Pardha Saradhi Potluri …. “Please be a part of the Maldives’ tourism. Our economy depends on tourism” – Maldivian Govt appeals to Indian Tourists !
అడుక్కు తినండి వెధవల్లారా!
అందుకే మన చుట్టూ ఉన్న దేశాలలో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పేది!
Ads
మోడీ మీద, భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మీరు భారత్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని?
చైనా అండ చూసుకుని మురిసిపోతూ విర్రవీగి ఇప్పుడు ఆ మాటలతో ప్రభుత్వానికి సంబంధం లేదు అని అంటున్నాడు మాల్దీవుల అధ్యక్షుడు మెయిజు!
మాల్దీవుల టూరిజం శాఖ భారత్ లోని ప్రధాన నగరాలలో రోడ్ షోలు నిర్వహించి మాల్దీవులకి రండి అని అభ్యర్ధిస్తారుట!
భారత్ లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒప్పందాలు చేసుకొని ప్రచారం చేస్తారట!
మోడీ పిలుపునిచ్చిన తరువాత మాల్దీవుల టూరిజం ద్వారా వచ్చే ఆదాయం 43% తగ్గింది. భారత రూపాయలలో 468 కోట్లు, $ 56 మిలియన్ డాలర్లు!
దాంతో మాల్దీవుల ఆర్థిక స్థితి కష్టాలలో పడింది.
చైనా తమ దేశ ప్రజలని మాల్దీవులకి విహార యాత్రకు వెళ్ళమని ప్రోత్సహించింది అలాగే చైనా యాత్రికుల సంఖ్య కూడా పెరిగింది మాల్దీవులలో. కానీ ఎక్కడ తేడా కొట్టింది?
చైనా యాత్రికులు రావడం అయితే వస్తున్నారు కానీ ఖర్చు మాత్రం పొదుపుగా చేస్తున్నారు. ఎందుకంటే చైనా వాళ్లకి ప్రయాణ ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి.
So! చైనా యాత్రికుల సంఖ్య పెరిగింది కానీ మాల్దీవుల ఆదాయంలో పెద్దగా మార్పు ఉండడం లేదు!
రోజురోజుకు అప్పులు పెరగడం మొదలయ్యే సరికి అర్ధం అయ్యింది భారత్ తో వైరం వల్ల నష్టమే కాని లాభం ఉండదు అని!
ఎన్నికలలో గెలవడానికి ప్రో -చైనా స్టాండ్ తీసుకొని ఇండియా గో ఔట్ అనే నినాదంతో అదికారంలోకి వచ్చిన మొయిజు ఇప్పుడు ప్రధాని మోడీని పొగుడుతున్నాడు శుంఠ!
తగ్గేదే లే!
ప్రచారం చేసుకోవడానికి భారత్ అనుమతి ఇచ్చింది!
కానీ భారత పర్యాటకులు వెళ్ళరు! వాళ్లకి ప్రచారం ఖర్చు రంధ్రం! ప్రచారం కోసం భారత్ లోని సోషల్ మీడియా వాళ్ళు లాభం పొందుతారు అంతే!
వారం క్రితం ఇద్దరు భారత పర్యాటకులతో ఒక ఇజ్రాయెల్ మహిళ వెళ్ళింది మాల్దీవులకి.
కానీ స్థానికులు చాలా రూడ్ గా ప్రవర్తించారు భారత పౌరులతో!
దీని మీద వివరణ ఇవ్వమని భారత విదేశాంగ శాఖ మాల్దీవులను కోరింది!
వీళ్ళు ఒక పక్క టూరిజం మీద ఆధారపడి బ్రతుకున్నాము అని బ్రతిమలాడుతూ ఇంకో వైపు యూదు మహిళ భారతీయులతో వచ్చింది అని దౌర్జన్యానికి దిగారు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా వుందో అర్థమవుతున్నది!
రెండు రోజుల క్రితం కరాచీలోని వర్తక వాణిజ్య సంఘం పెద్దలు పాకిస్ధాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో సమావేశం అయ్యారు. సదరు వర్తక వాణిజ్య సంఘం పెద్దలు ముక్త కంఠంతో ఒకే మాట అన్నారు: మనం భారత్ తో వర్తక వాణిజ్యం రద్దు చేసుకొని పెద్ద తప్పు చేశాం! వెంటనే దానిని పునరిద్ధరించండి!
ఒక పాండ్స్ పౌడర్ డబ్బా భారత్ లో 36 రూపాయలు ఉంటే అది దుబాయ్ కి చేరుకొని అక్కడ నుంచి పాకిస్థాన్ కి వచ్చే సరికి 72 రూపాయలు అవుతున్నది. మన ప్రజలు స్థానిక కాస్మోటిక్స్ ను కొనడానికి ఇష్ట పడడం లేదు కానీ ధర ఎక్కువ అయినా భారత్ కాస్మోటిక్స్ నే కొంటున్నారు. అదే మనం భారత్ నుండి నేరుగా దిగుమతి చేసుకుంటే డాలర్ల రూపంలో దుబాయ్ కి చెల్లించక్కరలేదు!
ఇలా సాగింది కరాచీ వర్తక వాణిజ్య సంఘం పెద్దల వేడుకోలు!
షాబాజ్ షరీఫ్ విని ఊరుకోగలడు తప్పితే నిర్ణయం తీసుకోవాల్సింది సైన్యం మాత్రమే!
పాండ్స్ పౌడర్ సంగతి పక్కన పెడితే పతంజలి ఉత్పత్తులకి కూడా డిమాండ్ ఉంది పాకిస్ధాన్ లో!
అసలు విషయం ఏమిటంటే పాకిస్ధాన్ కిరాణా షాపుల్లో భారత్ కి చెందిన అన్ని ఉత్పత్తులకి గిరాకీ ఉంది. అన్నీ కాకపోయినా చాలా ప్రొడక్ట్స్ స్మగ్లింగ్ ద్వారా పాకిస్ధాన్ లోకి ప్రవేశించి అమ్ముడు పోతున్నాయి.
మహిళలు వాడే కోడ్ వర్డ్: ఓ వాలా హై క్యా? అంటే భారత్ కి చెందిన కాస్మోటిక్స్ ఉన్నాయా అని అర్థం!
ఇప్పుడు పాకిస్ధాన్ లో కాస్మొటిక్ షాపులలో భారత్ ప్రొడక్ట్స్ అమ్మే షాపులు మాత్రం లాభాల్లో ఉంటున్నాయి!
చివరికి భారత్ లో తయారయిన మరమరాలు కూడా పాకిస్ధాన్ లో దొరుకుతున్నాయి!
బంగ్లాదేశ్ లో భారత దేశ వస్తువులని బహిష్కరించండి అనే ఉద్యమం మొదలయ్యింది. అఫ్కోర్స్ పాకిస్ధాన్, మాల్దీవులలాగా ముడ్డి మాడితే కానీ తత్వం బోధపడదు వీళ్ళకి కూడా!
Share this Article