పవిత్ర జయరాం… 42 ఏళ్ల ఈ కన్నడ టీవీ నటి కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది… ట్రాజెడీ… పవిత్ర జయరాం అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు… తెలుగు టీవీ సీరియల్ ప్రేక్షకులకు త్రినయని తిలోత్తమ అంటే చటుక్కున గుర్తొస్తుంది… నిజంగా తెలుగు టీవీ సీరియళ్లను శ్రద్ధగా చూసేవాళ్లకు షాకింగ్ న్యూసే…
తెలుగు టీవీ సీరియళ్లలో అధికశాతం కన్నడ తారలదే హవా… చాలామంది ఫ్లయిట్లలో వచ్చిపోతుంటారు… కొందరు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు కార్లలో షటిల్ సర్వీస్ చేస్తుంటారు… కొందరు షేరింగ్ వెహికిల్స్‌లో… ప్రస్తుతం ఈమె త్రినయనితోపాటు స్వర్ణ ప్యాలెస్ సీరియల్ చేస్తున్నట్టుంది… గతంలో నిన్నే పెళ్లాడతా సీరియల్‌లోనూ చేసింది… 2009 నుంచీ కన్నడ సీరియళ్లలో పాపులరే… ఒకటీరెండు సినిమాల్లో కూడా చేసింది, కానీ టీవీ సీరియళ్లలోనే ఆమె బిజీజ…
ఇదీ ఆమె గురించి సింపుల్‌గా,.. నిజానికి ఒక టీవీ నటి గురించి ఇంత చెప్పుకోవాలా అనొద్దు… త్రినయని సీరియల్ ప్రేక్షకులకు ఆమెలోని నటన ఏమిటో తెలుసు… ఆమె పాత్ర తెరపై కనిపించగానే ఆమెను చంపేయాలన్నంత కోపం వస్తుంది ఈ ప్రేక్షకులకు… దానికి కారణం ఆ పాత్ర కేరక్టరైజేషన్‌తోపాటు ఆమె దాన్ని పోషించిన తీరు… త్రినయని సవతి అత్త పాత్ర ఆమెది… పక్కా విలన్.,.
Ads
నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రతో ఆమె హీరోయిన్ ఆషిక పడుకోన్‌ను కూడా డామినేట్ చేసేస్తుంది పలు సీన్లలో… కను బొమ్మల్ని విడివిడిగా పైకి ఎగరేస్తూ, కళ్లల్లో విలనీని భలే పర్‌ఫామ్ చేస్తుందామె… మామూలు టీవీ సీరియళ్లలోని అత్తగారిలా కాదు… ఈ పాత్ర వగలు కురిపిస్తుంది, సవతి కొడుకుపై కృత్రిమ ప్రేమను అభినయిస్తుంది… హత్యకు పథకాలు వేస్తుంది… కోడలిపై కోపం…
ఆస్తిపై వ్యామోహం, అప్పుడే అణకువను, అప్పుడే ఆగ్రహాన్ని, అప్పుడే ప్రేమను, అప్పుడే కపటత్వాన్ని ప్రదర్శిస్తుంది… ఇలాంటి చాలా పాత్రలు చాలామంది ఇంతకన్నా బాగా చేశారేమో, చేస్తారేమో కానీ ఈమెది ఓ సపరేట్ ముద్ర… పైగా ప్రైమ్ టైమ్‌లో జీతెలుగులో వచ్చే సీరియల్ కదా, చాలామంది చూస్తారు… జీతెలుగులో టాప్ సీరియల్ ఇది… దాని పాపులారిటీలో ఈమెదీ ప్రముఖ పాత్రే…
నిజానికి సినిమాల్లోకన్నా టీవీ సీరియళ్లలో, వెబ్ సీరీస్‌లలో ఉద్వేగ ప్రదర్శన కాస్త కష్టం… టీవీ సీరియళ్లలో లాంగ్ షాట్స్ గాకుండా ఎక్కువగా క్లోజప్స్ ఉంటాయి… మొహంలో ఉద్వేగాల్ని స్పష్టంగా పలికించగలగాలి… ఇలాంటి తారలే అందులో ప్రసిద్ధులు… ప్చ్, తెలుగు టీవీ ఓ మంచి అందమైన నటిని కోల్పోయింది… వీడ్కోలు తిలోత్తమా…!! (ఆ త్రినయని సీరియల్ చూసేవాళ్లకు మాత్రమే ఈ హెడింగ్ అర్థమవుతుంది)…
Share this Article