ముందుగా క్షమాపణలు కోరుతున్నా… ఆ గలీజు భాషలోనే హెడింగ్ పెట్టినందుకు… మల్ల ఏం జెయ్యాలె, ఎవరి భాషల చెప్పితే వాళ్లకు సమజైతది…! చార్మి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అట… ఓ టీజర్ రిలీజ్ చేశారు… అందరూ ఓహో ఆహా అని మస్తు రాస్తున్నారు…
హీరో రామ్ అట మాస్ యాక్షన్ సీన్లు కుమ్మిపడేశాడట, పాన్ ఇండియా మూవీ అట, దత్తు సంజయుడిని తెచ్చి పెట్టుకున్నారట, మరో బంపర్ హిట్ పక్కా అట… ఔనా, అంత సీనుందా అని చూస్తే… చిరాకెత్తింది…
ఈమధ్య తెలుగు సినిమా వాళ్లకు తెలంగాణ యాస, కల్చర్ అంటే, తాగుడు, బూతులే అన్నట్టుగా మారింది… అంతకుముందేమో తెలంగాణ యాసను ఇంకోరకంగా గేలి చేసేవాళ్లు… ఇప్పుడేమో మరోరకంగా అవమానిస్తున్నారు… (బలగం, షరతులు వర్తిస్తాయి వంటి సినిమాలు మినహాయింపు)…
Ads
సరే, ఈ డబుల్ స్మార్ట్ శంకర్ టీజర్ చూడబోతే అచ్చంగా ఆ ఇస్మార్ట్ శంకర్ అనబడే సినిమాకు సీక్వెల్ అన్నట్టుగా కనిపించింది… అదే పోకడ… ఇంకాస్త యాక్షన్ మసాలా దట్టించి, చివరలో మళ్లీ కాస్త భక్తులు, యోగులా బ్యాక్‌డ్రాప్‌లో అవే క్లైమాక్స్ ఫైట్లున్నట్టున్నయ్…
సరే, పోతినేని రామ్ తెలంగాణ డిక్షన్ అత్యంత కృతకంగా ఉంది… (ఇలాంటి విషయాల్లో నానిని మెచ్చుకోవాలి, సహజంగా వినిపించేలా లోకల్ డయలెక్ట్ ట్రై చేస్తాడు)… ఇక ఆ భాష, డైలాగులు మరీ జబర్దస్త్, సోషల్ మీడియా ట్రోలర్స్ భాషను తలపిస్తున్నాయి… అసలు టీజర్ టైటిలే దిమాకికిరికిరి అని పెట్టారు… మాకి కిరికిరి అర్థం తెలుసా వీళ్లకు అసలు..? యాణ్నుంచి వస్తర్ర భయ్…
టీజర్‌లోనే గాండూ, మాదచ్చోద్, నీయమ్మరేయ్, నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డుల కాల్తది… ఒక్కొక్కరి మొలకు లడీ కడతా… గ్రనేడ్ గుచ్చి పిన్ను పీకుతా… వంటి డైలాగులు యథేచ్ఛగా వినిపించాయి… ఇక అసలు సినిమాలో ఇంకా ఏ రేంజులో ఉన్నాయో…
శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి ఈటీవీ ప్రోగ్రాముల్లో హైపర్ ఆది వంటి కమెడియన్లు తీసుకొచ్చి రుద్దిన గలీజు భాష… వంగడం, మింగడం వంటి పదాలు… అసలు బూతులు ధ్వనించేలా దాదాపు ఇదే భాషను సోషల్ మీడియా ట్రోలర్లు వాడుతున్నారు… గువ్వ, మింగడం వంటి పదాలు… ఇదంతా ఓ వికారభాష… దీన్ని జబర్దస్త్ భాష అనాలేమో…
అసలే థమన్, మహేశ్ బాబు మొన్నామధ్య కుర్చీ మడతబెట్టి– వంగారు కదా… (మళ్లీ సారీ…) అంతకుముందు ఎవరో కేసీపీడీ అని వాడినట్టు గుర్తు… బూతులు, బజారు భాషను ఇప్పుడు నేరుగా, సినిమాల్లో హీరోకే పెట్టేస్తున్నారు… దానికి తెలంగాణ కలరింగ్ ఇవ్వడమే చిరాకెత్తించేది… గుడ్డుల కాల్తది అందే అర్థమైంది కదా, అలాగే గ్రనేడ్ గుచ్చి పిన్ను పీకుతా అట… ఎక్కడ గుచ్చుతాడో సమజైంది కదా…
అంతకుముందు పైసావసూల్ వంటి పాటల్లో దరిద్రమైన చేతి సైగలను ప్రదర్శించిన బాలయ్య డైలాగుల్లో మాత్రం అసలు పదాల్ని దాచేసి, మాదాపూర్, గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా వంటి మార్మిక పదాలతో కవర్ చేశాడు… అవి కొంత నయం… మరీ పోతినేని రామ్ కాదు కదా… ఇలాంటి గుడ్డుల కాలే భాష వాడటానికి..!!
Share this Article