చేత్తో పట్టుకుని దేశదేశాలకు వలస పోయినవాళ్లే తప్ప ఇక్కడ బ్యాంకుల్ని, పేదల్ని మోసగించి వేల కోట్లు పోగేసుకుని పారిపోయినవాళ్లు కాదు కదా… అసలు సదరు కృష్ణశాస్త్రి రాసిన ఓ సోషల్ మీడియా పేరాను రాధాకృష్ణ ఎందుకింత ఓన్ చేసుకుంటున్నట్టు..? ప్రవాస భారతీయులకు దేశభక్తి ఉండదా, ఇదేం సూత్రీకరణ..? ధనవంతులు సాదా జీవనం గురించి చెప్పకూడదా..? వందల కోట్ల ధనికులు కూడా సింపుల్‌గా బతికేవారు బోలెడు మంది, కొందరు అన్నీ వదిలి సన్యాసాన్ని కూడా స్వీకరిస్తున్నారు కదా…
సరే, జగన్ శుద్ధపూస కాదు సరే, దొంగ, సరే… ఎందుకూ అంటే, తనపై కేసులున్నాయట… మరి మార్గదర్శి మీద కూడా కేసులున్నాయి కదా… మార్గదర్శిపై కేసు కక్షసాధింపు అయితే జగన్ మీద కేసులూ అంతే కదా మరి… అసలు రాజకీయ అవినీతి ఏ మార్గాల్లో ఎలా పీక్స్‌కు తీసుకుపోవచ్చో దేశానికి చూపించింది చంద్రబాబు కాదా… రీసెంటుగా సుప్రీంకోర్టు కూడా ఐఎంజీ కేసులో ఓ తీర్పు చెప్పింది కదా…
అధికారం నుంచి దిగిపోయే ముందు ఐఎంజీ అనే ఓ అనామకసంస్థకు 400 ఎకరాలు, స్టేడియాలు, అదీ కేబినెట్ అనుమతి లేకుండా, ప్రభుత్వం రద్దయ్యే వారంలోపే హడావుడిగా ఎందుకు కట్టబెట్టినట్టు… దాదాపు 25 వేల కోట్ల ప్రాపర్టీ అదిప్పుడు… ఆర్థిక నేరగాళ్లు కాని రాజకీయ నాయకులు ఎవరు ఈ రోజుల్లో..? నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు తప్ప పాలిటిక్సులో నీతిమంతులు ఎవరున్నారు..? ప్చ్, దేవులపల్లి రాధాకృష్ణ శాస్త్రి ధోరణి పదే పదే అదే తరహా…!!
Share this Article