Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదేమిటో హఠాత్తుగా పడక మీద అక్కినేని బదులు కమల్ కనిపిస్తాడు..!

May 16, 2024 by M S R

Subramanyam Dogiparthi….. కోడళ్ళని ఆరళ్ళు పెట్టే తెలుగు వారి అత్త సూరేకాంతం లేడీ విలన్ గా వేసిన సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీమంతుడు సినిమా . ANR ఇంకా ప్రేమనగర్ లోని కల్యాణ్ పాత్ర హేంగోవర్ లోనే ఉన్నాడా అని అనిపించే పాత్ర అక్కినేనిది ఈ సినిమాలో కూడా కొంతవరకు . కలర్ పిక్చర్స్ మధ్యలో ఇరుక్కుపోయిన బ్లాక్ & వైట్ సినిమా కావటంతో ఏవరేజ్ గా మాత్రమే ఆడింది . అది కూడా పాటలన్నీ బాగా హిట్ కావటం వలన .

టి చలపతిరావు సంగీత దర్శకులు . చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు , ఆహా ఏమందము , మొదటి పెగ్గులో మజా , ఎంతో చిన్నది జీవితం , చల్లని వెన్నెలలో , హరిలో రంగ హరీ , కొంటె చూపులెందుకులేరా , బులి బులి ఎర్రని బుగ్గలదానా వంటి శ్రావ్యమైన పాటలు ఉన్నాయి . ఈ పాటల్లో ANR డాన్సులు , స్టెప్పులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి కూడా . ఈ సినిమాలో ఒక్క క్షణం కమల్ హసన్ తళుక్కుమంటాడు .

ఈ సినిమాకు తంగప్ప కొన్ని డాన్సులను సమకూర్చారు . అప్పట్లో కమల్ హసన్ అతని వద్ద అసిస్టెంట్ . మొదటి పెగ్గులో మజా అనే పాటలో పడక మీద ANR కు బదులు కమల్ ఒక్క క్షణం కనిపిస్తాడు . అలా ఎందుకు జరిగిందో తెలియదు .

అతిలోకసుందరి శ్రీదేవి బాలనటిగా చిట్టిపొట్టి బొమ్మలు పాటలో ఆరిందా లాగా నటిస్తుంది . జమున నటన కూడా చాలా బాగుంటుంది . గుమ్మడి , ఝాన్సీ , రాజబాబు , రావి కొండలరావు , సూరేకాంతం , సాక్షి రంగారావు , రమణారెడ్డి , మాస్టర్ ఆదినారాయణ ప్రభృతులు నటించారు .

జి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు ప్రత్యగాత్మ దర్శకుడు . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . అక్కడక్కడ కాస్త విసిగించినా చూడబులే . పాటలు జోరుగా , హుషారుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions