రాళ్ళపల్లి రాజావలి…. కజకిస్తాన్ లో “ఇరుగు పొరుగు” ముచ్చట!
డిన్నర్ లో ఫ్రైడ్ చికెన్ తినాలని పోతే.. వీళ్లిద్దరూ ఉన్నారు. come from India ? అని అడిగా. ‘We are from .. Islamabad , Pakistan’ అన్నారు. is This part time job? అని అడిగా. ‘Yes.. we are MBBS students ..we are working two days in a week for Indian hotels’ అన్నది కుడిపక్కన అమ్మాయి…
మీకు ఇండియా? ఇష్టమా అని అడిగా. ఇద్దరి ముఖాలు వెలిగిపోయాయి. “MBBS India లోనే మాకు చదవాలనిపించింది. Costly కాబట్టి కజకిస్తాన్ లో జాయినయ్యాము “ అన్నారు.
Ads
మీ దేశంలో ఇంగ్లీషు బాగా వస్తుందా? అని అడిగా. పనిలో పనిగా మీరు మా దేశాన్ని ద్వేషిస్తారా? అని సూటిగా అడిగా. ఎడమ పక్కన అమ్మాయి అందాకా మౌనంగా ఉంది. ఆమె ఇలా అంది.. “ మీడియా, పొలిటికల్ టాక్స్ వింటే అలా ఉంటుంది. “వియ్ ఆర్ కూల్ .. బట్ పేదరికం పెద్ద సమస్య” అన్నది.
తప్పనిసరై “నేను మీడియా” అని సిగ్గుతో చెప్పా. మీరు చెప్పేది నిజమా? అని అడిగా. “పవర్ కోసం ఏ పొలిటీషియన్ అయినా మనుషులను ఎక్కడయినా డివైడ్ చేస్తారు” అన్నారు…
నా మిత్రుడు సుదర్శన్ రెడ్డి ఖతార్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్… “ తన ఆఫీసులో పని చేసే తోటి పాకిస్తాన్ ఉద్యోగులు చాలా మంచి వాళ్లు” అని అన్నాడని చెప్పాను. “Thank you so much” అన్నది ఎడమ పక్క అమ్మాయి. టెర్రరిజం అంటే నాకు కోపం అన్నాను. “పేదరికం, అజ్ఞానం అందుకు కారణం. కొందరు ఉంటారు అలా. అందరూ అలా ఉండరు”అన్నారు. Sorry .. universal చేసినందుకు అని అన్నాను. “It’s all right .. మాకు ఇలాంటి టాక్స్ casual “అన్నారు…
నా మీడియా జాబ్ గురించి అడిగారు. Woman’s page కి contribute చేస్తానన్నా. I am from Hyderabad, you know Charminar? అని అడిగా. “We know Irani chai.. chicken dum biryani “ అన్నారు. How do you know ? అని అడిగా. కిచెన్ లోపలకు వెళ్లి ఎడమ పక్కన అమ్మాయి .. ఓ అబ్బాయిని పిలుచుకొచ్చింది.
He is from your native place అన్నది… అ అబ్బాయి పేరు ప్రణవ్ . “మాది మెహదీపట్నం” అన్నాడు. Pistha house chai, 4 seasons గురించి మాట్లాడుకున్నాం. తెలుగులో మాట్లాడుకున్నాం. వీళ్లు ? అని అడిగా. “సర్ .. వీళ్లు చానా మంచోళ్లు. మా క్లాస్ మేట్స్ . పాకిస్తాన్ వాళ్ల గురించి ఇక్కడికి వచ్చాకనే తెల్సింది” అన్నారు. ముందు వీళ్ల మీద కోపం ఉండేది అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. “బయటకు వస్తేనే జనాల గురించి తెలిసేది” అన్నాను. True అన్నాడు ఆ అబ్బాయి.
ఆ తర్వాత “ఖీర్ తినండి” అన్నది కప్పులో తీసుకొచ్చి కుడి పక్కన అమ్మాయి. అంతే వేగంగా ఎడమ పక్కన అమ్మాయి చెంచా తీసుకొచ్చినాది. రుచికరమైన ఖీర్ అది… నిజంగానే!
ఆ అబ్బాయి కొన్ని డిష్ లు తేవాలి.. పని ఉంది సార్ ! అని నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. “పిస్తా ఛాయ్ కు Hyderabad లో కలుద్దాం “ అన్నాను.
ఆ తర్వాత పాకిస్తాన్ లో education system , politicians గురించి అడిగా. రాజకీయనాయకులను అసహ్యించుకున్నారు మూకుమ్మడిగా!
నిజంగా…
ఇంటి పొరగోడ పంచాయితీ..
కలం కాడ బండ్రేవు కథ..
చేని కాడ గట్టు పంచాయితీ.. తెగవు!
అలానే దేశాల మధ్య సరిహద్దు వివాదం
ఎమోషన్ల ఊపరగొట్టంతో ఊది..
ఆ నిప్పుల కొలిమిలో చలి కాచుకుని..
అధికారం కోసం
ప్రాకులాడే పొలిటీషియన్లను
అసహ్యించుకోవడం మానేసి..
కాస్త డీప్ గా ఆలోచించా.
రంగుతో..
డబ్బుతో, మతంతో, భూమిపై బార్డర్లు గీసి.. విభజించడం
అనాదిగా ఉండేదే!
అజ్ఞానము, మూర్ఖత్వమూ అంతే పురాతనమైనది అనుకుని..
డిన్నర్ main course కు రెడీ అయ్యాను.
బాస్మతి బియ్యం మెతుకులు రుచిగా ఉన్నా.. ఆ బువ్వ సహించలేదు..
కజకిస్తాన్ లో కళ్లు తెరిపించిన ఆ ఇద్దరు డాక్టరమ్మలకు “bye” చెప్పినా.
Selfi ok na ?
Yes.. why not ? అన్నారు!
Life is so good..
Life is so short
సర్వేజనా సుఖినోభవంతు.
.
రాళ్లపల్లి రాజావలి, from Almaty, kazakisthan country…
Share this Article