Subramanyam Dogiparthi….. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా, పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిధి కాదా, అదే పరమార్ధం కాదా … పేరంటాలలో , పెళ్ళిచూపుల్లో వీర పాపులర్ అయిన పాట . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన సతీ అనసూయ సినిమాలో పాట ఇది . సతీ అనసూయ కథలో సతీ సుమతి కథ కూడా కలిసి ఉంటుంది . 1971 సినిమాలో అనసూయగా జమున , సుమతి/నర్మదగా శారద నటించారు . శోభన్ బాబు నారదుడిగా , కాంతారావు అత్రి మహర్షిగా , సత్యనారాయణ కౌశికుడిగా నటించారు .
సతీ అనసూయ టైటిల్ మీద తెలుగులో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి . 1957 లో వచ్చిన సినిమాలో అనసూయగా అంజలీదేవి నటిస్తే , సుమతిగా జమున నటించింది . అత్రి మహర్షిగా గుమ్మడి , కౌశికుడిగా NTR నటించారు . ఈ సినిమాకు ధర్శకుడు కన్నాంబ భర్త నాగభూషణం . పద్మనాభం నారదుడిగా నటించారు .
1935 లో వచ్చిన సినిమాలో దాసరి కోటిరత్నం , లీలాకుమారి , తుంగల చలపతిరావు , లక్ష్మణస్వామి ప్రభృతులు నటించారు . 1936 లో వచ్చిన సినిమాలో కృష్ణవేణి ప్రభృతులు నటించారు .
Ads
ఇలా సతీ అనసూయ , సతీ సావిత్రి , సతీ సక్కుబాయి కధాంశాలతో 1970s వరకు సినిమాలు వచ్చాయి . ప్రేక్షకులూ ఆదరించారు . ఆ తర్వాత కాలంలో ఈ పతి దేవాయ నమః సందేశాలను ఆదరించే రోజులు పోయాయి . అయితే ఈరోజుకీ రామాయణం , భారతం , భాగవతం కధలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు . NTR , బాపు వంటి గొప్ప దర్శకులు చక్కటి చిత్రాలను అందించారు . ఈమధ్య కాలంలో వచ్చిన క్షమించరాని సినిమా ఆదిపురుష్ .
Share this Article